Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 5:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 ఇశ్రాయేలీయులు ఒక యాజకునికి తీసుకొనివచ్చే పవిత్రమైన విరాళాలన్నీ అతనికే చెందుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతనివగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ఇశ్రాయేలు ప్రజలు యాజకునికి సమర్పించేదీ, నా కోసం ప్రతిష్టించినదీ ఏదైనా యాజకునికే చెందుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 “ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడు దేవునికి ఒక ప్రత్యేక కానుక ఇస్తే, దానిని స్వీకరించే యాజకుడు దానిని ఉంచుకోవచ్చును. అది అతనిదే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 ఇశ్రాయేలీయులు ఒక యాజకునికి తీసుకొనివచ్చే పవిత్రమైన విరాళాలన్నీ అతనికే చెందుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 5:9
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇది ఇశ్రాయేలీయుల నుండి అహరోనుకు అతని కుమారులకు చెందవలసిన శాశ్వత వాటా. ఇది ఇశ్రాయేలీయులు అర్పించే సమాధానబలులలో నుండి వారు యెహోవాకు అర్పించే ప్రత్యేక కానుక.


యెహోవాకు సమర్పించిన హోమబలులలో ఇది మీకు, మీ కుమారులకు ఇచ్చిన వాటా; దీనిని పరిశుద్ధాలయ ప్రాంతంలో తినండి; ఎందుకంటే నాకు అలాగే ఆజ్ఞ ఇవ్వబడింది.


కానీ నీవూ, నీ కుమారులు, మీ కుమార్తెలు పైకెత్తిన రొమ్ము భాగాన్ని, ప్రత్యేక అర్పణగా అర్పించిన తొడను తినవచ్చు. ఆచారరీత్య శుభ్రంగా ఉన్న స్థలంలో వాటిని తినండి; అవి నీకు, నీ పిల్లలకు ఇశ్రాయేలీయుల సమాధానబలులలో మీ వాటాగా ఇవ్వబడ్డాయి.


ప్రత్యేక అర్పణ యైన తొడను పైకెత్తిన రొమ్ము భాగాన్ని హోమబలుల క్రొవ్వుతో పాటు తీసుకువచ్చి, యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి. యెహోవా ఆజ్ఞాపించినట్లు ఇది నీకు, నీ పిల్లలకు శాశ్వత వాటాగా ఉంటుంది.”


పాపపరిహారం కోసం దానిని అర్పించే యాజకుడు దానిని తినాలి; పరిశుద్ధాలయ ప్రాంతంలో, సమావేశ గుడారం యొక్క ఆవరణంలో దానిని తినాలి.


సమాధానబలులలో నుండి తీసిన కుడి తొడను యాజకునికి కానుకగా ఇవ్వాలి.


ఇశ్రాయేలీయుల సమాధానబలులలో నుండి నేను పైకెత్తిన రొమ్ము భాగాన్ని, అర్పించిన తొడను తీసుకుని యాజకుడైన అహరోనుకు అతని కుమారులకు ఇశ్రాయేలీయుల నుండి శాశ్వత వాటాగా ఇచ్చాను.’ ”


ఇశ్రాయేలీయులు యెహోవాకు తెచ్చే పవిత్రార్పణలను ప్రక్కకు పెట్టినవి నీకు, నీ కుమారులకు, కుమార్తెలకు శాశ్వత వాటాగా ఇస్తున్నాను. ఇది యెహోవా ఎదుట నీతో పాటు నీ సంతానానికి నిత్య ఉప్పు ఒడంబడికగా ఉంటుంది.”


యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే యాజకుడైన ఎలియాజరుకు యెహోవా భాగంగా ఇచ్చాడు.


అయితే ఆ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించడానికి సమీపబంధువు లేకపోతే, ఆ నష్టపరిహారం యెహోవాది, అది ప్రాయశ్చిత్త బలిగా ఇవ్వబడే పొట్టేలుతో పాటు యాజకునికి ఇవ్వబడాలి.


అయితే మీ పవిత్ర వస్తువులను, మీరు ఇస్తానని మ్రొక్కుబడి చేసినవన్నీ తీసుకుని, యెహోవా ఎన్నుకునే ప్రదేశానికి వెళ్లండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ