Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మీకా 7:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 ఆ రోజు ప్రజలు అష్షూరు నుండి ఈజిప్టు పట్టణాల నుండి మీ దగ్గరకు వస్తారు, ఈజిప్టు మొదలుకొని యూఫ్రటీసు వరకు, సముద్రం నుండి సముద్రం వరకు పర్వతం నుండి పర్వతం వరకు ఉన్న ప్రజలు వస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 ఆ దినమందు అష్షూరుదేశమునుండియు, ఐగుప్తుదేశపు పట్టణములనుండియు, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసునదివరకు ఉన్న ప్రదేశమునుండియు, ఆయా సముద్రములమధ్యదేశములనుండియు, ఆయా పర్వతములమధ్యదేశములనుండియు జనులు నీ యొద్దకు వత్తురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 ఆ రోజు అష్షూరు దేశం నుంచి, ఐగుప్తు దేశపు పట్టణాల నుంచి, ఐగుప్తు మొదలు యూఫ్రటీసు నది వరకూ ఉన్న ప్రాంతం నుంచి, ఒక సముద్రం నుంచి మరో సముద్రం వరకూ ఒక పర్వతం నుంచి మరో పర్వతం వరకూ ఉన్న ప్రజలు నీ దగ్గరికి వస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 నీ ప్రజలు నీ దేశానికి తిరిగివస్తారు. అష్షూరునుండి, ఈజిప్టు దేశపు నగరాలనుండి వారు వస్తారు. నీ దేశం ఈజిప్టు నది మొదలుకొని యూఫ్రటీసు నదివరకు, పడమట సముద్రంనుండి తూర్పున పర్వతాలవరకు వ్యాపించి ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 ఆ రోజు ప్రజలు అష్షూరు నుండి ఈజిప్టు పట్టణాల నుండి మీ దగ్గరకు వస్తారు, ఈజిప్టు మొదలుకొని యూఫ్రటీసు వరకు, సముద్రం నుండి సముద్రం వరకు పర్వతం నుండి పర్వతం వరకు ఉన్న ప్రజలు వస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మీకా 7:12
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు, ఏలాము, బబులోను, హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు.


ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన రోజున వారికి దారి ఏర్పడినట్లు అష్షూరు నుండి వచ్చే ఆయన ప్రజల్లో మిగిలిన వారికి రాజమార్గం ఉంటుంది.


‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘వారిని ఆపవద్దు’ అని దక్షిణ దిక్కుకు చెప్తాను. దూరం నుండి నా కుమారులను భూమి అంచుల నుండి నా కుమార్తెలను తీసుకురండి.


చూడండి, వారు దూరం నుండి వస్తారు కొందరు ఉత్తరం నుండి కొందరు పడమటి నుండి, కొందరు సీనీయుల దేశం నుండి వస్తారు.”


“నేను వాటిని తరిమికొట్టిన దేశాలన్నిటిలో నుండి నా మందలో మిగిలిన వాటిని నేనే పోగుచేసి, వాటి పచ్చిక బయళ్లకు తిరిగి వాటిని తీసుకువస్తాను, అక్కడ అవి ఫలించి వృద్ధిచెందుతాయి.


ఆ రోజుల్లో యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉంటారు, వారు కలిసి ఉత్తర దేశం నుండి నేను మీ పూర్వికులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి వస్తారు.


చూడు, నేను వారిని ఉత్తర దేశం నుండి రప్పించి, భూమి మూలల నుండి వారిని పోగుచేస్తాను. వారిలో గ్రుడ్డివారు, కుంటివారు, తల్లి కాబోతున్నవారు పురిటినొప్పులు పడుతున్న స్త్రీలు ఉంటారు; గొప్ప గుంపు తరలివస్తుంది.


“నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలూ, కలవరపడకు. నేను నిన్ను సుదూర ప్రాంతం నుండి తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతివారిని బందీలుగా ఉన్న దేశం నుండి రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ శాంతి భద్రతలు కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు.


“ఆ రోజున నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగిర్చేలా చేస్తాను. వారి మధ్య మాట్లాడటానికి నీకు ధైర్యాన్ని ఇస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”


వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలీయులు చెదరిపోయిన దేశాల నుండి నేను వారిని బయటకి తీసుకువస్తాను. వారిని చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి సమకూర్చి వారి స్వదేశానికి తిరిగి రప్పిస్తాను.


వారు వణకుతూ ఈజిప్టు నుండి పక్షుల్లా ఎగిరి వస్తారు, అష్షూరు నుండి గువ్వల్లా అల్లాడుతూ వస్తారు. వారిని తమ ఇళ్ళలో నివసించేలా చేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ