Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 9:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 మాకు జరిగినదాని అంతటిలో మీరు నీతిమంతులుగానే ఉన్నారు; మేము దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు మీరు నమ్మకంగా ప్రవర్తించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 మా మీదికి వచ్చినశ్రమ లన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే; నీవు సత్యము గానే ప్రవర్తించితివి కాని మేము దుర్మార్గులమైతిమి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 మా మీదికి వచ్చిన బాధలన్నిటినీ చూసినప్పుడు నువ్వు మా పట్ల అన్యాయంగా ప్రవర్తించ లేదు. నువ్వు యథార్ధంగానే ఉన్నావు, మేమే దుర్మార్గులమయ్యాం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

33 అందుకని దేవా మాకు సంభవించే ప్రతి దాన్నిగురించీ నీదే ఒప్పు, మాదే తప్పు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 మాకు జరిగినదాని అంతటిలో మీరు నీతిమంతులుగానే ఉన్నారు; మేము దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు మీరు నమ్మకంగా ప్రవర్తించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 9:33
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అలా నాశనం చేయడం మీకు దూరమవును గాక! దుష్టులతో పాటు నీతిమంతులను చంపడం, దుష్టులను నీతిమంతులను ఒకేలా చూడడము. మీ నుండి ఆ తలంపు దూరమవును గాక! సర్వలోక న్యాయాధిపతి న్యాయం చేయరా?” అని అన్నాడు.


యెహోవా, ఇశ్రాయేలు దేవా, మీరు నీతిమంతులు! ఈ రోజున మేము కొద్ది మందిమి మిగిలాము. మేము మీ ముందు నిలబడడానికి మేమెవరం అర్హులం కాకపోయిన, మీ ఎదుట మా అపరాధంలో నిలబడ్డాము.”


మా రాజులు, మా నాయకులు, మా యాజకులు, మా పూర్వికులు మీ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు; మీరు పాటించమని హెచ్చరించిన మీ ఆజ్ఞలు శాసనాలను లక్ష్యపెట్టలేదు.


అతని హృదయం మీ పట్ల నమ్మకంగా ఉందని గుర్తించి కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయుల దేశాన్ని అతని వారసులకు ఇస్తానని అతనితో నిబంధన చేశారు. మీరు నీతిమంతులు కాబట్టి మీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.


వారు ఇతరుల దగ్గరకు వెళ్లి ఇలా చెప్తారు, ‘నేను పాపం చేశాను, సరియైన దానిని వంకరగా మార్చాను, అయినా దానికి తగిన శిక్ష నాకు విధించబడలేదు.


ఒకరు దేవుని ఎదుట న్యాయవిచారణలోకి రాకముందే, వానిని ఎక్కువగా విచారణ చేయనవసరం ఆయనకు లేదు.


మా పూర్వికుల్లాగే మేమూ పాపాలు చేశాము; మేము తప్పు చేశాం దుష్టత్వంతో ప్రవర్తించాం.


యెహోవా, మీరు నీతిమంతులు, మీ న్యాయవిధులు యథార్థమైనవి.


యెహోవా తన మార్గాలన్నిటిలో నీతిమంతుడు. ఆయన క్రియలన్నిటిలో నమ్మకమైనవాడు.


అప్పుడు మోషే యెహోవా దగ్గరకు తిరిగివెళ్లి, “అయ్యో, ఈ ప్రజలు ఎంతో ఘోరమైన పాపం చేశారు! తమ కోసం బంగారంతో దేవుళ్ళను తయారుచేసుకున్నారు.


యెహోవా, నేను మీ ముందు ఎప్పుడు వాదన వినిపించినా మీరెప్పుడూ నీతిమంతునిగానే ఉంటారు. అయినా మీ న్యాయం గురించి నేను మీతో మాట్లాడతాను: దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు? నమ్మకద్రోహులంతా ఎందుకు సుఖంగా జీవిస్తున్నారు?


వారికి గాని, మీకు గాని, మీ పూర్వికులకు గాని ఎన్నడూ తెలియని ఇతర దేవతలకు వారు ధూపం వేసి, పూజించి వారు నా కోపాన్ని రెచ్చగొట్టారు.


“యెహోవా నీతిమంతుడు, అయినా నేను ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను. జనాంగములారా, వినండి; నా శ్రమను చూడండి. నా యువకులు, యువతులు చెరకు వెళ్లారు.


మీ చుట్టూ ఉన్న జాతుల విధులను పాటించడానికి మీరు ఎవరి శాసనాలను అనుసరించకుండా ఎవరి విధులను పాటించలేదో ఆ యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ