Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 35:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 పగ తీర్చుకునేవాడు ఆ హంతకునికి మరణశిక్ష వేయాలి; పగ తీర్చుకునేవాడు హంతకున్ని పట్టుకున్నప్పుడు అతన్ని చంపుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 హత్య విషయంలో ప్రతికారం తీర్చుకునే వాడు తానే స్వయంగా ఆ నరహంతకుణ్ణి చంపాలి. వాణ్ణి కలిసినప్పుడు చంపవచ్చు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 చనిపోయిన వాని కుటుంబ సభ్యుల్లో ఒకరు హంతకుణ్ణి తరిమి చంపవచ్చును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 పగ తీర్చుకునేవాడు ఆ హంతకునికి మరణశిక్ష వేయాలి; పగ తీర్చుకునేవాడు హంతకున్ని పట్టుకున్నప్పుడు అతన్ని చంపుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 35:19
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఈ రోజు నన్ను ఈ ప్రాంతం నుండి వెళ్లగొట్టారు, మీ సన్నిధిలో నుండి దూరం చేశారు; నేను విశ్రాంతి లేని దేశదిమ్మరిని అవుతాను, నేను కంటపడితే నన్ను చంపేస్తారు” అని అన్నాడు.


ఆమె, “అయితే, రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు ఇంకెక్కువ నాశనం చేయకుండా నిరోధించడానికి రాజు తన దేవున్ని ప్రార్థించాలి, తద్వార నా కుమారుడు నాశనానికి గురి కాకుండా ఉంటాడు” అని చెప్పింది. అందుకు రాజు, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీ కుమారుని తలవెంట్రుకలలో ఒకటి కూడా నేల రాలదు” అన్నాడు.


ఇప్పుడు నా కుటుంబమంతా నీ సేవకురాలినైన నా మీదికి లేచి, ‘తన సోదరుని కొట్టి చంపినవాన్ని మాకు అప్పగించు. వాడు తన సోదరుని చంపాడు కాబట్టి మేము వాన్ని చంపాలి: అప్పుడు వారసుడే లేకుండ పోతాడు’ అని వారు అంటున్నారు. వారు నా భర్త పేరును గాని వారసులను గాని భూమి మీద మిగలకుండా, నా దగ్గర మిగిలి ఉన్న ఏకైక మండే బొగ్గును చల్లార్చాలని చూస్తున్నారు” అని చెప్పింది.


అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు ఎవరూ వినకుండా అతనితో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి అతన్ని లోపలికి తీసుకెళ్లి తన సోదరుడైన అశాహేలును చంపినందుకు ప్రతీకారంగా యోవాబు అబ్నేరు పొట్టలో కత్తితో పొడవగా అతడు చనిపోయాడు.


(గిబియోను యుద్ధంలో అబ్నేరు తన సోదరుడైన అశాహేలును చంపినందుకు యోవాబు అతని సోదరుడైన అబీషై కలిసి పగతీర్చుకున్నారు.)


ఆ పట్టణాలు ప్రతీకారం తీర్చుకునే వారి నుండి కాపాడుకోడానికి ఆశ్రయంగా ఉంటాయి, తద్వారా హత్యకు పాల్పడిన ఎవరైనా సమాజం ముందు విచారణకు రాకముందు చంపబడరు.


లేదా ఒకవేళ ఎవరైనా ఒక చెక్క వస్తువుతో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి.


ఎవరైనా పగతో నెట్టినా లేదా వారివైపు ఉద్దేశపూర్వకంగా చేతిలో ఉన్నదానిని వారి మీదికి విసిరివేసినా, వారు చనిపోతే


లేదా శత్రుత్వం బట్టి ఒకరిని పిడికిలితో కొడితే ఆ వ్యక్తి చస్తే, వాడు మరణశిక్ష పొందాలి; ఆ వ్యక్తి హంతకుడు. పగ తీర్చుకునేవాడు అతన్ని కలిసినప్పుడు అతన్ని చంపుతాడు.


సమాజం నిందితునికి, పగతీర్చుకునే వానికి మధ్య ఉండి ఈ చట్టాల ప్రకారం తీర్పు తీర్చాలి.


పగ తీర్చుకునేవాడు అతన్ని ఆశ్రయపురం బయట చూస్తే, అతన్ని చంపవచ్చు, అది హత్యగా లెక్కించబడదు.


హంతకుని పట్టణ పెద్దలు పిలిపించి, ప్రతీకారం చేయడానికి వచ్చిన వానికి అతన్ని అప్పగించాలి.


ఎక్కువ దూరమైతే, ప్రతీకారం చేయాలని వెంటాడినవాడు అతన్ని పట్టుకుని చంపుతాడేమో! అతడు ద్వేషంతో పొరుగువానిని చంపలేదు కాబట్టి, అతనికి మరణశిక్ష తగదు.


తద్వార, ఎవరైనా ఒక వ్యక్తిని తెలియక పొరపాటున చంపితే అక్కడికి పారిపోయి ఆ హత్యకు చేసే ప్రతీకారం నుండి ఆశ్రయం పొందవచ్చు.


హత్యకు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి వెంబడిస్తూ వస్తే ఆ పెద్దలు వానికి పారిపోయి వచ్చిన వ్యక్తిని అప్పగించకూడదు. ఎందుకంటే పారిపోయిన వ్యక్తి తన పొరుగువారిని అనుకోకుండ చంపాడు కాని పగతో కాదు.


అందుకు గిద్యోను, “వారు నా సోదరులు, నా సొంత తల్లి కుమారులు. మీరు వారిని బ్రతకనిచ్చి ఉంటే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను మిమ్మల్ని చంపేవాడిని కాదు” అన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ