Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 1:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 వీరు సమాజంలో వారి పితరుల గోత్రాల నుండి నాయకులుగా ఏర్పాటు చేయబడినవారు. వీరు ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమతమపితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 వీళ్ళంతా ప్రజల్లోనుండి నియమితులయ్యారు. వీరు తమ పూర్వీకుల గోత్రాలకు నాయకులుగానూ, ఇశ్రాయేలు ప్రజల తెగలకు పెద్దలుగానూ ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 ఈ పురుషులు వారి కుటుంబాలకు నాయకులు, వారి వంశాలకు నాయకులుగా కూడా, ప్రజలు ఈ పురుషులను ఏర్పటు చేసుకొన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 వీరు సమాజంలో వారి పితరుల గోత్రాల నుండి నాయకులుగా ఏర్పాటు చేయబడినవారు. వీరు ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 1:16
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవునికి భయపడే, అన్యాయపు లాభాన్ని అసహ్యించుకునే, నమ్మదగిన సామర్థ్యం కలిగిన పురుషులను ప్రజలందరిలో నుండి ఎంపికచేయాలి. తర్వాత వారిని వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాలి.


అతడు ఇశ్రాయేలీయులందరిలో సమర్థవంతులైన వారిని ఎంపికచేసి వారిని ప్రజల మీద అధికారులుగా, వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాడు.


“అయితే బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాల మధ్య నీవు చిన్నదానివైనప్పటికి, నా కోసం ఇశ్రాయేలు మీద పరిపాలన చేసే అధిపతి నీలో నుండి వస్తాడు, ఆయన పూర్వకాలం నుండి శాశ్వతకాలం ఉన్నవాడు.”


నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కుమారుడైన అహీర.”


యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే అహరోనులు పేర్లు పేర్కొనబడిన వారిని తీసుకుని,


ప్రతీ గోత్రం నుండి ఒకడు తన కుటుంబానికి పెద్దగా ఉన్న ప్రతీ ఒకడు మీకు సహాయం చేయాలి.


ఒక బూర మాత్రమే మ్రోగితే, నాయకులు అంటే ఇశ్రాయేలు గోత్రాల అధిపతులు నీ ముందు సమకూడాలి.


నేను దిగివచ్చి నీతో మాట్లాడతాను. నీ మీద ఉన్న ఆత్మ యొక్క శక్తిలో కొద్ది భాగం వారి మీద పెడతాను. వారు నీతో కలిసి ప్రజల భారం పంచుకుంటారు అప్పుడు నీవు ఒంటరిగా మోయనవసరం ఉండదు.


మోషేకు ఎదురు తిరిగారు. వారితో 250 మంది ఇశ్రాయేలు నాయకులు, సమాజ నాయకులుగా ఏర్పరచబడిన ప్రముఖులు చేరారు.


ఏలీయాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. ఈ దాతాను, అబీరాములే మోషే అహరోనులకు ఎదురు తిరిగినవారు, కోరహు అనుచరులు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వారి మధ్య ఉన్న అధికారులు.


మోషే ఇశ్రాయేలు గోత్ర పెద్దలతో ఇలా చెప్పాడు: “యెహోవా ఆజ్ఞాపించింది ఇదే:


తర్వాత ఇశ్రాయేలు నాయకులు, లెక్కించబడిన వారిపట్ల బాధ్యత వహించిన గోత్ర నాయకులు యైన కుటుంబ పెద్దలు అర్పణలు అర్పించారు.


కాబట్టి మీ గోత్రాల్లో నుండి జ్ఞానం కలిగి ప్రసిద్ధులైన వారిని పిలిపించి, వారిని మీ గోత్రాలకు అధికారులుగా, వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాను.


గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, నేనెలా ఇశ్రాయేలును కాపాడగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో బలహీనమైనది, నా కుటుంబంలో నేను అందరికంటే చిన్నవాడను.”


సౌలు వారితో, “బెన్యామీనీయులారా వినండి, యెష్షయి కుమారుడు మీకు పొలాలు ద్రాక్షతోటలు ఇస్తాడా? మిమ్మల్ని వేలమంది మీద వందలమంది మీద అధిపతులుగా చేస్తాడా?


అతడు దాక్కున్న స్థలాలన్నిటిని కనిపెట్టి ఆ వివరాలు తీసుకుని నా దగ్గరకు మళ్ళీ రండి. అప్పుడు నేను మీతో కూడా వచ్చి అతడు దేశంలో ఎక్కడ ఉన్నా యూదా వంశస్థుల అందరిలో నేను అతన్ని వెదికి పట్టుకుంటాను” అన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ