Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 132:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 “ఇది నిత్యం నాకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది; ఇక్కడ నేను సింహాసనాసీనుడనవుతాను, ఎందుకంటే నేను దీనిని కోరుకున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగానుండును ఇక్కడనే నేను నివసించెదను

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 ఇది నేను కోరుకున్న స్థలం. ఇది శాశ్వతంగా నా విశ్రాంతి స్థలంగా ఉంటుంది. ఇక్కడే నేను నివసిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం. నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 “ఇది నిత్యం నాకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది; ఇక్కడ నేను సింహాసనాసీనుడనవుతాను, ఎందుకంటే నేను దీనిని కోరుకున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 132:14
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను మీ కోసం ఘనమైన మందిరాన్ని కట్టించాను, అది మీరు ఎల్లకాలం నివసించగలిగే స్థలం” అని అన్నాడు.


“దేవుడు భూమి మీద నిజంగా నివాసం చేస్తారా? ఆకాశ మహాకాశం మీకు సరిపోవు, నేను కట్టించిన ఈ మందిరం ఏం సరిపోతుంది!


యెహోవా అతనితో ఇలా అన్నారు: “నా సమక్షంలో నీవు చేసిన ప్రార్థన విన్నపం విన్నాను; నీవు కట్టించిన ఈ మందిరంలో నా పేరు ఎప్పటికీ ఉండాలని నేను దీనిని ప్రతిష్ఠించాను. నా కనుదృష్టి, నా హృదయం ఎల్లప్పుడు దీనిపై ఉంటాయి.


ఎందుకంటే దావీదు, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలకు నెమ్మది ప్రసాదించి, శాశ్వతంగా యెరూషలేములో నివసించడానికి వచ్చారు కాబట్టి,


‘యెహోవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో, మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి.


సీయోనులో నుండి యెహోవా స్తుతించబడును గాక, ఆయన యెరూషలేములో నివసిస్తారు. యెహోవాను స్తుతించండి.


కఠినమైన పర్వతమా, దేవుడు పరిపాలించడానికి ఎన్నుకున్న పర్వతం వైపు ఎల్లకాలమూ యెహోవా నివసించే స్థలం వైపు ఎందుకు అసూయతో చూస్తావు?


యెహోవా దేవా, మీరు నిత్యం పాలించడానికి పైకి ఆరోహణమైనప్పుడు, మీరు అనేకమందిని చెరపట్టి తీసుకెళ్లారు; మీరు మనుష్యుల నుండి ఈవులు స్వీకరించారు, తిరుగుబాటుదారుల నుండి కూడా స్వీకరించారు.


షాలేములో ఆయన గుడారం ఉంది. సీయోనులో ఆయన నివాసస్థలం ఉంది.


యాకోబు ఇతర నివాసాలన్నిటికంటె యెహోవా సీయోను గుమ్మాలను ఎక్కువగా ప్రేమిస్తారు.


ఆ రోజున యెష్షయి వేరు జనాంగాలకు ధ్వజంగా నిలుస్తుంది; దేశాలు అతనివైపు వస్తాయి, అతని విశ్రాంతి స్థలం మహిమగలదిగా ఉంటుంది.


సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి, ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”


ఎందుకంటే మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసియైన దేవుడు ఇలా చెప్తున్నారు: “నేను ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాను, అంతేకాక వినయం గలవారి ఆత్మకు చైతన్యం కలిగించడానికి నలిగినవారి ప్రాణానికి చైతన్యం కలిగించడానికి ఆత్మలో వినయం, దీనమనస్సు గలవారి దగ్గర నివసిస్తాను.


యెహోవా చెప్పే మాట ఇదే: “ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం. మీరు నా కోసం కట్టాలనుకున్న ఇల్లు ఎక్కడ? నా విశ్రాంతి స్థలం ఏది?


ఇదిగో నేను, యెహోవా నాకిచ్చిన పిల్లలు, సీయోను కొండమీద నివసించే సైన్యాల యెహోవా వలన సూచనలుగా, గుర్తులుగా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.


వారు చిందించిన నిర్దోషుల రక్తాన్ని బట్టి ప్రతీకారం తీసుకోకుండా వారిని వదిలేయాలా? నేను ప్రతీకారం చేస్తాను.” యెహోవా సీయోనులో నివసిస్తున్నారు!


నీ దేవుడైన యెహోవా, రక్షించే పరాక్రమశాలి నీకు తోడుగా ఉన్నారు. ఆయన నిన్ను చూసి చాలా సంతోషిస్తారు; ఆయన తన ప్రేమను బట్టి ఆయన ఇకపై నిన్ను గద్దించరు, పాడుతూ నిన్ను చూసి సంతోషిస్తారు.”


ఎవడైన దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొంటే అందులో నివసించే వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకొంటున్నాడు.


ఈ విధంగా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలంగా కట్టబడుతున్నారు.


అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు.


ఆ పట్టణంపై సూర్యుడు గాని చంద్రుడు గాని ప్రకాశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ దానికి వెలుగు ఇస్తుంది గొర్రెపిల్ల దానికి దీపము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ