Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 21:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 మీరు ఇచ్చిన విజయాల వలన అతని గొప్ప కీర్తి కలిగింది; మీరు ఘనతా ప్రభావాలతో అతడిని అలంకరించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 నీ రక్షణవలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి యున్నావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 నీ జయం వల్ల అతనికి గొప్ప మహిమ కలిగింది. శోభ, ఘనత నువ్వు అతనికి కలగజేశావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 రాజుకు నీవు విజయాన్నిచ్చావు కనుక అతనికి గొప్ప కీర్తి వచ్చింది. నీవు అతనికి గౌరవం, ఘనత ఇచ్చావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 మీరు ఇచ్చిన విజయాల వలన అతని గొప్ప కీర్తి కలిగింది; మీరు ఘనతా ప్రభావాలతో అతడిని అలంకరించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 21:5
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

ప్రభువైన యెహోవా! మీ దృష్టిలో ఇది చాలదన్నట్టు మీ సేవకుని కుటుంబ భవిష్యత్తు గురించి కూడా తెలియజేశారు. ప్రభువైన యెహోవా! మామూలు మనుష్యుల పట్ల మీరు ఇంత కార్యం చేస్తారా?


నీ తండ్రియైన దావీదులా నీవు నా మార్గాన్ని అనుసరిస్తూ, నా శాసనాలను, ఆజ్ఞలను పాటిస్తే, నేను నీకు దీర్ఘాయువు ఇస్తాను.”


ఇప్పుడు మీ సేవకుని వంశం నిత్యం మీ సన్నిధిలో ఉండేలా దీవించడం మీకు ఇష్టమైనది; ఎందుకంటే యెహోవా, మీరు దానిని దీవిస్తే అది శాశ్వతంగా దీవించబడుతుంది.”


యెహోవా నా ప్రభువుతో చెప్పిన మాట: “నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేసే వరకు నీవు నా కుడిచేతి వైపున కూర్చో.”


అది సీయోను కొండలమీదికి దిగివచ్చే హెర్మోను మంచులా ఉంటుంది. యెహోవా తన ఆశీర్వాదాన్ని, జీవాన్ని కూడా నిరంతరం అక్కడ కుమ్మరిస్తారు.


కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా, నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు.


అతడు శాశ్వతంగా దేవుని సన్నిధిలో సింహాసనాసీనుడై ఉంటారు; మీ మారని ప్రేమ, మీ నమ్మకత్వం అతన్ని కాపాడాలి.


నా రక్షణ నా ఘనత దేవుని పైనే ఆధారపడి ఉన్నాయి; ఆయన నాకు శక్తివంతమైన కొండ, నా ఆశ్రయము.


మీరు వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశారు, మహిమ ఘనతను వారికి కిరీటంగా పెట్టారు.


వైభవం, ప్రభావం ఆయన ఎదుట ఉన్నాయి; బలం, మహిమ ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాయి.


రక్తపు మరకలు కలిగిన బట్టలు వేసుకుని ఎదోము నుండి బొస్రానుండి వస్తున్న ఇతడెవరు? రాజ వస్త్రాలను ధరించి గంభీరంగా నడుస్తూ గొప్ప బలంతో వస్తున్న ఇతడెవరు? “విజయాన్ని ప్రకటిస్తూ రక్షించగల సమర్థుడనైన నేనే.”


యేసు వారి దగ్గరకు వచ్చి, “పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది.


యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత ఆకాశం వైపు చూస్తూ ఇలా ప్రార్థించారు: “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచేలా నీ కుమారుని మహిమపరచు.


మనం ఏకంగా ఉన్నట్లు వారు కూడ ఏకంగా ఉండాలని నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను.


తండ్రీ, ఈ లోక ఆరంభానికి ముందు నీతో నాకు ఉండిన మహిమతో ఇప్పుడు నన్ను నీ సన్నిధిలో మహిమపరచు.


మనం చెప్తున్న దానిలోని ముఖ్య సారాంశమిది: పరలోకంలో సర్వోన్నతుని సింహాసనం యొక్క కుడి వైపున కూర్చుని ఉన్న వానిని మనం ప్రధాన యాజకునిగా కలిగి ఉన్నాం,


ఆయన పరలోకానికి వెళ్లి దూతలమీద, అధికారుల మీద, శక్తులమీద అధికారం పొందినవాడై, దేవుని కుడి వైపున ఉన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ