Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 122:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 యెరూషలేము యొక్క సమాధానం కోసం ప్రార్థించండి. “యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు క్షేమంగా ఉందురు గాక!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 యెరూషలేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవాళ్ళు వృద్ది చెందుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి. “యెరూషలేమును ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 యెరూషలేము యొక్క సమాధానం కోసం ప్రార్థించండి. “యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు క్షేమంగా ఉందురు గాక!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 122:6
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

నిన్ను దీవించే వారిని దీవిస్తాను, శపించే వారిని శపిస్తాను; నిన్ను బట్టి భూమి మీద ఉన్న సర్వ జనాంగాలు దీవించబడతారు.”


ప్రజల నాయకులు యెరూషలేములో స్థిరపడ్డారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకరు మాత్రమే పరిశుద్ధ యెరూషలేములో నివసించేలా మిగతా తొమ్మిదిమంది తమ సొంత పట్టణాల్లోనే నివసించేలా చీట్లు వేశారు.


యెరూషలేములో నివసించడానికి ఇష్టపూర్వకంగా వచ్చిన వారిని ప్రజలు దీవించారు.


తమను నిర్మూలం చేయమని షూషనులో ప్రకటించిన శాసనం యొక్క నకలు కూడా అతనికి ఇచ్చి దానిని ఎస్తేరుకు చూపించి వివరించమని చెప్పాడు; ఆమె రాజు సముఖానికి వెళ్లి తన ప్రజల పట్ల దయ చూపించేలా రాజును వేడుకోమని చెప్పమని మొర్దెకై అతనితో చెప్పాడు.


మీ దయతో సీయోనుకు మంచి చేయండి; యెరూషలేము గోడలు కట్టించండి.


యెరూషలేమును స్థాపించే వరకు భూమి మీద దానికి ప్రసిద్ధి కలుగజేసే వరకు ఆయనకు విశ్రాంతి ఇవ్వకండి.


“యెరూషలేమును ప్రేమించే మీరందరూ ఆమెతో సంతోషించి ఆనందించండి. ఆమె గురించి ఏడ్చే మీరందరూ ఆమెతో గొప్పగా సంతోషించండి.


అలాగే, నేను మిమ్మల్ని బందీలుగా తీసుకువెళ్లిన పట్టణంలో సమాధానం, అభివృద్ధి ఉండాలని కోరుకుని యెహోవాను ప్రార్థించండి, ఎందుకంటే అది అభివృద్ధి చెందితే, మీరు కూడా అభివృద్ధి చెందుతారు.”


ఖడ్గం నుండి తప్పించుకున్న వారలారా, వెళ్లిపొండి, ఆలస్యం చేయకండి! సుదూరదేశంలో ఉన్నాసరే, యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేమును జ్ఞాపకం చేసుకోండి.”


సింహంలా ఆడు సింహంలా వారు ముడుచుకుని పడుకుంటారు, వారిని ధైర్యంగా ఎవరు లేపగలరు? “ఓ ఇశ్రాయేలు, నిన్ను దీవించే వారు దీవించబడుదురు గాక నిన్ను శపించేవారు శపించబడుదురు గాక!”


నీవు నన్ను పంపించావని లోకం నమ్మేలా తండ్రీ, నీవు నాలో, నేను నీలో ఏకమై ఉన్నట్లు వారు కూడా ఒకటిగా ఉండాలి. నీవు నన్ను పంపించావని లోకం నమ్మేలా వారు మనలో కూడా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.


మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోడానికి ప్రయాసపడండి.


సమాధానానికి కర్తయైన దేవుడు అన్ని సమయాల్లో అన్ని విధాలుగా మీకు సమాధానం కలుగజేయును. ప్రభువు మీ అందరికి తోడై ఉండును గాక!


మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తున్నాము, కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమ లేనివారు మరణంలో నిలిచివుంటారు.


నాకైతే, నేను మీ కోసం ప్రార్ధన చేయడంలో విఫలమవ్వడం వలన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినవాడనవుతాను. అది నాకు దూరమవ్వాలి. మంచిదైన సరియైన మార్గాన్ని నేను మీకు బోధిస్తాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ