Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నహూము 1:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 వారు ముళ్ళపొదల్లో చిక్కుకొని తమ ద్రాక్షరసంతో మత్తులై ఎండిన చెత్తలా కాలిపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలె కాలిపోవుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 శత్రువులు ద్రాక్షారసం తాగి మత్తెక్కి ముళ్ళకంపల్లాగా చిక్కుబడి పోయి ఎండిపోయిన చెత్తలాగా కాలిపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 చిక్కుపడిన ముండ్లపొదలా నీ శత్రువు నాశనం చేయబడతాడు. ఎండిన కలుపు మొక్కల్లా వారు వేగంగా కాలిపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 వారు ముళ్ళపొదల్లో చిక్కుకొని తమ ద్రాక్షరసంతో మత్తులై ఎండిన చెత్తలా కాలిపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నహూము 1:10
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

తర్వాత అబ్షాలోము తన సేవకులను పిలిచి, “వినండి, అమ్నోను బాగా త్రాగి మత్తు ఎక్కినప్పుడు నేను మీతో, ‘అమ్నోనును కొట్టి చంపండి’ అని చెప్తాను. అప్పుడు మీరు అతన్ని చంపండి. భయపడకండి! మీకు ఆజ్ఞ ఇచ్చింది నేను కాదా? కాబట్టి ధైర్యంగా ఉండండి” అని ఆదేశించాడు.


వారు కందిరీగల్లా నా చుట్టూ తిరిగారు, కాని మండుతున్న ముళ్ళపొదల్లా వారు త్వరగా కాలిపోయారు; యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.


మీరు వారిని పొగలా ఊదివేయండి; మైనం అగ్నికి కరిగి పోయినట్టు దుష్టులు దేవుని ఎదుట నశించెదరు గాక.


“మీకు వ్యతిరేకంగా లేచినవారిని మీ మహిమాతిశయంతో అణచివేశారు. మీరు మీ కోపాగ్నిని రగిలించారు అది వారిని చెత్తలా దహించింది.


కాబట్టి ప్రజలు గడ్డికి బదులు ఎండిన దుబ్బులను సేకరించడానికి ఈజిప్టు దేశమంతా చెదిరిపోయారు.


నాకు కోపం లేదు. ఒకవేళ గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటే యుద్ధం చేయడానికి వాటికి ఎదురు వెళ్తాను వాటన్నిటిని కాల్చివేస్తాను.


నిజంగా వారు గడ్డిపరకలా అవుతారు; అగ్ని వారిని కాల్చివేస్తుంది. అగ్ని జ్వాలల నుండి వారు తమను తాము కాపాడుకోలేరు. అవి చలికాచుకోవడానికి వాడే నిప్పులు కాదు; ఎదురుగా కూర్చుని కాచుకునే అగ్ని కూడా కాదు.


వారు సైన్యాల యెహోవా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్యాన్ని తృణీకరించారు, కాబట్టి మంటలు గడ్డిని కాల్చినట్లుగా ఎండుగడ్డి మంటలో కాలిపోయినట్లుగా వారి వేరులు కుళ్లిపోతాయి, వారి పూలు ధూళిలా ఎగిరిపోతాయి.


వారు, “రండి, నేను ద్రాక్షరసం తెప్పిస్తాను మనం తృప్తిగా మద్యం త్రాగుదాం! ఈ రోజులానే రేపు ఉంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది” అంటారు.


ఖచ్చితంగా దుష్టత్వం అగ్నిలా మండుతుంది అది గచ్చపొదలను, ముళ్ళచెట్లను కాల్చివేస్తుంది; అడవి పొదలను దహనం చేసి దట్టమైన పొగలా పైకి లేస్తుంది.


అయితే వారు ఉత్సాహంగా ఉన్నప్పుడు, నేను వారికి విందు ఏర్పాటుచేసి, వారు సంతోషించేలా, మద్యంతో వారికి మత్తు ఎక్కేలా చేస్తాను అప్పుడు వారు శాశ్వతంగా నిద్రపోతారు, తిరిగి మేలుకోరు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


నేను దాని ఉన్నతాధికారులు, జ్ఞానులు, దాని అధిపతులు, అధికారులు, యోధులు కూడా మద్యం త్రాగి మత్తెక్కేలా చేస్తాను. వారు శాశ్వతంగా నిద్రపోతారు ఇక మేలుకోరు,” అని సైన్యాల యెహోవా అనే పేరుగల రాజు ప్రకటిస్తున్నారు.


వారిలో మంచి వారు ముళ్ళపొద వంటివారు, వారిలో అత్యంత యథార్థవంతులు ముండ్లకంచె కంటే ఘోరము. దేవుడు మిమ్మల్ని దర్శించే రోజు, మీ కాపరులు హెచ్చరించే రోజు వచ్చింది. ఇప్పుడే మీరు కలవరపడే సమయము.


నీకు కూడా మత్తు ఎక్కుతుంది; నీవు వెళ్లి దాక్కుని శత్రువు నుండి కాపాడుకోడానికి ఆశ్రయాన్ని వెదకుతావు.


“తీర్పు దినం ఖచ్చితంగా వస్తుంది; అది మండుతున్న కొలిమిలా ఉంటుంది. గర్విష్ఠులందరూ, కీడుచేసే ప్రతివాడు ఎండుగడ్డిలా ఉంటారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. “రాబోయే ఆ రోజున వారు కాలిపోతారు, వారికి వేరు గాని, కొమ్మ గాని మిగలదు.


అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరకు వచ్చినప్పుడు, రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి, బాగా త్రాగుతూ ఆనందిస్తూ మత్తులో మునిగిపోయాడు కాబట్టి తెల్లవారే వరకు అతనితో ఆమె ఏమీ మాట్లాడలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ