Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 112:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు, వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది; వారి కొమ్ము ఘనత పొంది హెచ్చింపబడుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 అతడు ఉదారంగా పేదలకు దానం చేస్తాడు. అతని నీతి నిత్యం నిలిచి ఉంటుంది. అతడు ఘనత పొందుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 ఆ మనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు. అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు, వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది; వారి కొమ్ము ఘనత పొంది హెచ్చింపబడుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 112:9
39 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆయన క్రియలు కీర్తనీయమైనవి ప్రభావవంతమైనవి, ఆయన నీతి నిరంతరం ఉంటుంది.


వారి ఇళ్ళలో ధనం, ఐశ్వర్యం ఉన్నాయి, వారి నీతి నిత్యం నిలిచి ఉంటుంది.


ఎందుకంటే, “దుష్టులందరి కొమ్ములను నేను విరగ్గొడతాను, కాని నీతిమంతుల కొమ్ములు హెచ్చిస్తాను” అని ఆయన అంటారు.


మీరు నా కొమ్మును అడవి ఎద్దులా హెచ్చించారు; చక్కని నూనెలు నాపై పోయబడ్డాయి.


నా విరోధుల ఓటమిని నేను కళ్లారా చూశాను; నా దుష్టుల పూర్తి పరాజయాన్ని నా చెవులారా విన్నాను.


జ్ఞానుల ఐశ్వర్యం వారికి కిరీటం, బుద్ధిహీనుల మూర్ఖత్వం మూర్ఖత్వమే.


బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారానికి ఆయన తిరిగి ఉపకారం చేస్తారు.


పగలంతా వారు మరింత కావాలని కోరుకుంటారు, కాని నీతిమంతులు మిగుల్చుకోకుండ ఇస్తారు.


ఉదయాన్నే మీ విత్తనాన్ని విత్తండి, సాయంత్రం వరకు మీ చేతులను వెనుకకు తీయకండి, ఎందుకంటే ఇది ఫలిస్తుందో అది ఫలిస్తుందో, లేదా రెండు సమానంగా ఫలిస్తాయో, మీకు తెలియదు.


వెదకడానికి సమయం, పోగొట్టుకోడానికి సమయం, దాచిపెట్టడానికి, పారవేయడానికి,


అయితే గొప్పవారు గొప్ప ఆలోచనలు చేస్తారు, వారు చేసే గొప్ప పనులను బట్టి నిలబడతారు.


ఆకలితో ఉన్నవారికి మీ దగ్గర ఉన్నది ఇచ్చి, బాధించబడినవారి అవసరాలను తీరిస్తే, చీకటిలో మీ వెలుగు ప్రకాశిస్తుంది, మీ చీకటి మధ్యాహ్నపు వెలుగుగా మారుతుంది.


మీ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారితో పంచుకోవడం, ఇల్లు లేక తిరుగుతున్న పేదలకు ఆశ్రయం కల్పించడం, మీరు ఎవరినైనా నగ్నంగా చూస్తే, వారికి బట్టలు ఇవ్వడం, మీ రక్తసంబంధులకు ముఖం దాచకపోవడమే కదా ఉపవాసం?


మీరు చేసే సహాయం రహస్యంగా ఉండాలి. ఎందుకంటే రహస్యంగా చేసింది కూడా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.


పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, మీకు ఇష్టం వచ్చిన సమయంలో మీరు వారికి సహాయం చేయవచ్చు. కాని నేను మీతో ఉండను.


కాబట్టి పేదలకు బహుమతులు ఇవ్వండి అప్పుడు మీకు అంతా శుద్ధిగానే ఉంటుంది.


మీ ఆస్తులను అమ్మి బీదలకు ఇవ్వండి. మీ కోసం పాతగిల్లని డబ్బు సంచులను ఏర్పరచుకోండి, పరలోకంలో ధనం ఎప్పటికీ తరిగిపోదు, అక్కడ ఏ దొంగ సమీపించలేడు, ఏ చిమ్మెట కొట్టివేయలేదు.


కాబట్టి నేను మీతో చెప్పేదేమంటే, మీకున్న లోక ధనసంపదతో మీరు స్నేహితులను సంపాదించుకోండి, అది పోయినప్పుడు, నిత్యమైన నివాసాల్లో మీకు ఆహ్వానం దొరుకుతుంది.


యేసు అతడు చెప్పింది విని వానితో, “అయినా నీలో ఒక కొరత ఉంది. నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు, అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి, నన్ను వెంబడించు” అని చెప్పారు.


యూదాకు డబ్బు బాధ్యత ఇవ్వబడి ఉండింది కాబట్టి పండుగ కోసం అవసరమైన వాటిని కొనడానికో, పేదవారికి ఏమైనా ఇవ్వమని యేసు అతనితో చెప్తున్నాడని కొందరు అనుకున్నారు.


నేను చేసే ప్రతి పనిలో మీకు మాదిరిని చూపిస్తూ, ‘తీసుకోవడంకంటే ఇవ్వడం ఎంతో దీవెనకరం’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలని, నేను కష్టపడి బలహీనులకు సహాయం చేసి మీకు మాదిరిని చూపించాను” అని చెప్పాడు.


అది అవసరంలో ఉన్నవారికి పంచిపెట్టబడింది. కాబట్టి వారి మధ్య అవసరంలో ఉన్నవారెవరు లేరు.


అవసరంలో ఉన్న పరిశుద్ధులతో పంచుకోండి. ఆతిథ్యం ఇవ్వండి.


మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా తన పేదరికం ద్వారా మిమ్మల్ని ధనవంతులను చేయడానికి మీ కోసం ఆయన పేదవానిగా అయ్యారు.


దేశంలో ఎల్లప్పుడు పేదవారు ఉంటారు. కాబట్టి మీ దేశంలో తోటి ఇశ్రాయేలీయులలో పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ధారాళంగా మీ గుప్పిలి విప్పాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను.


మీ మందలో నుండి మీ నూర్పిడి కళ్ళం నుండి, మీ ద్రాక్ష గానుగ తొట్టి నుండి వారికి ధారాళంగా ఇచ్చి పంపాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన దానికి తగినట్టుగా వారికి ఇవ్వాలి.


సూర్యాస్తమయానికి వారి వస్త్రాన్ని తిరిగి ఇవ్వండి, తద్వారా మీ పొరుగువారు దానిపై నిద్రపోవచ్చు. అప్పుడు వారు మిమ్మల్ని దీవిస్తారు, అది మీ దేవుడైన యెహోవా దృష్టిలో నీతిగా లెక్కించబడుతుంది.


వారు మంచిని చేస్తూ, మంచి పనులు చేయడంలో ధనవంతులుగా ఇతరులకు ఇవ్వడంలో ధారాళంగా ఉండమని ఆజ్ఞాపించు.


ఉపకారం చేయడం, ఇతరులతో పంచుకోవడం అనే యాగాలను చేయడం మరువకండి, ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైనవి.


దేవుడు అన్యాయస్థుడు కాడు; ఆయనపై మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి ఆయన ప్రజలకు మీరు చేసిన చేస్తున్న సహాయాన్ని మరచిపోయేవాడు కాడు.


అన్యాయం చేసేవారిని అన్యాయం చేయనివ్వు, దుష్టుడిని దుష్టునిలా కొనసాగనివ్వు, నీతి క్రియలు చేసేవారిని నీతి క్రియలను చేస్తూ ఉండనివ్వు, పరిశుద్ధులను పరిశుద్ధులుగా కొనసాగనివ్వు” అని చెప్పాడు.


హన్నా ప్రార్థనచేసి ఇలా అన్నది: “నా హృదయం యెహోవాలో సంతోషిస్తుంది; యెహోవాను బట్టి నా కొమ్ము పైకెత్తబడింది. నా శత్రువులపై నా నోరు గొప్పలు పలుకుతుంది, మీ విడుదలలో నాకు ఆనందము.


“కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ‘నీ కుటుంబం, నీ పితరుల కుటుంబం నా సన్నిధిలో నిత్యం సేవ చేస్తారని నేను వాగ్దానం చేశాను’ అని చెప్పారు కాని ఇప్పుడు యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: ‘అది నా నుండి దూరమవును గాక! నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకరించబడతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ