Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 24:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 మూర్ఖులకు జ్ఞానం ఎంతో ఎత్తులో ఉంటుంది; సమాజ గవిని దగ్గర వారు మాట్లాడడానికి ఏమి లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులైయుందురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 మూర్ఖులకు జ్ఞానం అందని మాని పండే. గుమ్మం దగ్గర అలాంటి వారు మౌనంగా ఉంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 బుద్ధిహీనులు జ్ఞానమును గ్రహించలేరు. మనుష్యులు ముఖ్యమైన విషయాలను చర్చిస్తున్నప్పుడు బుద్దిహీనులు ఏమీ చెప్పలేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 మూర్ఖులకు జ్ఞానం ఎంతో ఎత్తులో ఉంటుంది; సమాజ గవిని దగ్గర వారు మాట్లాడడానికి ఏమి లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 24:7
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

నాకు న్యాయస్థానంలో పలుకుబడి ఉందని తెలిసి, ఒకవేళ అనాధలకు వ్యతిరేకంగా నేను నా చేయి ఎత్తితే,


వారి పిల్లలకు క్షేమం దూరమవుతుంది, వారి పక్షంగా వాదించేవారు లేక న్యాయస్థానంలో వారు నలిగిపోతారు.


వారి మార్గాలు ఎప్పటికీ క్షేమంగా ఉంటాయి; వారు మీ న్యాయవిధులను తిరస్కరించారు; వారు తమ శత్రువులందరినీ హేళనగా చూస్తారు.


వారితో తన అంబులపొదిని నింపుకున్నవాడు ధన్యుడు. గుమ్మంలో తమ విరోధులను ఎదుర్కొన్నప్పుడు వారు అవమానం పొందరు.


ఎగతాళి చేసేవారు జ్ఞానం వెదకుతారు కాని దొరకదు, అయితే వివేకులకు తెలివి సులభంగా కలుగుతుంది.


క్రిందనున్న మరణాన్ని తప్పించుకోవాలని, వివేకవంతులను జీవమార్గం పైకి నడిపిస్తుంది.


బుద్ధిహీనులు జ్ఞానాన్నే గ్రహించలేకపోతున్నప్పుడు, వారి విద్యాభ్యాసానికి డబ్బు చెల్లించడం దేనికి?


వివేకం ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుంటాడు, కాని మూర్ఖుడి కళ్లు భూమి చివర వరకు తిరుగుతాయి.


అనర్గళమైన పెదవులు దైవభక్తి లేని బుద్ధిహీనునికి సరిపోవు, అధికారికి అబద్ధమాడే పెదవులు ఇంకెంత ఘోరం!


పేదవారు కదా అని పేదవారిని పీడించవద్దు అవసరతలో ఉన్నవారిని ఆవరణంలో అణచివేయవద్దు,


కీడుచేసేవారు సరియైనది గ్రహించరు, కాని యెహోవాను ఆశ్రయించువారు దాన్ని పూర్తిగా గ్రహిస్తారు.


ఆమె భర్త పట్టణ ద్వారం దగ్గర గౌరవించబడతాడు, అతడు దేశ పెద్దల మధ్య ఆసీనుడై ఉంటాడు.


ఒక వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యమిచ్చేవారు, న్యాయస్థానంలో మధ్యవర్తిత్వం చేసేవారిని వలలో వేసుకునేవారు అబద్ధసాక్ష్యంతో అమాయకులకు న్యాయం జరుగకుండా చేసేవారు తొలగించబడతారు.


మూర్ఖులు మూర్ఖంగా మాట్లాడతారు, వారి హృదయాలు చెడు ఆలోచిస్తాయి; వారు భక్తిహీనతను పాటిస్తూ యెహోవా గురించి తప్పుడు వార్త ప్రకటిస్తారు; ఆకలితో ఉన్నవారికి ఏమి లేకుండా చేస్తారు దప్పికతో ఉన్నవారికి నీళ్లు లేకుండా చేస్తారు.


న్యాయస్థానంలో న్యాయం కోసం నిలబడే వారిని యథార్థంగా మాట్లాడేవారిని ద్వేషించేవారు మీలో ఉన్నారు.


ఎందుకంటే మీ అపరాధాలు ఎన్ని ఉన్నాయో మీ పాపాలు ఎంత ఘోరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని అమాయకులను బాధిస్తారు, న్యాయస్థానంలో వచ్చే బీదలకు న్యాయం జరగనివ్వరు.


చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి; న్యాయస్థానాల్లో న్యాయం జరిగించండి. బహుశ సైన్యాల యెహోవా దేవుడు, యోసేపు వంశంలో మిగిలి ఉన్నవారిపై దయ చూపిస్తారేమో.


అయితే ప్రకృతి సంబంధులైన వారు దేవుని ఆత్మ నుండి వచ్చిన వాటిని అంగీకరించలేరు, వాటిని కేవలం ఆత్మ ద్వారానే గ్రహించగలం కాబట్టి, అవి వారికి వెర్రితనంగా అనిపిస్తాయి; వారు వాటిని గ్రహించలేరు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ