Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 12:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 పొగిడే ప్రతి పెదవిని గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను యెహోవా మౌనం చేయును గాక.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 యెహోవా, మోసపు మాటలు పలికే పెదాలనూ, గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకనూ కోసివెయ్యి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి. పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసివేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 పొగిడే ప్రతి పెదవిని గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను యెహోవా మౌనం చేయును గాక.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 12:3
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఎలా పొగడాలో నాకు చేతకాదు. ఒకవేళ నేను అలా పొగిడితే వెంటనే నా సృష్టికర్త నన్ను చంపుతారు.


నా కంగారులో నేను, “మనుష్యులంతా అబద్ధికులు” అన్నాను.


యెహోవా దరిద్రులకు న్యాయం చేకూరుస్తారని, అవసరతలో ఉన్నవారికి న్యాయం సమకూరుస్తారని నాకు తెలుసు.


వారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు, వారి నోళ్ళు అహంకారంతో మాట్లాడతాయి.


మీ భారాన్ని యెహోవాపై మోపండి ఆయన మిమ్మల్ని సంరక్షిస్తారు; నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనివ్వరు.


‘నేను వారిని తరుముతాను, వారిని పట్టుకుంటాను. దోపుడుసొమ్మును పంచుకుంటాను; వాటివలన నా ఆశ తీర్చుకుంటాను. నేను నా ఖడ్గాన్ని దూస్తాను నా చేయి వారిని నాశనం చేస్తుంది’ అని శత్రువు అనుకున్నాడు.


చావు బ్రతుకులు నాలుక వశంలో ఉన్నాయి, దానిని ప్రేమించేవారు దాని ఫలాన్ని తింటారు.


పగవారు పెదవులతో మాయ మాటలు చెప్పి హృదయాల్లో కపటాన్ని దాచుకుంటారు.


విగ్రహాలను పూజించే రాజ్యాలను నా చేయి పట్టుకున్నట్లు, వాటి విగ్రహాలు యెరూషలేము సమరయుల విగ్రహాల కన్న ఎక్కువగా ఉన్నాయి.


న్యాయం గురించి ఎవరూ పట్టించుకోరు; ఎవరూ నిజాయితితో వాదించరు. వారు వట్టి వాదనలను నమ్ముకుని అబద్ధాలు చెప్తారు; వారు హింసను గర్భం దాల్చి చెడును కంటారు.


నీ బంధువులు, నీ సొంత కుటుంబ సభ్యులు కూడా, నీకు నమ్మకద్రోహం చేశారు; వారు నీ మీద పెద్దగా అరుస్తూ మాట్లాడారు. కాబట్టి వారు నీ గురించి మంచిగా మాట్లాడినా వారిని నమ్మవద్దు.


వారి నాలుక మరణకరమైన బాణం; అది మోసపూరితంగా మాట్లాడుతుంది. వారంతా తమ పొరుగువారితో సమాధానంగానే మాట్లాడతారు, కాని తమ హృదయాల్లో వారి కోసం ఉచ్చులు బిగిస్తారు.


“మనుష్యకుమారుడా, తూరు పాలకునితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘గర్వించిన హృదయంతో నీవు, “నేనొక దేవుడిని; సముద్రం మధ్యలో ఒక దేవుని సింహాసనం మీద నేను కూర్చున్నాను” అని అన్నావు. దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు, కాని నీవు కేవలం ఒక మనిషివి మాత్రమే దేవునివి కాదు.


నిన్ను చంపేవారి ఎదుట “నేను దేవుడిని” అని చెప్తావా? నిన్ను చంపేవారి చేతుల్లో నీవు మనిషివే కాని దేవుడవు కావు.


‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఈజిప్టు రాజైన ఫరో, నైలు నదిలో పడుకుని ఉన్న ఘటసర్పమా, నేను నీకు విరోధిని. “నైలు నది నాదే, నేనే దాన్ని చేశానని నీవు అంటావు.”


అతడు సర్వోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఆయన పరిశుద్ధులను హింసిస్తూ, పండుగ కాలాలను, శాసనాలను మార్చే ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధులు ఒక కాలం, కాలాలు, సగం కాలం అతని చేతికి అప్పగించబడతారు.


“నేను కొమ్ముల గురించి ఆలోచిస్తుండగా వాటి మధ్య నుండి మరొక చిన్న కొమ్ము పైకి వచ్చింది. మొదటి మూడు కొమ్ములు దాని ఎదుట నుండి పెరికివేయబడ్డాయి. ఈ కొమ్ముకు మనిషిలాంటి కళ్లు, గర్వంగా మాట్లాడే నోరు ఉన్నాయి.


యెహోవా చెప్పేదేమంటే, “నాకు వ్యతిరేకంగా మీరు చాలా గర్వించి మాట్లాడారు.” “అయినా మేము నీకు వ్యతిరేకంగా ఏం మాట్లాడాము?” అని మీరు అడుగుతున్నారు.


ఎందుకంటే, వారి మాటలు వట్టివి డాంబికమైనవి, వారు శరీర సంబంధమైన దురాశలు కలవారై, చెడు మార్గంలో జీవిస్తూ అప్పుడే తప్పించుకున్నవారికి పోకిరి చేష్టలను ఎరగా చూపించి ప్రలోభపెడతారు.


వారు ఎల్లప్పుడు సణుగుతూ ఇతరులలో తప్పులు వెదుకుతారు; వారు తమ చెడు కోరికలనే అనుసరిస్తారు; వారు తమ గురించి తామే పొగడుకొంటారు, స్వలాభం కోసం ఇతరులను పొగడ్తలతో ముంచెత్తుతారు.


ఆ మృగానికి దేవునికి విరుద్ధంగా తన గొప్పలు చెప్తూ దైవదూషణ చేసే నోరు ఉంది. నలభై రెండు నెలల వరకు అధికారం చెలాయించడానికి అనుమతి ఇవ్వబడింది.


“అంత గర్వంగా మాట్లాడకండి మీ నోటిని గర్వంగా మాట్లాడనివ్వకండి, ఎందుకంటే యెహోవా అన్నీ తెలిసిన దేవుడు ఆయన మీ క్రియలను పరిశీలిస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ