అప్పుడు ఆసా యెహోవాకు, “యెహోవా, బలవంతులతో యుద్ధంలో బలహీనులకు సహాయం చేయడానికి మీరు తప్ప ఇంకెవరు లేరు. యెహోవా, మా దేవా! మేము మీమీద నమ్మకం పెట్టుకున్నాము. మీ పేర మేము ఈ మహా సైన్యాన్ని ఎదిరించడానికి వచ్చాం కాబట్టి సాయం చేయండి. యెహోవా మీరే మా దేవుడు. మానవమాత్రులను మీకు వ్యతిరేకంగా నిలువనీయకండి” అని ప్రార్థన చేశాడు.
ఆ సమయంలో కొందరు పరిసయ్యులు యేసు దగ్గరకు వచ్చి, “నీవు ఈ స్థలాన్ని విడచి ఎక్కడికైన వెళ్లిపోవడం మంచిది. హేరోదు రాజు నిన్ను చంపాలనుకుంటున్నాడు” అని ఆయనతో చెప్పారు.
ఉదయానే దావీదును చంపాలని అతన్ని పట్టుకోమని చెప్పి సౌలు అతని ఇంటికి దూతలను పంపించాడు. అయితే దావీదు భార్యయైన మీకాలు, “ఈ రాత్రి నీవు పారిపోయి ప్రాణం కాపాడుకోకపోతే రేపు నిన్ను చంపేస్తారు” అని హెచ్చరించి,
దావీదు అక్కడినుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, “నా పట్ల దేవుని చిత్తం ఏమిటో నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులను వచ్చి మీ దగ్గర ఉండనివ్వగలరా?” అని మోయాబు రాజును అడిగాడు.
అయితే దావీదు తనలో తాను, “ఏదో ఒక రోజు నేను సౌలు చేతిలో నాశనమవుతాను. నేను చేయగలిగిన ఉత్తమమైన పనేంటంటే ఫిలిష్తీయుల దేశానికి తప్పించుకు పోవడమే. అప్పుడు సౌలు ఇశ్రాయేలు దేశంలో నన్ను వెదకడం మానేస్తాడు, కాబట్టి నేను అతని చేతిలో నుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు.