Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 10:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 జ్ఞానులు తెలివిని సంపాదించుకుంటారు, బుద్ధిహీనుల నాశనాన్ని ఆహ్వానిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూఢుల నోరు అప్పుడే నాశనముచేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. మూర్ఖుల మాటలు నాశనం కోరుకుంటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 జ్ఞానముగల వారు నెమ్మదిగా ఉంటారు, కొత్త విషయాలు నేర్చుకొంటారు. కాని బుద్ధిహీనులు మాట్లాడి వారికి వారే కష్టాలు తెచ్చుకొంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 జ్ఞానులు తెలివిని సంపాదించుకుంటారు, బుద్ధిహీనుల నాశనాన్ని ఆహ్వానిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 10:14
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

జ్ఞానులు ఈ సామెతలు వింటారు, మరింత తెలివైనవారవుతారు, వివేకంగలవారు ఉపదేశం పొందుకుంటారు.


కళ్లతో సైగ చేసేవారు దుఃఖాన్ని కలిగిస్తారు, వ్యర్థ కబుర్లు చెప్పే మూర్ఖులు నాశనమవుతారు.


జ్ఞానంగలవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు, మూర్ఖులు తమకు తానే కష్టాన్ని తెచ్చుకుని నశిస్తారు.


వివేకంగల మనుష్యులు తమ తెలివిని దాచిపెడతారు కానీ మూర్ఖులు తమ మూర్ఖత్వాన్ని ప్రచారం చేసుకుంటారు.


తమ పెదవులను కాచుకునేవారు తమ ప్రాణాలు కాపాడుకుంటారు, కాని దురుసుగా మాట్లాడేవారు పతనమవుతారు.


అసూయగలవాడు మేలుపొందడు తెలివితక్కువగా మాట్లాడేవాడు కీడులో పడును.


స్నేహం లేని వ్యక్తి స్వార్థ ప్రయోజనాలను వెంటాడుతాడు, అన్ని మంచి తీర్పులకు వ్యతిరేకంగా గొడవలు ప్రారంభిస్తాడు.


వివేచన గలవారి హృదయం తెలివిని సంపాదిస్తుంది, జ్ఞానం గలవారి చెవులు దాన్ని తెరుచుకుంటాయి.


మూర్ఖుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణాలకు ఉరి.


తెలివి సంపాదించుకునేవారు తన ప్రాణమునకు ప్రేమించేవారు; మంచి చెడులను లెక్కచేయువారు మేలు పొందును.


నోటిని నాలుకను భద్రం చేసుకునేవారు కష్టాల నుండి తమ ప్రాణాన్ని కాపాడుకుంటారు,


జ్ఞానం గలవానికి బోధించగా వాడు మరింత జ్ఞానంగలవానిగా ఉంటారు; మంచివానికి బోధ చేయగా వాడు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు.


జ్ఞానుల నోటి నుండి వచ్చే మాటలు దయగలవి, కాని మూర్ఖుని పెదవులు వానినే మ్రింగివేస్తాయి.


మంచివారు తమ మంచి హృదయ ధననిధిలో నుండి మంచివాటినే బయటకు తీస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయ నిధిలో నుండి చెడ్డవాటినే బయటకు తీస్తారు.


పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనం వంటిది. ఒకడు దానిని కనుగొనగానే దానిని మరల దాచిపెట్టి, సంతోషంతో వెళ్లి తనకు ఉన్నదంతా అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు.


యేసు వారితో, “పరలోక రాజ్యాన్ని గురించి ఉపదేశం పొంది దానిని పాటించే ప్రతి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, తన ధననిధి నుండి పాత వాటిని క్రొత్త వాటిని బయటకు తెచ్చే ఒక ఇంటి యజమాని వంటివాడు” అని చెప్పారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ