Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 23:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 అప్పుడు బిలాము తన సందేశాన్ని ఇచ్చాడు: “బాలాకు నన్ను అరాము నుండి తీసుకువచ్చాడు, మోయాబు రాజు తూర్పు పర్వతాల నుండి తెచ్చాడు. ‘రా, నా కోసం యాకోబును శపించు’ అని అన్నాడు; ‘రా, ఇశ్రాయేలును శపించు.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను – అరామునుండి బాలాకు తూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్ను రప్పించి –రమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 అప్పుడు బిలాము ప్రవచనరీతిగా, “అరాము నుంచి బాలాకు, తూర్పు పర్వతాల నుంచి మోయాబురాజు నన్ను రప్పించి, ‘వచ్చి, నాకోసం యాకోబును శపించు’ అన్నాడు, ‘వచ్చి ఇశ్రాయేలును వ్యతిరేకించు’ అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు: “తూర్పు కొండల్లో నుండి ఆరాము నుండి మోయాబు రాజైన బాలాకు నన్ను ఇక్కడకు తీసుకువచ్చాడు. వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు! ‘వచ్చి నా పక్షంగా యాకోబును శపించు, వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు!’ అన్నాడు నాతో బాలాకు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 అప్పుడు బిలాము తన సందేశాన్ని ఇచ్చాడు: “బాలాకు నన్ను అరాము నుండి తీసుకువచ్చాడు, మోయాబు రాజు తూర్పు పర్వతాల నుండి తెచ్చాడు. ‘రా, నా కోసం యాకోబును శపించు’ అని అన్నాడు; ‘రా, ఇశ్రాయేలును శపించు.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 23:7
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

షేము కుమారులు: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.


వెంటనే పద్దనరాములో నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లు. అక్కడ నీ తల్లి సోదరుడైన లాబాను కుమార్తెలలో ఒకరిని భార్యగా చేసుకో.


అతడు ఇశ్రాయేలీయులను దూషించినప్పుడు, దావీదు సోదరుడు, షిమ్యా కుమారుడైన యోనాతాను అతన్ని చంపాడు.


అతని తర్వాత శ్రేణిలో అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు ఉన్నాడు. ముగ్గురు యోధులలో ఒక్కడైన ఇతడు పస్ దమ్మీములో యుద్ధానికి వచ్చిన ఫిలిష్తీయులను ఎదిరించినప్పుడు దావీదుతో పాటు ఉన్నాడు. ఇశ్రాయేలీయులు వెనుకకు తగ్గినప్పుడు,


యోబు ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నాడు:


యోబు ఇంకా ఈ విధంగా మాట్లాడాడు:


దుర్దినాలు వచ్చినప్పుడు, నా శత్రువుల పాపం నన్ను చుట్టుముట్టినప్పుడు నేనెందుకు భయపడాలి?


నేను ఉపమానం చెప్పడానికి నా నోరు తెరుస్తాను; పూర్వకాలం నుండి దాచబడి ఉన్న విషయాలను నేను తెలియజేస్తాను.


ఎలాగైతే రెపరెపలాడే పిచ్చుక, ఇటు అటు ఎగిరే కోయిల కుదురుగా నిలువవో, కారణం లేని శాపం కూడా నిలువదు.


“మనుష్యకుమారుడా, నీవు ఒక పొడుపు కథ వేసి, దానిని ఇశ్రాయేలీయులకు ఒక ఉపమానంలా చెప్పాలి.


అప్పుడు నేను ఇలా అన్నాను, “ప్రభువైన యెహోవా, వారు నా గురించి, ‘ఇతడు కేవలం ఉపమానాలు చెప్పేవాడే కదా?’ అని అంటున్నారు.”


ఆ రోజు ప్రజలు మీ గురించి ఒక సామెత చెప్తారు; మీ గురించి ఈ విషాద గీతం పాడుతూ ఎగతాళి చేస్తారు: ‘మేము పూర్తిగా పాడైపోయాం; నా ప్రజల ఆస్తి విభజింపబడింది ఆయన దాన్ని నా నుండి తీసుకుంటారు! ఆయన మా భూములను దేశద్రోహులకు అప్పగించారు.’ ”


“అయితే వారందరూ అతన్ని ఎగతాళి చేస్తూ ఈ సామెత చెబుతారు, “ ‘దొంగిలించిన వస్తువులను పోగుచేసి బలత్కారంతో ధనవంతునిగా మారిన వారికి శ్రమ! ఇలా ఎంతకాలం కొనసాగుతుంది?’


‘ఈజిప్టు నుండి వచ్చిన ఒక ప్రజల గుంపు భూమినంతా కప్పుతుంది. నా కోసం వారిని శపించు. బహుశ అప్పుడు నేను వారితో యుద్ధం చేసి తరిమివేస్తాను.’ ”


ఎందుకంటే నేను నిన్ను గొప్పగా గౌరవిస్తాను, నీవు నాకు ఏది చెబితే అది చేస్తాను. వచ్చి నా కోసం ఈ ప్రజలపై శాపం పెట్టండి.”


అప్పుడు బిలాము తన సందేశాన్ని ఇచ్చాడు: “బాలాకు! లేచి, విను; సిప్పోరు కుమారుడా! నా మాట విను.


కాబట్టి బిలాము తిరిగివెళ్లి రాజు, తన మోయాబు అధికారులతో దహనబలి దగ్గర నిలిచియుండడం చూశాడు.


అప్పుడు బిలాము ఈ సందేశాన్ని ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం,


అతడు కెనీయులను చూసి తన సందేశాన్ని ఇచ్చాడు: “మీ నివాసస్థలం భద్రంగా ఉంది, నీ గూడు బండలో ఉంది;


తర్వాత అతడు తన సందేశాన్ని ఇచ్చాడు: “అయ్యో, దేవుడు ఇలా చేస్తే, ఎవరు జీవించగలరు?


అతడు ఈ సందేశం ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం,


యేసు వారికి మరో ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం ఒక స్త్రీ ఇరవై ఏడు కిలోల పిండిని కలిపి ఆ పిండంతా పొంగడానికి దానిలో కలిపిన కొంచెం పులిసిన పిండి లాంటిది.”


ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరాయి: “నేను ఉపమానాలతో నా నోరు తెరుస్తాను. సృష్టికి పునాది వేయబడక ముందే రహస్యంగా ఉంచిన విషయాలు నేను మాట్లాడతాను.”


ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, నాయకులు తమ గురించే ఆయన ఈ ఉపమానం చెప్పారని గ్రహించి ఎలాగైనా ఆయనను బంధించడానికి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. కాని వారు ప్రజలకు భయపడి ఆయనను వదిలి వెళ్లిపోయారు.


మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు వారు మిమ్మల్ని దారిలో రొట్టె గాని నీళ్లు గాని తీసుకుని కలవడానికి రాలేదు. వారు మిమ్మల్ని శపించడానికి అరాము నహరయీములోని పెతోరు నుండి బెయోరు కుమారుడు బిలామును తెచ్చుకున్నారు.


ఆ ఫిలిష్తీయుడు ఇంకా, “ఈ రోజు నేను ఇశ్రాయేలీయుల సైన్యానికి సవాలు విసురుతున్నాను. మీరు ఒకడిని పంపిస్తే మేమిద్దరం ఒకరితో ఒకరం పోరాడతాం” అన్నాడు.


మీ సేవకుడనైన నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను. సజీవుడైన దేవుని సైన్యాలను అవమానిస్తున్న ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దానిలా అవుతాడు.


అందుకు దావీదు ఆ ఫిలిష్తీయునితో, “నీవు కత్తి ఈటె బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు కాని నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాల దేవుడును సైన్యాల అధిపతియైన యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ