Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 3:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 “లేవీయులను వారి కుటుంబాలు వంశాల ప్రకారం లెక్కించు. ఒక నెల మొదలుకొని ఆపై వయస్సున్న మగవారినందరిని లెక్కించు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 –లేవీయుల పితరుల కుటుంబములను వారివారి వంశములను లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారినందరిని లెక్కింపవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 “లేవీ వంశానికి చెందిన వాళ్లందర్నీ లెక్కించు. వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం లెక్కించు. లేవీ వంశానికి చెందిన వాళ్లందర్నీ లెక్కించు. వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం లెక్కించు. ఒక నెల వయసున్న పిల్లల నుండి పురుషులందరినీ లెక్కపెట్టు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 “లేవీ వంశంలో ఉన్న లేవీయులను, కుటుంబాలను అన్నింటినీ లెక్కించు. ప్రతి పురుషుని, ఒక నెలగాని అంతకంటె ఎక్కువగాని వయస్సు ఉన్న ప్రతి బాలుని లెక్కించు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 “లేవీయులను వారి కుటుంబాలు వంశాల ప్రకారం లెక్కించు. ఒక నెల మొదలుకొని ఆపై వయస్సున్న మగవారినందరిని లెక్కించు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 3:15
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారి వారి పూర్వికుల కుటుంబాల ప్రకారం వంశావళిలో నమోదైన యాజకులకు, వారి వారి పనుల ప్రకారం, వరుస ప్రకారం, ఇరవై సంవత్సరాలు, అంతకంటే పై వయస్సున్న లేవీయులకు కూడా వారు పంచిపెట్టారు.


నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, నన్ను వెదకేవారికి దొరుకుతాను.


“నీవు వెళ్లి యెరూషలేము వింటూ ఉండగా ఇలా ప్రకటించు: “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ యవ్వనంలోని నీ భక్తి నాకు జ్ఞాపకముంది, మీ నిశ్చితార్థ కాలం యొక్క ప్రేమ నాకు జ్ఞాపకముంది; నీవు అరణ్యంలో నన్ను వెంబడించావు, విత్తబడని భూమిలో నన్ను వెంబడించావు.


గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను; నేను మారని ప్రేమతో నిన్ను నా వైపు ఆకర్షించాను.


నీవూ అహరోను కలిసి ఇశ్రాయేలీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు గలవారు, సైన్యంలో సేవ చేయగలవారిని వారి వారి సేనల ప్రకారం లెక్కించాలి.


అయితే లేవీయుల పూర్వికుల గోత్రం ప్రకారం వీరితో పాటు లెక్కించబడలేదు.


వంశాల ప్రకారం లెక్కించబడిన లేవీయులు: గెర్షోను ద్వార, గెర్షోనీయుల వంశం; కహాతు ద్వార, కహాతీయుల వంశం; మెరారి ద్వార మెరారీయుల వంశము.


లేవీయులలో పురుషులు ఒక నెల ఆపైన వయస్సు ఉన్న వారి సంఖ్య 23,000. ఇశ్రాయేలీయులతో వారు లెక్కించబడలేదు ఎందుకంటే వారి మధ్యలో వారికి వారసత్వం ఇవ్వబడలేదు.


కాబట్టి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే వారిని లెక్కించాడు.


వీరిలో ఒక నెల మొదలుకొని ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 7,500.


ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరు 8,600 మంది. పరిశుద్ధాలయాన్ని కాపాడే బాధ్యత కహాతీయులది.


ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 6,200.


ఒక నెల లేదా ఆ పైబడి వయస్సుగల మొదటి సంతానమైన మగవారందరు 22,273 మంది.


యేసు అది చూసి, శిష్యుల మీద కోప్పడ్డారు. ఆయన వారితో, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే ఇలాంటి వారిదే దేవుని రాజ్యము.


క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా కలుగు రక్షణ గురించిన జ్ఞానాన్ని నీకు కలుగజేయడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండే నీకు తెలుసు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ