Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 4:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 జ్ఞానానికి ఆరంభం ఇది: జ్ఞానం సర్వోన్నతమైనది, దానిని పొందుకో. నీకున్నదంతా ఖర్చైనా సరే, వివేకాన్ని సంపాదించుకో.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 జ్ఞానం సంపాదించుకోవడమే బుద్ధి వివేకాలకు మూలం. జ్ఞానం కోసం నీకు ఉన్నదంతా ఖర్చు పెట్టు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 “జ్ఞానము సంపాదించాలని నీవు తీర్మానించినప్పుడే జ్ఞానము మొదలవుతుంది. అందుచేత జ్ఞానము సంపాదించేందుకు నీకున్న సమస్తం వినియోగించు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 జ్ఞానానికి ఆరంభం ఇది: జ్ఞానం సర్వోన్నతమైనది, దానిని పొందుకో. నీకున్నదంతా ఖర్చైనా సరే, వివేకాన్ని సంపాదించుకో.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 4:7
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను ఈ ప్రజలను నడిపించడానికి నాకు జ్ఞానాన్ని, వివేచనను ఇవ్వండి. లేకపోతే మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?”


మీ కట్టడల వల్ల నేను గ్రహింపు పొందాను; కాబట్టి తప్పుడు త్రోవలంటే నాకు అసహ్యము.


బంగారం కంటే జ్ఞానాన్ని సంపాదించడం, వెండి కంటే తెలివిని సంపాదించడం ఎంత మేలు!


వెండిని వెదికినట్లు దానిని వెదికితే, దాచబడిన నిధులను వెదికినట్లు దానిని వెదికితే,


అబద్ధమాడే నాలుక ద్వారా వచ్చే ఐశ్వర్యం క్షణికమైన ఆవిరి ఘోరమైన ఉచ్చు.


సత్యాన్ని కొనుక్కో దాన్ని అమ్మకు జ్ఞానాన్ని, బోధను, అంతరార్థాన్ని కూడా కొని ఉంచుకో.


జ్ఞానాన్ని సంపాదించుకో, వివేకాన్ని సంపాదించుకో; నా మాటలు మరచిపోవద్దు, వాటినుండి తొలగిపోవద్దు.


మొదటి నుండి అనగా భూమిని కలుగజేసిన దినం మొదలుకొని నేను నియమించబడ్డాను.


ఒక ఒంటరివాడు ఉండేవాడు; అతనికి కుమారుడు కాని సోదరుడు కాని లేరు. కాని అతడు నిత్యం కష్టపడుతూనే ఉన్నాడు, అయినప్పటికీ అతని సంపద అతని కళ్లను తృప్తిపరచలేకపోయింది. “నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను? నేను ఎందుకు ఆనందంగా లేను?” అని ప్రశ్నించుకున్నాడు, ఇది కూడా అర్థరహితమే విచారకరమైన క్రియ!


డబ్బుతో భద్రత లభించినట్లే, జ్ఞానంతో కూడా భద్రత లభిస్తుంది, ప్రయోజనం ఏంటంటే: జ్ఞానం తనను కలిగినవారిని కాపాడుతుంది.


కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది, అది ఆమె నుండి తీసివేయబడదు” అన్నారు.


“కాని దేవుడు అతనితో, ‘ఓయీ బుద్ధిహీనుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతే, నీకోసం నీవు సిద్ధపరచుకొన్నది ఎవరిదవుతుంది?’


నిశ్చయంగా నా ప్రభువైన క్రీస్తు యేసును తెలుసుకోవడం విలువైనది కాబట్టి నేను ప్రతిదీ నష్టంగా భావిస్తున్నాను. నేను క్రీస్తును సంపాదించుకోడానికి సమస్తాన్ని వ్యర్థంగా భావిస్తున్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ