Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 10:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని తెస్తుంది, బాధ దుఃఖం దానికి జోడించబడవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆయాశీర్వాదము ఎక్కువ కాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 యెహోవా దీవెనలు ఐశ్వర్యం కలిగిస్తాయి. మనుషుల కష్టానికి మించిన సంపద వారికి కలుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

22 యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది. మరియు ఆ ఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని తెస్తుంది, బాధ దుఃఖం దానికి జోడించబడవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 10:22
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

“నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను; నీ పేరును గొప్పగా చేస్తాను, నీవు దీవెనగా ఉంటావు.


అబ్రాము పశువులు, వెండి బంగారాలతో ఎంతో ధనవంతుడయ్యాడు.


ఒక దారం పోగైననూ, చెప్పులవారైననూ నేను ఆశించను, తద్వార నీవు, ‘నేనే అబ్రామును ధనికుడయ్యేలా చేశాను’ అని చెప్పకుండ ఉంటావు.


యెహోవా నా యజమానిని ఎంతో దీవించారు కాబట్టి అతడు చాలా ధనికుడయ్యాడు. అతనికి గొర్రెలను, మందలను, వెండి బంగారాలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను ఆయన ఇచ్చారు.


ఇస్సాకు ఆ దేశంలో విత్తనాలు విత్తాడు, యెహోవా అతన్ని దీవించారు కాబట్టి, అదే సంవత్సరం అతనికి నూరంతల పంట వచ్చింది.


అతడు ధనికుడయ్యాడు, అతడు ఎంతో గొప్పవాడయ్యే వరకు అతని ఆస్తి వృద్ధిచెందుతూ ఉంది.


అతనితో చెప్పు, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నీవు ఒక మనుష్యుని హత్య చేసి అతని ఆస్తిని ఆక్రమించలేదా? యెహోవా చెప్పే మాట ఇదే: ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో, ఆ స్థలంలోనే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి.’ ”


యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, “మీరు నన్ను ఖచ్చితంగా దీవించి నా సరిహద్దులను విశాలపరచండి! మీ చేయి నాకు తోడుగా ఉంచి, నాకు బాధ కలుగకుండా కీడు నుండి నన్ను తప్పించండి” అని ప్రార్థించాడు. దేవుడు అతని మనవి అంగీకరించి దాని ప్రకారం జరిగించారు.


అమజ్యా దైవజనుని చూసి, “కాని ఇశ్రాయేలు సైనికుల కోసం నేను చెల్లించిన వంద తలాంతుల సంగతేంటి?” అని అడిగాడు. అందుకు దైవజనుడు, “యెహోవా అంతకంటే ఎక్కువ నీకివ్వగలరు” అని జవాబిచ్చాడు.


హిజ్కియాకు గొప్ప సంపదలు ఘనత లభించాయి. వెండి, బంగారం, ప్రశస్తమైన రాళ్లు, సుగంధద్రవ్యాలు, డాళ్లు, అన్ని రకాల విలువైన వస్తువులు భద్రం చేయడానికి గదులు కట్టించాడు.


దేవుడు అతనికి అతివిస్తారమైన సంపద ఇచ్చారు కాబట్టి అతడు పట్టణాలను కూడా కట్టించుకున్నాడు. ఎన్నో గొర్రెల మందలు పశువుల మందలు అతడు సంపాదించాడు.


దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారు అధికంగా అభివృద్ధి చెందారు. పశుసంపద ఏమాత్రం తగ్గలేదు.


మీరు ప్రొద్దున్నే లేచి ఆలస్యంగా పడుకొంటూ, కష్టపడి పని చేస్తూ ఆహారం తినడం వ్యర్థమే. ఆయన ప్రేమించేవారు నిద్రిస్తునప్పుడు కూడా యెహోవా సమకూరుస్తారు.


యెహోవా ఆశీర్వదించినవారు భూమిని స్వాధీనపరచుకుంటారు, కాని ఆయన శపించినవారు నాశనమౌతారు.


జ్ఞానుల ఐశ్వర్యం వారికి కిరీటం, బుద్ధిహీనుల మూర్ఖత్వం మూర్ఖత్వమే.


జీవితంలో చాలా త్వరగా పొందిన వారసత్వం అంతంలో దీవించబడదు.


పిసినారి ధనం సంపాదించాలని ఆరాటపడతాడు అయితే దరిద్రత వాని కోసం వేచి ఉందని వానికి తెలియదు.


నన్ను ప్రేమించేవారిని కలిమికి కర్తలుగా చేస్తాను వారి ధనాగారాన్ని సమృద్ధితో నింపుతాను.


పది రోజుల తర్వాత చూస్తే రాజు ఆహారం తిన్న యువకులందరికంటే వీరు ఆరోగ్యంగా, పుష్టిగా కనిపించారు.


సైన్యాల యెహోవా చెప్తున్న మాట ఇదే, ‘నేను దానిని బయటకు పంపుతాను, అది దొంగల ఇంట్లోకి, నా పేరిట అబద్ధ ప్రమాణం చెప్పే అందరి ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఉంటూ దాని దూలాలు, రాళ్లతో సహా సమస్తాన్ని నాశనం చేస్తుంది.’ ”


యెహోవా, మీరు నాకు ఇచ్చిన భూమిలోని మొదటి ఫలాలను ఇప్పుడు తెస్తున్నాను.” ఆ గంపను మీ దేవుడైన యెహోవా ముందు పెట్టి ఆయన ముందు నమస్కరించాలి.


యెహోవా మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భ ఫలంలో, మీ పశువుల పిల్లల్లో, మీ నేల పంటల్లో మీకు సమృద్ధిగా వృద్ధిని ఇస్తారు.


శపించబడిన వాటికి దూరంగా ఉండండి, లేకపోతే వాటిలో ఏదైనా తీసుకుని మీ సొంత నాశనాన్ని మీరు తెచ్చుకుంటారు! ఇశ్రాయేలీయుల శిబిరాన్ని నాశనానికి గురిచేసి దాని మీదికి కష్టాలు తెచ్చిన వారవుతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ