Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నహూము 2:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 వెండిని దోచుకో! బంగారాన్ని దోచుకో! ఆమె ఖజానాల్లో అంతులేని సంపదలు ఉన్నాయి!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 వెండి కొల్లపట్టుడి, బంగారము కొల్లపట్టుడి, అది సకలవిధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది, అవి లెక్కలేక యున్నవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 అది లెక్కలేనన్ని వివిధ విచిత్ర ఆభరణాలతో నిండి ఉంది. వెండి కొల్లగొట్టండి, బంగారం కొల్లగొట్టండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 నీనెవెను నాశనం చేస్తున్న సైనికులారా, వెండిని తీసుకోండి! బంగారాన్ని దోచుకోండి! తీసుకోటానికి అనేక వస్తువులున్నాయి. ఎన్నో ధనాగారాలున్నాయి!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 వెండిని దోచుకో! బంగారాన్ని దోచుకో! ఆమె ఖజానాల్లో అంతులేని సంపదలు ఉన్నాయి!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నహూము 2:9
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

వసంతకాలం వచ్చినప్పుడు నెబుకద్నెజరు రాజు మనుష్యులను పంపి అతన్ని, అతనితో పాటు యెహోవా మందిరంలో ఉన్న విలువైన వస్తువులను బబులోనుకు రప్పించాడు. అతడు యెహోయాకీను పినతండ్రియైన సిద్కియాను యూదా, యెరూషలేము మీద రాజుగా చేశాడు.


నాశనం చేసేవాడా, ఇంకా నాశనం చేయబడని నీకు శ్రమ! మోసం చేసేవాడా, ఇంకా మోసం చేయబడని నీకు శ్రమ! నీవు నాశనం చేయడం ముగించిన తర్వాతే నీవు నాశనం చేయబడతావు; నీవు మోసగించడం ముగించిన తర్వాతే నీవు మోసగించబడతావు.


దేశాల్లారా, మిడతలు పంటను తిన్నట్లుగా మీ సొమ్ము దోచుకోబడుతుంది; మిడతల దండులా ప్రజలు దాని మీద పడతారు.


కాపరులారా, ఏడవండి రోదించండి; మంద నాయకులారా, దుమ్ములో దొర్లండి. ఎందుకంటే మీరు వధించబడే సమయం ఆసన్నమైంది; మీరు శ్రేష్ఠమైన పొట్టేళ్లలా పడిపోతారు.


నేను చూస్తున్నదేంటి? వారు భయభ్రాంతులకు గురవుతున్నారు, వారు వెన్ను చూపుతున్నారు, వారి యోధులు ఓడిపోయారు. వారు వెనుకకు చూడకుండ వేగంగా పారిపోతున్నారు, అన్నివైపులా భయమే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


బబులోను మీదికి నాశనం చేసేవాడు వస్తాడు; దాని యోధులు బందీలవుతారు, ఎందుకంటే వారి విల్లులు విరిగిపోతాయి. యెహోవా ప్రతీకారం చేసే దేవుడు; ఆయన పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.


వారు నీ సంపదను దోచుకుంటారు నీ వస్తువులను దొంగిలిస్తారు. వారు నీ గోడలను కూల్చివేసి, నీ విలాసవంతమైన భవనాలను పడగొట్టి, నీ రాళ్లను కలపను సముద్రంలోకి విసిరివేస్తారు.


అతడు వారి దేవుళ్ళను, వారి పోతవిగ్రహాలను, వారి విలువైన వెండి బంగారు వస్తువులను పట్టుకుని ఈజిప్టుకు తీసుకెళ్తాడు. కొన్ని సంవత్సరాలు అతడు ఉత్తరాది రాజును ఒంటరిగా వదిలేస్తాడు.


మీ కావలివారు మిడతల్లా ఉన్నారు, మీ అధికారులు మిడతల గుంపులా ఉన్నారు. అవి చలికాలంలో గోడల మీద ఉండి ఎండ రాగానే ఎగిరిపోతాయి. అవి ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు.


వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, విలువైన రాళ్లు, ముత్యాలు; సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు; సువాసన ఇచ్చే అన్ని రకాల చెక్కలు, దంతాలతో చాలా విలువైన చెక్కతో ఇత్తడి ఇనుము నునుపురాళ్లతో తయారుచేసిన అన్ని రకాల వస్తువులు;


బిగ్గరగా ఇలా రోదించారు, “ ‘మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ! సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, ఎరుపురంగు బట్టలు ధరించుకొని, బంగారంతో, విలువైన రాళ్లతో, ముత్యాలతో అలంకరించుకుని మెరుస్తున్నదానా,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ