Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 8:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 యాజకుడైన ఎజ్రా ఏడవ నెల మొదటి రోజున విని గ్రహించగలిగిన స్త్రీలు పురుషులందరు ఉన్న సమాజం ఎదుటకు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకువచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 యాజకుడైన ఎజ్రా యేడవ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింపశక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి యెదుటను ఆ ధర్మశాస్త్రగ్రంథము తీసికొనివచ్చి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 ఎజ్రా ఏడవ నెల మొదటి రోజున గ్రంథాన్ని చదువుతుండగా అర్థం చేసుకోగలిగే స్త్రీ పురుషులు కలసి ఉన్న సమూహం ఎదుటికి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 యాజకుడైన ఎజ్రా సమావేశమైన జనం ముందుకి ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. అది నెల మొదటి రోజు. అది ఏడాదిలో ఏడవ నెల. ఆ సమావేశంలో స్త్రీలు, పురుషులు విని, అర్థం చేసుకోగల వయస్కులు వున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 యాజకుడైన ఎజ్రా ఏడవ నెల మొదటి రోజున విని గ్రహించగలిగిన స్త్రీలు పురుషులందరు ఉన్న సమాజం ఎదుటకు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకువచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 8:2
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

తమ బంధువులైన అధిపతులతో కలిసివచ్చి దేవుని సేవకుడైన మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తామని, మా ప్రభువైన యెహోవా ఆజ్ఞలకు నిబంధనలకు శాసనాలకు లోబడతామని శపథం చేసి ప్రమాణం చేశారు.


ఆ రోజున ప్రజల వినికిడిలో మోషే గ్రంథం బిగ్గరగా చదువుతూ ఉండగా; అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని సమాజంలోకి ప్రవేశించకూడదని వ్రాయబడిన భాగం కనబడింది,


మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ప్రతిరోజు ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ వచ్చాడు. వారు ఏడు రోజులు పండుగ చేసుకుని నియమించిన ప్రకారం ఎనిమిదవ రోజున పరిశుద్ధ సంఘంగా కూడుకున్నారు.


ప్రజలందరు ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు వినగానే ఏడ్వడం మొదలుపెట్టారు. అప్పుడు అధిపతియైన నెహెమ్యా, యాజకుడూ ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రా, ప్రజలు గ్రహించేలా బోధించి లేవీయులు వారందరితో, “ఈ రోజు మన దేవుడైన యెహోవాకు పరిశుద్ధ దినం కాబట్టి మీరు దుఃఖపడకండి ఏడవకండి” అని చెప్పారు.


అదే నెల ఇరవై నాలుగవ రోజున ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకుని తలమీద బూడిద వేసుకుని వచ్చారు.


“ఆయన ఎవరికి బోధించే ప్రయత్నం చేస్తున్నారు? ఆయన తన సందేశాన్ని ఎవరికి వివరిస్తున్నారు? తల్లి రొమ్ము విడిచిన వారికా, స్తన్యమును విడిచిన వారికా?


“ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏడవ నెల మొదటి రోజున మీరు సబ్బాతు విశ్రాంతి దినం, బూర ధ్వనితో స్మరించుకుంటూ పరిశుద్ధ సభ నిర్వహించాలి.


“యాజకులు సైన్యాలకు అధిపతియైన యెహోవా దూతలు. ఎందుకంటే మనుష్యులు వారి నోట ధర్మశాస్త్రం విని నేర్చుకుంటారు. కాబట్టి వారు జ్ఞానాన్ని కలిగి బోధించాలి.


“ ‘ఏడవ నెల మొదటి రోజు పరిశుద్ధ సభను ఏర్పాటు చేయాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. ఆ రోజు మీరు బూరల ధ్వని చేసే రోజు.


ఎందుకంటే, మోషే ధర్మశాస్త్రాన్ని అనేక తరాల నుండే ప్రతి పట్టణంలోని సమాజమందిరాల్లో ప్రతి సబ్బాతు దినాన చదువుతూ బోధిస్తున్నారు” అని చెప్పాడు.


అతడు తన రాజ్యసింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, లేవీయ యాజకుల దగ్గర ఉన్న ధర్మశాస్త్రాన్ని చూసి తన కోసం ఒక ప్రతిని వ్రాసుకోవాలి.


స్త్రీలు, పిల్లలు, వారి మధ్య నివసించే విదేశీయులతో సహా ఇశ్రాయేలీయుల సమాజమంతటి సమక్షంలో మోషే ఆజ్ఞాపించిన వాటిలో యెహోషువ చదవకుండా ఒక్క మాట కూడా విడిచిపెట్టలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ