Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నహూము 1:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 వారు యెహోవాకు వ్యతిరేకంగా ఏ పన్నాగం పన్నినా, ఆపద రెండవసారి రాకుండ, ఆయన దానిని అంతం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 యెహోవానుగూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 యెహోవాను గూర్చి మీరు పన్నుతున్న కుట్రలేమిటి? రెండవసారి ఆపద కలగకుండా ఆయన దాన్ని పూర్తిగా నివారిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 యూదా, యెహోవాపై కుట్రలు ఎందుకు పన్నుతున్నావు? కాని ఆయన వారి పన్నాగాలన్నిటినీ వమ్ము చేస్తాడు. కష్టం రెండవసారి రాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 వారు యెహోవాకు వ్యతిరేకంగా ఏ పన్నాగం పన్నినా, ఆపద రెండవసారి రాకుండ, ఆయన దానిని అంతం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నహూము 1:9
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

యోవాబు ఎడమ చేతిలో ఉన్న కత్తిని అమాశా చూడలేదు కాబట్టి అజాగ్రత్తగా ఉన్నాడు. యోవాబు కత్తి తీసి అతని కడుపులో పొడవగానే అమాశా ప్రేగులు బయటకు వచ్చి నేల మీద పడి అక్కడే అతడు చనిపోయాడు. అప్పుడు యోవాబు అతని తమ్ముడైన అబీషైలు బిక్రి కుమారుడైన షేబను వెంటాడుతూ వెళ్లారు.


వారు మీకు వ్యతిరేకంగా కీడు చేయాలని కుట్రపన్నినా దుష్ట పన్నాగాలు వేసినా, వారు విజయం సాధించలేరు.


యెహోవా దేశాల ప్రణాళికలను విఫలం చేస్తారు; ప్రజల ఉద్దేశాలను ఆయన అడ్డుకుంటారు.


యెహోవాకు వ్యతిరేకంగా సఫలం కాగల జ్ఞానం గాని, అంతరార్థం గాని, ప్రణాళిక గాని లేదు.


ఇప్పుడు మీ ఎగతాళి మానండి లేదంటే మీ సంకెళ్ళు మరింత భారమవుతాయి; భూమంతా ఖచ్చితంగా నాశనం చేయబడుతుందని సైన్యాల అధిపతియైన యెహోవా నాకు చెప్పారు.


తర్వాత, ‘నేను దాని మీదికి తెచ్చే విపత్తు వల్ల బబులోను ఇక లేవకుండ అలాగే మునిగిపోతుంది. దాని ప్రజలు పతనమవుతారు.’ అని నీవు చెప్పాలి.” యిర్మీయా మాటలు ఇంతటితో ముగిశాయి.


అప్పుడు యెహోవానైన నేనే నా ఖడ్గాన్ని మళ్ళీ ఒరలో పెట్టకుండా దూసానని ప్రజలందరూ తెలుసుకుంటారు.’


“ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: “ ‘విపత్తు! విపత్తు వెనకే విపత్తు చూడండి, అది వచ్చేస్తుంది!


నేను వారికి శిక్షణ ఇచ్చి బలపరిచాను, కాని నాకు విరుద్ధంగా దురాలోచన చేస్తున్నారు.


నీనెవే, నీ నుండి యెహోవాకు వ్యతిరేకంగా చెడు పన్నాగాలు పన్నేవాడు, దుష్ట ప్రణాళికలు వేసే ఒకడు వచ్చాడు.


వితండ వాదాలను, దేవుని జ్ఞానానికి అడ్డునిలిచే ప్రతి ఆటంకాన్ని మేము ధ్వంసం చేస్తాము. ప్రతి ఆలోచనను వశపరచుకొని క్రీస్తుకు లోబడేలా చేస్తాము.


అప్పుడు అబీషై దావీదుతో, “దేవుడు ఈ రోజు నీ శత్రువును నీకప్పగించారు. కాబట్టి నీవు ఒప్పుకుంటే ఆ ఈటెతో ఒక పోటు పొడిచి నేనతడిని భూమిలో దిగేలా చేస్తాను, రెండవ పోటు పొడిచే అవసరం కూడా ఉండదు” అన్నాడు.


ఆ రోజున ఏలీ ఇంటివారికి వ్యతిరేకంగా నేను మాట్లాడినదంతా మొదటి నుండి చివరి వరకు వారి మీదికి రప్పిస్తాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ