కీర్తన 146:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 యెహోవా పరదేశీయులను కాపాడతారు. తండ్రిలేని అనాధ పిల్లలను, విధవరాండ్రను ఆదరిస్తారు. కాని దుష్టుల ప్రణాళికలను ఆయన వ్యతిరేకిస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించు వాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఇతర జాతుల ప్రజలను యెహోవా కాపాడతాడు. తండ్రిలేని అనాథలను, విధవరాళ్ళను ఆదరించేవాడు ఆయనే. దుష్టులను ఆయన వ్యతిరేకిస్తాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు. విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు. అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 యెహోవా పరదేశీయులను కాపాడతారు. తండ్రిలేని అనాధ పిల్లలను, విధవరాండ్రను ఆదరిస్తారు. కాని దుష్టుల ప్రణాళికలను ఆయన వ్యతిరేకిస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |
“తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వస్తాను, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నాకు భయపడక జీతాల విషయంలో కూలివారిని మోసం ఉద్యోగులను మోసం చేసేవారికి, విధవరాండ్రను అనాధలను అణచివేసే వారికి, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు న్యాయం జరుగకుండ చేసేవారికి వ్యతిరేకంగా నేను మాట్లాడతాను” అని సైన్యాల యెహోవా అంటున్నారు.