Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 16:41 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

41 మరుసటిరోజు ఇశ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద సణిగారు. “మీరు యెహోవా యొక్క ప్రజలను చంపేశారు” అని వారన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

41 మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు–మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

41 తరువాత రోజు ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే అహరోనులను విమర్శిస్తూ “మీరు యెహోవా ప్రజలను చంపారు” అని చెప్పి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

41 మరునాడు ఇశ్రాయేలు ప్రజలంతా మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేసారు. వారు, “యెహోవా ప్రజలను మీరు చంపారు” అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

41 మరుసటిరోజు ఇశ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద సణిగారు. “మీరు యెహోవా యొక్క ప్రజలను చంపేశారు” అని వారన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 16:41
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

అహాబు ఏలీయాను చూడగానే అతనితో, “ఇశ్రాయేలును కష్టపెట్టేవాడివి నీవే గదా?” అన్నాడు.


దేవుని క్రియలు వారు త్వరలోనే మరచిపోయారు. ఆయన సలహాలను వారు లక్ష్యపెట్టు వారు కారు.


“వీరిని నాశనం చేస్తాను” అన్నాడు దేవుడు. మోషే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ఆయన వచ్చి దేవుని ఎదుట సందులో నిలిచి విజ్ఞాపన చేస్తే ఆయన ఉగ్రత వారిని ధ్వంసం చేయకుండా ఆపింది.


యెహోవా! మీ చేయి ఎత్తుగా ఎత్తబడింది, కాని వారు దానిని చూడరు. మీ ప్రజల పట్ల మీకున్న ఆసక్తి చూసి వారు సిగ్గుపడతారు; మీ శత్రువుల కోసం కేటాయించబడిన అగ్ని వారిని కాల్చివేయాలి.


అప్పుడు ఆ అధికారులు రాజుతో, “ఈ వ్యక్తికి మరణశిక్ష విధించాలి. ఇతడు ఈ పట్టణంలో మిగిలి ఉన్న సైనికులను, అలాగే ప్రజలందరినీ తాను వారితో చెప్పే మాటల ద్వార నిరుత్సాహపరుస్తున్నాడు. ఈ వ్యక్తి ఈ ప్రజల క్షేమం కోరడంలేదు, వారి పతనాన్ని కోరుతున్నాడు.”


అయితే నేరియా కుమారుడైన బారూకు మమ్మల్ని బబులోనీయులకు అప్పగించమని నిన్ను మా మీదికి రెచ్చగొడుతున్నాడు, అలా చేస్తే వారు మమ్మల్ని చంపుతారు లేదా బబులోనుకు బందీలుగా తీసుకెళ్తారు” అని అన్నారు.


తర్వాత బేతేలు యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు ఇలా వర్తమానం పంపాడు: “ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనే ఆమోసు నీ మీద కుట్ర పన్నుతున్నాడు. దేశం అతని మాటలన్నిటిని భరించలేకపోతుంది.


ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనుల మీద సణిగి, సమాజమంతా, “మేము ఈజిప్టులో గాని ఎడారిలో గాని చనిపోయుంటే బాగుండేది!


“నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని అవమానించి, హింసించి మీరు చెడ్డవారని మీమీద అపనిందలు వేసినప్పుడు మీరు ధన్యులు.


వారు బిగ్గరగా, “తోటి ఇశ్రాయేలీయులారా, మాకు సహాయం చేయండి! ఈ వ్యక్తి మన ప్రజలకు మన ధర్మశాస్త్రానికి ఈ స్థలానికి వ్యతిరేకంగా ప్రతిచోట అందరికి బోధిస్తున్నాడు. అంతేకాక గ్రీసుదేశస్థులను ఈ దేవాలయంలోనికి తీసుకువచ్చి, ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేశాడు” అని కేకలు వేశారు.


అప్పుడు ప్రధాన యాజకుడు, “ఈ పేరట బోధించకూడదు అని మీకు మేము ఖచ్చితంగా ఆదేశించాము, అయినాసరే మీ బోధలతో యెరూషలేమును నింపి ఈ మనుష్యుని హత్యచేసిన నేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని అన్నాడు.


వారిలా మనం సణుగకూడదు, వారిలో కొందరు సణిగి నాశనం చేసే దూత వలన చనిపోయారు.


ఘనతలో అవమానంలో నిందల్లో మెప్పుల్లో; యథార్థవంతులం అయినప్పటికి మోసం చేసేవారమనే నింద మామీద వేయబడింది;


వారు ఎల్లప్పుడు సణుగుతూ ఇతరులలో తప్పులు వెదుకుతారు; వారు తమ చెడు కోరికలనే అనుసరిస్తారు; వారు తమ గురించి తామే పొగడుకొంటారు, స్వలాభం కోసం ఇతరులను పొగడ్తలతో ముంచెత్తుతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ