Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 142:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 చూడండి, నా కుడివైపు ఎవరు లేరు; ఎవరు నా గురించి పట్టించుకోరు నాకు ఆశ్రయం లేదు; ఒక్కరైన నాపై దయ చూపించరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 నా కుడిప్రక్కను నిదానించి చూడుము నన్నెరిగినవాడు ఒకడును నాకు లేకపోయెను ఆశ్రయమేదియు నాకు దొరకలేదు నాయెడల జాలిపడువాడు ఒకడును లేడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 నా కుడి పక్కన చూస్తే నన్ను ఆదరించేవాడు ఒక్కడు కూడా కనిపించలేదు. తప్పించుకునే దారి లేదు. నాప్రాణం గురించి పట్టించుకునే వాడే లేడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు. పారిపోవుటకు నాకు స్థలం లేదు. నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 చూడండి, నా కుడివైపు ఎవరు లేరు; ఎవరు నా గురించి పట్టించుకోరు నాకు ఆశ్రయం లేదు; ఒక్కరైన నాపై దయ చూపించరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 142:4
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాని దుర్మార్గుల చూపు మందగిస్తుంది. తప్పించుకొనే చోటు వారికి దొరకదు; ప్రాణం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తారు.”


నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది.


నేను యెహోవాతో, “నా దేవుడు మీరే” అని చెప్తాను. యెహోవా, దయతో మొరను ఆలకించండి.


కీడుచేసేవారి ఉచ్చుల నుండి, వారు నా కోసం వేసిన వల నుండి నన్ను క్షేమంగా ఉంచండి.


నా ఆత్మ నాలో సొమ్మసిల్లిపోయింది; నా హృదయం నాలో బెదిరిపోయింది.


నా శత్రువులందరి కారణంగా పొరుగువారు నన్ను ఎగతాళి చేస్తున్నారు నన్ను చూసి నా స్నేహితులు భయపడుతున్నారు వీధిలో నన్ను చూసేవారు నా నుండి పారిపోతున్నారు.


వారు చేసిన అవమానాలకు నా గుండె బద్దలయ్యింది. నేను నిరాశలో ఉన్నాను; నేను సానుభూతి కోసం చూశాను, కానీ ఎవరూ లేరు ఆదరించేవారి కోసం చూశాను, కానీ ఒక్కరూ దొరకలేదు.


నా స్నేహితులను నా పొరుగువారిని నాకు దూరం చేశారు చీకటే నాకు దగ్గరి స్నేహితుడు.


నా దగ్గరి స్నేహితులను నా నుండి దూరం చేశారు నన్ను వారికి అసహ్యమైన వానిగా చేశారు. నేను నిర్బంధించబడ్డాను నేను తప్పించుకోలేను;


మీరు అకస్మాత్తుగా వారిపైకి దండెత్తే వారిని రప్పించినప్పుడు, వారి ఇళ్ళలో నుండి కేకలు వినబడాలి, ఎందుకంటే వారు నన్ను పట్టుకోవడానికి గొయ్యి త్రవ్వారు, నా పాదాలకు రహస్య ఉచ్చులు బిగించారు.


గొర్రెల కాపరులకు పారిపోవడానికి చోటు ఉండదు, మందలోని నాయకులు తప్పించుకోవడానికి స్థలం ఉండదు.


అయితే నేను నీకు స్వస్థత కలుగజేసి నీ గాయాలను బాగుచేస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ఎందుకంటే ‘నీవు వెలివేయబడినవాడవని, సీయోనును ఎవ్వరూ పట్టించుకోరు’ అని నీ గురించి అన్నారు.


“విలువలేని విగ్రహాలను పూజించేవారు, తమ పట్ల దేవునికున్న ప్రేమకు దూరమవుతారు.


అయితే ప్రవక్తలు వ్రాసిన లేఖనాలు నెరవేరడానికే ఈ విధంగా జరిగింది” అని చెప్పారు. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయారు.


నేను మొదటిసారి న్యాయసభలో నాపై వేయబడిన ఆరోపణలకు జవాబు ఇస్తున్నప్పుడు ఎవరూ నా పక్షాన నిలబడలేదు, అందరు నన్ను వదిలి వెళ్లిపోయారు. అది వారికి వ్యతిరేకంగా ఉండకూడదు


అయితే దావీదు తనలో తాను, “ఏదో ఒక రోజు నేను సౌలు చేతిలో నాశనమవుతాను. నేను చేయగలిగిన ఉత్తమమైన పనేంటంటే ఫిలిష్తీయుల దేశానికి తప్పించుకు పోవడమే. అప్పుడు సౌలు ఇశ్రాయేలు దేశంలో నన్ను వెదకడం మానేస్తాడు, కాబట్టి నేను అతని చేతిలో నుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ