Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 12:46 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

46 చాలా కాలం క్రితం దావీదు, ఆసాపు కాలంలో సంగీతకారులను దేవునికి కృతజ్ఞతా స్తుతి గీతాలను నడిపించేవారు ఉండేవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

46 పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రగీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

46 పూర్వం దావీదు జీవించిన కాలంలో ఆసాపు పర్యవేక్షణలో గాయకుల నియామకం, స్తుతి గీతాల ఎంపిక, పాటలు పాడడం మొదలైన విషయాలు జరిగేవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

46 (ఎన్నడో పూర్వం, దావీదు కాలంలో, ఆసాపు ప్రధానుడుగా వున్నాడు. అతనికి చాలా స్తోత్రాలూ, దైవసంకీర్తనలూ తెలుసును.)

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

46 చాలా కాలం క్రితం దావీదు, ఆసాపు కాలంలో సంగీతకారులను దేవునికి కృతజ్ఞతా స్తుతి గీతాలను నడిపించేవారు ఉండేవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 12:46
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

లేవీయుల కుటుంబ పెద్దలలో సంగీతకారులు దేవాలయపు గదుల్లో ఉండేవారు. వారు రాత్రింబగళ్ళు పని చేయాలి కాబట్టి వారికి వేరే ఏ పని అప్పగించబడలేదు.


దావీదు, దీర్ఘదర్శియైన ఆసాపు వ్రాసిన కీర్తనలు పాడి యెహోవాను స్తుతించాలని లేవీయులకు హిజ్కియారాజు అధికారులు ఆదేశించారు. వారు ఆనందంతో స్తుతిగానం చేస్తూ తలలు వంచి ఆరాధించారు.


కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన నడిపించే నాయకుడు ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా; అతని సహకారులలో రెండవవాడైన బక్బుక్యా; యెదూతూను కుమారుడైన గాలాలుకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దా.


పరాయి దేశంలో ఉండగా యెహోవా పాటలు మనం ఎలా పాడగలము?


ఇశ్రాయేలుకు, శుద్ధ హృదయులకు దేవుడు ఖచ్చితంగా మంచివాడు.


ఓ దేవా! మౌనంగా ఉండకండి; ఓ దేవా, మమ్మల్ని పెడచెవిని పెట్టకండి, నిశ్చలంగా ఉండకండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ