Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఓబద్యా 1:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 “ఒకవేళ నీ మీదికి దొంగలు వస్తే, రాత్రివేళ దొంగలు వస్తే ఎంతగా నాశనం చేస్తారో కదా! వారికి కావలసినంత వారు దోచుకుంటారు కదా? ద్రాక్షలు పోగుచేసుకునేవారు నీ దగ్గరకు వస్తే, వారు కొన్ని ద్రాక్షలు వదిలిపెడతారు కదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 చోరులేగాని రాత్రి కన్నము వేయువారేగాని నీ మీదికి వచ్చినయెడల తమకు కావలసినంతమట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీయొద్దకు వచ్చినయెడల పరిగె యేరు కొనువారికి కొంత యుండనిత్తురుగదా; నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి యున్నావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 దొంగలు నీ దగ్గరికి వస్తే, వాళ్ళు రాత్రి పూట వచ్చి తమకు కావలసినంత వరకే దోచుకుంటారు గదా. ద్రాక్ష పండ్లు పోగు చేసే వాళ్ళు నీ దగ్గరికి వస్తే కొన్ని పళ్ళు విడిచి పెడతారు గదా. అయితే, అయ్యో! నువ్వు బొత్తిగా నాశనమైపోయావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 నీవు నిశ్చయంగా నాశనమవుతావు! దొంగలు నీవద్దకు వస్తారు! రాత్రిపూట దోపిడిగాండ్రు వస్తారు! ఆ దొంగలు వారికి కావలసినవన్నీ ఎత్తుకు పోతారు! ద్రాక్షాపండ్లు ఏరటానికి పనివారు నీ పొలాలకు వచ్చినప్పుడు, వారు కొన్ని పండ్లు పరిగె ఏరుకొనేవారుకు వదిలిపెడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 “ఒకవేళ నీ మీదికి దొంగలు వస్తే, రాత్రివేళ దొంగలు వస్తే ఎంతగా నాశనం చేస్తారో కదా! వారికి కావలసినంత వారు దోచుకుంటారు కదా? ద్రాక్షలు పోగుచేసుకునేవారు నీ దగ్గరకు వస్తే, వారు కొన్ని ద్రాక్షలు వదిలిపెడతారు కదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఓబద్యా 1:5
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ఇశ్రాయేలూ, నీ ఉన్నతస్థలాల మీద నీ వైభవం గలవారు చంపబడ్డారు. బలవంతులు ఎలా పడిపోయారు కదా!


తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెలా ఆకాశం నుండి పడ్డావు? దేశాలను పడగొట్టిన నీవు భూమి మీద ఎలా పడవేయబడ్డావు?


అయినా ఒలీవచెట్టు కొమ్మలు దులపగా పై కొమ్మ చివర రెండు మూడు పండ్లు మిగిలినట్లు, ఫలించు చెట్టు కొమ్మల్లో మూడు, నాలుగు పండ్లు మిగిలినట్లు, కొంత పరిగె మిగిలి ఉంటుంది” అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తెలియజేస్తున్నారు.


ఒలీవ చెట్టుని దులిపినప్పుడు, ద్రాక్షపండ్ల కోత తర్వాత పరిగె పళ్ళు ఏరుకుంటున్నప్పుడు జరిగినట్లుగా భూమి మీద భూమి మీద ప్రజలందరి మధ్యలో ఇది జరుగుతుంది.


ద్రాక్షలు పోగుచేసుకునేవారు మీ దగ్గరకు వస్తే, వారు కొన్ని ద్రాక్షలు వదిలేయరా? రాత్రివేళ దొంగలు వస్తే, వారికి కావలసినంత వారు దొంగిలించరా?


మొత్తం భూమిని కొడుతున్న సుత్తి ఎలా విరిగి పగిలిపోయిందో! దేశాల మధ్య బబులోను ఎలా నిర్జనమైపోయిందో చూడండి!


సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మిగిలిన ఇశ్రాయేలీయులను ద్రాక్షపళ్లలా వారిని ఏరుకోనివ్వండి; ఒకడు ద్రాక్ష పళ్లను ఏరుకున్నట్లుగా, మళ్ళీ కొమ్మల మీద నీ చేయి వేయి.”


పట్టణం ఎలా నిర్జనమై ఉంది, ఒకప్పుడు జనంతో నిండి ఉండేది! ఆమె ఒక విధవరాలిలా ఎలా ఉంది, ఒకప్పుడు దేశాల మధ్య గొప్పదిగా ఉండేది! ఆమె రాజ్యాల మధ్య రాణిగా ఉండేది, కాని ఇప్పుడు బానిసగా మారింది.


తేమానూ! నీ వీరులు భయపడతారు, ఏశావు పర్వతాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరు, సంహరించబడి కూలిపోతారు.


ఏంటి నా దుస్థితి! నా పరిస్థితి వేసవికాలపు పండ్లు ఏరుకునే వానిలా ద్రాక్షతోట పరిగె సేకరించేవానిలా ఉంది; తినడానికి ద్రాక్షపండ్ల గెల లేదు, నేను ఆశించే క్రొత్త అంజూరపు పండ్లు లేవు.


ఇది క్షేమకరమైన ఆనందకరమైన పట్టణము. ఆమె తనలో తాను, “నా వంటి పట్టణం మరొకటి లేదని అనుకున్నది. ఆమె ఎంతగా పాడైపోయింది,” క్రూరమృగాలకు గుహలా మారింది! ఆ దారి గుండా వెళ్లే వారందరూ ఎగతాళి చేస్తూ చేతులు ఆడిస్తున్నారు.


మీరు మీ ద్రాక్షతోటలో ద్రాక్షను కోసినప్పుడు, మళ్ళీ తీగెల మీద వెదకవద్దు. మిగిలి ఉన్నవాటిని విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి.


ఆమె పడే వేదన చూసి భయపడి, వారు దూరంగా నిలబడి ఇలా రోదిస్తారు: “మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ! బబులోను మహా పట్టణమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చింది.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ