Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 24:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 కారణం లేకుండ నీ పొరుగువానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దు; నీ పెదవులతో తప్పుత్రోవ పట్టిస్తావా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 నిర్నిమిత్తముగా నీ పొరుగువానిమీద సాక్ష్యము పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 అకారణంగా నీ పొరుగువాడిపై సాక్ష్యం పలక వద్దు. నీ పెదాలతో మోసపు మాటలు పలకొచ్చా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

28 గట్టి కారణం లేకుండా ఎవరికీ విరోధంగా మాట్లాడవద్దు. మరియు అబద్దాలు మాట్లాడకు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 కారణం లేకుండ నీ పొరుగువానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దు; నీ పెదవులతో తప్పుత్రోవ పట్టిస్తావా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 24:28
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు గమనించావా? అతనిలాంటి వ్యక్తి భూమి మీద లేడు; అతడు నిర్దోషమైనవాడు, యథార్థవంతుడు, దేవుడంటే భయం కలిగి, చెడుకు దూరంగా ఉండేవాడు. ఏ కారణం లేకుండా నీవు అతన్ని నాశనం చేయడానికి నన్ను ఒప్పించినా అతడు తన యథార్థతను విడువక స్థిరంగా ఉన్నాడు” అని అన్నారు.


అబద్ధ సాక్షులు బయలుదేరుతున్నారు; నాకు తెలియని విషయాలను గురించి వారు నన్ను ప్రశ్నిస్తారు.


కారణం లేకుండా వారు తమ వలను నా కోసం దాచారు నన్ను చిక్కించుకోడానికి వారు ఒక గొయ్యి తవ్వారు.


బలాఢ్యుడా, చేసిన కీడు గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు? దేవుని దృష్టిలో అవమానకరమైన నీవు, రోజంతా ఎందుకు ప్రగల్భాలు పలుకుతావు?


మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు.


“పుకార్లు ప్రచారం చేయకూడదు. అన్యాయపు సాక్షిగా ఉండి దుర్మార్గులకు సహాయం చేయకూడదు.


నమ్మకమైన సాక్షులు మోసం చేయరు, కాని అబద్ధ సాక్షులు అబద్ధాలు కుమ్మరిస్తారు.


అబద్ధసాక్షి శిక్షను పొందక పోదు అబద్ధాలాడే వాడు తప్పించుకోడు.


అబద్ధపు సాక్షి శిక్షను పొందును, అబద్ధాలాడే వాడు నశించును.


అబద్ధ సాక్షులు నశిస్తారు, కాని జాగ్రత్తగా వినేవారు నిరాటంకంగా సాక్ష్యమిస్తారు.


తన పొరుగువాని మీద అబద్ధసాక్ష్యం చెప్పేవాడు సమ్మెట ఖడ్గము లేదా వాడిగల బాణాన్ని పోలినవాడు.


“ ‘దొంగతనం చేయకూడదు. “ ‘అబద్ధాలాడకూడదు. “ ‘ఒకరిని ఒకరు మోసపుచ్చుకోకూడదు.


“ఒకవేళ మనుష్యులెవరైనా తన పొరుగువాడు తనకు అప్పగించిన దాని విషయంలో ఆ వ్యక్తిని మోసం చేసినా, వంచించినా, దోచుకున్నా, లేక ఒత్తిడిచేసినా, లేక పొరుగువాడు పోగొట్టుకున్న వస్తువు దొరికినా సరే దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి వాటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకు వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపమే అవుతుంది.


“ఎందుకు? ఇతడు చేసిన నేరమేంటి?” అని పిలాతు అడిగాడు. అయితే వారు ఇంకా గట్టిగా, “అతన్ని సిలువ వేయండి!” అని కేకలు వేశారు.


‘కారణం లేకుండా వారు నన్ను ద్వేషించారు’ అని ధర్మశాస్త్రంలో వ్రాయబడినది నెరవేరడానికి ఇది జరిగింది.


కాబట్టి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడడం మాని సత్యమే మాట్లాడాలి. ఎందుకంటే, మనమందరం ఒకే శరీరంలోని అవయవాలమై ఉన్నాము.


మీరు మీ పాత స్వభావాన్ని దాని అలవాట్లతో సహా విడిచిపెట్టారు, కాబట్టి ఒకనితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు,


అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పారు.


అయితే మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ