Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 20:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 యెహోవా తన అభిషిక్తునికి విజయాన్ని ఇస్తారని ఇప్పుడు నాకు తెలిసింది. రక్షణ కలిగించే తన కుడిచేతి మహాబలంతో ఆయన తన పరలోకపు పరిశుద్ధాలయం నుండి అతనికి జవాబిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు తెలియును రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములోనుండి అతనికి ఉత్తరమిచ్చును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షిస్తాడని నాకిప్పుడు తెలిసింది. రక్షించగల తన కుడిచేతి బలంతో తన పవిత్రాకాశంలోనుంచి అతనికి జవాబిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయం చేస్తాడని నాకు తెలుసు. దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు. ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయోగించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 యెహోవా తన అభిషిక్తునికి విజయాన్ని ఇస్తారని ఇప్పుడు నాకు తెలిసింది. రక్షణ కలిగించే తన కుడిచేతి మహాబలంతో ఆయన తన పరలోకపు పరిశుద్ధాలయం నుండి అతనికి జవాబిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 20:6
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీ దాసుడు, మీ ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి విన్నపం ఆలకించండి. మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి, మీరు విన్నప్పుడు క్షమించండి.


మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి. విదేశీయులు మిమ్మల్ని ఏమి అడిగినా అది వారికి చేయండి. అప్పుడు భూలోక ప్రజలు మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లా మీ పేరు తెలుసుకొని మీకు భయపడతారు. నేను కట్టిన ఈ మందిరం మీ పేరు కలిగి ఉందని తెలుసుకుంటారు.


మారని మీ ప్రేమలోని అద్భుతాలను నాకు చూపించండి, తమ శత్రువుల నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఆశ్రయించే వారిని మీ కుడిచేతితో మీరు రక్షిస్తారు.


మీ రక్షణ సహాయాన్ని నా డాలుగా చేస్తారు, మీ కుడిచేయి నన్ను ఆదరిస్తుంది; మీ సహాయం నన్ను గొప్ప చేస్తుంది.


ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు; ఆయన తన అభిషిక్తుడైన దావీదుకు అతని సంతానానికి, తన మారని ప్రేమను చూపిస్తారు.


యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచి పాలకులందరు ఒకటిగా చేరి,


యెహోవాయే తన ప్రజలకు బలము. తన అభిషిక్తుడికి ఆయనే రక్షణ దుర్గము.


నా శత్రువు నాపై విజయం సాధించలేదు కాబట్టి, నేనంటే మీకు ఇష్టమని నేను తెలుసుకున్నాను.


తాము త్రవ్విన గోతిలోనే దేశాలు పడిపోయాయి; తాము పన్నిన వలలోనే వారి పాదాలు చిక్కుకున్నాయి.


ఎందుకంటే మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసియైన దేవుడు ఇలా చెప్తున్నారు: “నేను ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాను, అంతేకాక వినయం గలవారి ఆత్మకు చైతన్యం కలిగించడానికి నలిగినవారి ప్రాణానికి చైతన్యం కలిగించడానికి ఆత్మలో వినయం, దీనమనస్సు గలవారి దగ్గర నివసిస్తాను.


అప్పుడు మీరు పిలిస్తే యెహోవా జవాబిస్తారు; మీరు మొరపెడితే ఆయన నేనున్నాను అంటారు. “మీరు ఇతరులను బాధించడం, వ్రేలుపెట్టి చూపిస్తూ చెడు మాట్లాడడం మానేస్తే,


పరలోకం నుండి, గంభీరమైన, పరిశుద్ధమైన మహిమగల సింహాసనం నుండి క్రిందికి చూడండి. మీ ఆసక్తి మీ బలము ఏవి? మా పట్ల మీకున్న జాలి కనికరం మా నుండి నిలిపివేయబడ్డాయి.


అన్ని దేశాల ప్రజలు తమ దేవుళ్ళ పేరిట నడుచుకుంటారు, అయితే మేము మా దేవుడైన యెహోవా పేరును బట్టి ఎల్లకాలం నడుచుకుంటాము.


“మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి: “ ‘పరలోకమందున్న మా తండ్రీ, మీ నామం పరిశుద్ధపరచబడును గాక,


దేవుని కుడిచేతి వైపుకు ఎత్తబడి, తండ్రి చేసిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మను పొందుకొని ఇప్పుడు మీరు చూస్తూ వింటున్న దానిని మీమీద కుమ్మరించారు.


“కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరు ఖచ్చితంగా తెలుసుకోవలసింది ఏంటంటే: మీరు సిలువ వేసిన ఈ యేసునే, దేవుడు ప్రభువుగా క్రీస్తుగా చేశారు.”


మీరు ఇశ్రాయేలు ప్రజలందరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు ఎవరిని సిలువ వేశారో, దేవుడు మరణం నుండి ఎవరిని తిరిగిలేపారో, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామాన్ని బట్టే, ఇతడు స్వస్థపడి మీ ముందు నిలబడ్డాడు.


ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలకు పశ్చాత్తాపాన్ని, పాపక్షమాపణను దయచేయడానికి, దేవుడు ఆయనను అధిపతిగా రక్షకునిగా తన కుడిచేతి వైపుకు హెచ్చించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ