Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 136:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 చేయి చాచి తన బలమైన హస్తంతో వారిని రప్పించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 చేయి చాచి తన బాహుబలముచేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 ఆయన చెయ్యి చాపి తన భుజబలంతో ఇశ్రాయేలీయులను రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 దేవుడు తన గొప్ప శక్తిని బలాన్ని చూపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 చేయి చాచి తన బలమైన హస్తంతో వారిని రప్పించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 136:12
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

తమ ఖడ్గంతో ఈ దేశాన్ని వారు వశం చేసుకోలేదు, తమ భుజబలంతో విజయం సాధించలేదు; మీరు వారిని ప్రేమించారు కాబట్టి మీ కుడిచేయి మీ భుజబలం మీ ముఖకాంతియే వారికి విజయాన్ని ఇచ్చింది.


“భవిష్యత్తులో మీ కుమారుడు, ‘దీని అర్థమేంటి?’ అని మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు వానితో ఇలా చెప్పాలి, ‘బలమైన హస్తంతో యెహోవా బానిస దేశమైన ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు రప్పించారు.


అప్పుడు మోషే ప్రజలతో ఇలా అన్నాడు, “మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు నుండి మీరు బయటకు వచ్చిన ఈ రోజును మీరు స్మారకోత్సవంగా జరుపుకోండి, ఎందుకంటే యెహోవా తన బలమైన హస్తంతో దాని నుండి మిమ్మల్ని బయటకు రప్పించారు. పులిసిన దేన్ని తినకూడదు.


యెహోవా, మీ కుడిచేయి, బలంలో మహిమగలది. యెహోవా, మీ కుడిచేయి, శత్రువును పడగొట్టింది.


“కాబట్టి, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను యెహోవాను, ఈజిప్టువారి వెట్టిచాకిరి నుండి నేను మిమ్మల్ని బయటకు తీసుకువస్తాను. మీరు వారికి బానిసలుగా ఉండకుండ నేను మిమ్మల్ని స్వతంత్రులను చేస్తాను, చాపబడిన బాహువుతో, గొప్ప తీర్పు చర్యలతో నేను మిమ్మల్ని విమోచిస్తాను.


మీ ప్రజలైన ఇశ్రాయేలీయులను సూచకక్రియలతో, అద్భుతాలతో, బలమైన చేతితో, చాచిన బాహువుతో, గొప్ప భయాన్ని కలిగించి ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చారు.


అతడు ఈజిప్టులో, ఎర్ర సముద్రం దగ్గర నలభై సంవత్సరాలు అరణ్యంలో అద్భుతాలను సూచకక్రియలను చేసి వారిని ఈజిప్టు నుండి బయటకు నడిపించాడు.


మీ దేవుడైన యెహోవా ఈజిప్టులో మీ కళ్ళెదుట మీ కోసం శోధనలతో, సూచకక్రియలతో, అద్భుతాలతో, యుద్ధంతో, బలమైన హస్తంతో, చాచిన చేతితో మహా భయంకరమైన కార్యాలతో సమస్త కార్యాలను చేసినట్లు ఏ దేవుడైన తన కోసం ఒక దేశం నుండి మరొక దేశాన్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడా?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ