Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 30:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 భూమి మీద ఉండకుండా వారు పేదవారిని మ్రింగుదురు మనుష్యుల్లో బీదలు లేకుండా నశింపజేయుదురు కత్తి వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 దేశములో ఉండకుండ వారు దరిద్రులను మ్రింగు నట్లును మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయు నట్లును ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లునుగల వారి తరము కలదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 దేశంలో ఉండకుండాా దరిద్రులను మింగేస్తూ మనుషుల్లో ఉండకుండాా పేదలను నశింపజేయడానికి కత్తుల్లాటి పళ్లు, పదునైన దవడ పళ్లు ఉన్న వారి తరం ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 ఖడ్గాల్లాంటి పళ్లు ఉన్నవారు కొందరు ఉంటారు. వారి దవడలు కత్తుల్లా ఉంటాయి. వారు పేద ప్రజలనుండి సమస్తం దోచుకోవటానికి వారి సమయం అంతా ఉపయోగిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 భూమి మీద ఉండకుండా వారు పేదవారిని మ్రింగుదురు మనుష్యుల్లో బీదలు లేకుండా నశింపజేయుదురు కత్తి వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 30:14
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

దుష్టుల కోరలు విరగ్గొట్టాను వారి పళ్ళ నుండి బాధితులను విడిపించాను.


భయంకరమైన పళ్ళ వరుస గల, దాని నోటిద్వారాన్ని తెరవడానికి ఎవరు సాహసం చేస్తారు?


“దీనులు దోపిడికి గురవుతున్నారు, అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక, నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను” అని యెహోవా అంటున్నారు.


వారి పళ్లు మనల్ని చీల్చివేయటానికి అనుమతించని యెహోవాకు స్తుతి చెల్లును గాక.


కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా? వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు; వారు ఎన్నడు యెహోవాకు మొరపెట్టరు.


యెహోవా, లెండి! నా దేవా, నన్ను విడిపించండి! నా శత్రువులందరిని దవడపై కొట్టండి; దుష్టుల పళ్ళు విరగ్గొట్టండి.


మోసం చేసేవాడా, నీ నాలుక పదునైన క్షౌరం చేసే కత్తి; అది నాశనాన్ని చేస్తుంది.


నేను సింహాల మధ్య ఉన్నాను; నేను క్రూరమైన జంతువుల మధ్య నివసిస్తున్నాను వారు ఈటెలు బాణాల వంటి పళ్ళు కలిగిన మనుష్యులు, వారి నాలుకలు పదునైన కత్తుల వంటివి.


దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి. భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.


దేవా! వారి నోటి పళ్ళు విరగ్గొట్టండి; యెహోవా! ఈ కొదమ సింహాల కోరలను ఊడదీయండి.


నిర్లక్ష్యపు మాటలు ఖడ్గాల్లా గుచ్చుతాయి, కాని జ్ఞానుల నాలుకలు స్వస్థత కలిగిస్తాయి.


లాభము పొందాలని పేదవారికి అన్యాయం చేసేవారికి ధనవంతులకు బహుమానాలు ఇచ్చేవానికి నష్టమే కలుగుతుంది.


పేదలను హింసించే ఒక పేదవాడు పంటను తుడిచిపెట్టుకుపోయే వర్షం లాంటివాడు.


“జలగకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారు ‘ఇవ్వు, ఇవ్వు!’ అని అరుస్తారు. “తృప్తిలేనివి మూడు కలవు, ‘చాలు!’ అననివి నాలుగు కలవు:


సూర్యుని క్రింద జరుగుతున్న అణచివేతనంతటిని నేను చూశాను: సూర్యుని క్రింద అణగారిన వారి కన్నీటిని నేను చూశాను, కాబట్టి వారిని ఆదరించేవారెవరూ లేరు; బాధపెట్టేవారు బలవంతులు, వారిని ఆదరించేవారెవరూ లేరు.


వారు పేదల హక్కులను హరిస్తారు, నా ప్రజల్లో అణచివేయబడిన వారికి న్యాయం చేరనివ్వరు వారు విధవరాండ్రను తమ దోపుడు సొమ్ముగా చేసుకుంటూ తండ్రిలేనివారిని దోచుకుంటారు.


యెహోవా తన ప్రజల పెద్దలకు నాయకులకు తీర్పు ప్రకటించడానికి వస్తున్నారు: “మీరే నా ద్రాక్షతోటను నాశనం చేశారు; పేదల నుండి దోచుకున్న సొమ్ము మీ ఇళ్ళలో ఉంది.


మీరు నా ప్రజలను ఎందుకు నలుగగొడుతున్నారు? పేదల ముఖాలను ఎందుకు నూరుతున్నారు?” అని సైన్యాల అధిపతియైన యెహోవా అంటున్నారు.


దుష్టులు చెడ్డ పద్ధతులను ఉపయోగిస్తారు, నిరుపేదలు న్యాయమైన అభ్యర్థన చేసినా, అబద్ధాలతో పేదవారిని నాశనం చేయడానికి వారు చెడ్డ ఆలోచనలు చేస్తారు.


“ ‘చూడండి, నీలో ఉన్న ఇశ్రాయేలు నాయకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి హత్యలు చేయాలని నిర్ణయించుకున్నారు.


మీరు క్రొవ్విన వాటిని తింటారు, ఉన్నితో బట్టలు వేసుకుంటారు, ఎంపిక చేసిన జంతువులను వధిస్తారు, కానీ మందను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోరు.


వారు నేల మట్టిని త్రొక్కినట్టు బీదల తలలను త్రొక్కుతున్నారు హింసించబడే వారికి న్యాయం జరగనివ్వలేదు. తండ్రీ, కుమారులు ఒకే స్త్రీ దగ్గరకు వెళ్లారు అలా నా పరిశుద్ధ నామాన్ని అవమానపరిచారు.


సమరయ పర్వతం మీద తిరిగే బాషాను ఆవులారా! దిక్కులేని వారిని బాధిస్తూ, బీదలను అణగద్రొక్కుతూ “మాకు కొంచెం మద్యం తీసుకురండి!” అని భర్తలకు చెప్పే స్త్రీలారా, ఈ మాట వినండి.


అవసరతలో ఉన్నవారిని అణగద్రొక్కే వారలారా, దేశంలో ఉన్న పేదలను అంతం చేసేవారలారా,


దాక్కున్న దౌర్భాగ్యులను మ్రింగివేసేందుకు ఉవ్విళ్లూరుతూ, మనల్ని చెదరగొట్టడానికి అతని యోధులు దూసుకుని వచ్చినప్పుడు, అతని తలలో మీరు అతని ఈటెనే గుచ్చారు.


దానిలో ఉన్న అధికారులు గర్జించే సింహాలు; దాని పాలకులు రాత్రివేళ తిరుగుతూ, ఉదయానికి ఏమీ మిగల్చకుండా తినే తోడేళ్లు.


“వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! కాబట్టి మీకు మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించే మనుష్యులను ప్రవేశించకుండా వారి ముఖం మీదనే తలుపు వేసేస్తున్నారు. మీరు దానిలో ప్రవేశించడంలేదు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వడంలేదు.


వాటి తలవెంట్రుకలు స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్ళు సింహపు కోరల్లా ఉన్నాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ