Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 17:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 లంచమిచ్చేవానికి లంచం ఒక మంత్ర రాయిలా ఉంటుంది, ప్రతి మలుపు దగ్గర విజయం వస్తుందని వారు తలస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 లంచము దృష్టికి మాణిక్యమువలెనుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 లంచం ఇచ్చేవాడికి అదొక మహిమగల మణి లాగా ఉంటుంది. అలాంటివాడు చేసేవన్నీ నెరవేరుతున్నట్టు ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 లంచం కళ్లను మెరిపించే ఒక ప్రకాశవంతమైన వెలగల రాయిలాంటిది, అది ఇచ్చేవారి మనస్సును మారుస్తుంది. ఎక్కడికి వెళ్లినా అదిపని చేస్తుంది అనుకొంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 లంచమిచ్చేవానికి లంచం ఒక మంత్ర రాయిలా ఉంటుంది, ప్రతి మలుపు దగ్గర విజయం వస్తుందని వారు తలస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 17:8
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

రెండువందల మేకలు, ఇరవై మేకపోతులు, రెండువందల గొర్రెలు, ఇరవై పొట్టేళ్లు,


కాబట్టి యాకోబు బహుమతులు తనకు ముందుగా వెళ్లాయి, అయితే తాను మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే ఉన్నాడు.


అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు, “ఒకవేళ అలాగైతే, ఇలా చేయండి: దేశంలో ఉన్న శ్రేష్ఠమైన వాటిని అంటే ఔషధతైలం, కొంచెం తేనె, కొన్ని సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తా గింజలు, బాదం పప్పులు మీ సంచుల్లో పెట్టుకుని ఆ వ్యక్తికి కానుకగా తీసుకెళ్లండి.


ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు.


ఆకాశంలో ఒక చివర ఉదయించి మరొక చివర వరకు దాని చుట్టూ తిరిగి వస్తాడు. దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.


యెహోవా, మీ బలంలో మీరు లేవండి; మీ శక్తిని గురించి మేము పాడి స్తుతిస్తాము.


యెహోవా స్వరం శక్తివంతమైనది; యెహోవా స్వరం ఘనమైనది.


“లంచం తీసుకోకూడదు, ఎందుకంటే లంచం చూసేవారికి గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది, నిర్దోషుల మాటలను వక్రీకరిస్తుంది.


న్యాయం తప్పుదారి పట్టించడానికి దుష్టులు రహస్యంగా లంచాలు స్వీకరిస్తారు.


ఒక బహుమతి మార్గం తెరుస్తుంది అది ఇచ్చిన వ్యక్తిని గొప్పవారి ఎదుటకు రప్పిస్తుంది.


చాటున ఇచ్చిన బహుమానం కోపాన్ని చల్లార్చుతుంది, ఒడిలో ఉంచబడిన లంచం పగను సమాధానపరుస్తుంది.


అన్యాయం జ్ఞానంగల వానిని మూర్ఖునిగా మారుస్తుంది, లంచం హృదయాన్ని పాడుచేస్తుంది.


నీ పాలకులు తిరుగుబాటుదారులు, దొంగలతో సహవాసం చేస్తారు. వారందరికి లంచాలు ఇష్టం కానుకల వెంటపడతారు. తండ్రిలేనివారి పక్షంగా న్యాయం తీర్చరు. విధవరాలి సమస్యను పరిష్కరించరు.


ఎందుకంటే మీ అపరాధాలు ఎన్ని ఉన్నాయో మీ పాపాలు ఎంత ఘోరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని అమాయకులను బాధిస్తారు, న్యాయస్థానంలో వచ్చే బీదలకు న్యాయం జరగనివ్వరు.


వారి రెండు చేతులు కీడు చేస్తాయి; పాలకులు బహుమతులు కోరతారు, న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటారు, గొప్పవారు తమ కోరికను తెలియజేస్తారు. వారంతా కలిసి కుట్ర చేస్తారు.


న్యాయం తప్పి తీర్పు చెప్పకూడదు లేదా పక్షపాతం చూపించకూడదు. లంచం తీసుకోకూడదు, ఎందుకంటే లంచం జ్ఞానుల కళ్లకు గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది, నిర్దోషుల మాటలను వక్రీకరిస్తుంది.


తర్వాత దావీదు తన కోసం ఆమె తెచ్చిన వాటిని ఆమె చేతితో తీసుకుని, “నీ మాటలు నేను విని నీ మనవి అంగీకరించాను, సమాధానంతో ఇంటికి వెళ్లు” అని ఆమెతో చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ