Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మీకా 7:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 అప్పుడు నా శత్రువు దాన్ని చూసి, ఇలా జరగడం చూసి సిగ్గుపడుతుంది. “నీ దేవుడైన యెహోవా ఎక్కడ?” అని నాతో అన్న ఆమె నా కళ్లు ఆమె పతనం చూస్తాయి; ఇప్పుడు కూడా ఆమె వీధిలోని బురదలా కాళ్లక్రింద త్రొక్కబడుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 నా శత్రువు దాని చూచును. –నీ దేవుడైన యెహోవా యెక్కడనని నాతో అనినది అవమానము నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 నా శత్రువు దాన్ని చూస్తాడు. “నీ యెహోవా దేవుడు ఎక్కడ?” అని నాతో అన్నది అవమానం పాలవుతుంది. నా కళ్ళు ఆమెను చూస్తాయి. వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 నా శత్రువు ఇది చూసి సిగ్గుపడతాడు. “నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు?” అని నా శత్రువు నన్నడిగాడు. ఆ సమయంలో ఆమెను చూసి నేను నవ్వుతాను. వీధిలో మట్టిమీద నడిచినట్లు జనులు ఆమెమీద నడుస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 అప్పుడు నా శత్రువు దాన్ని చూసి, ఇలా జరగడం చూసి సిగ్గుపడుతుంది. “నీ దేవుడైన యెహోవా ఎక్కడ?” అని నాతో అన్న ఆమె నా కళ్లు ఆమె పతనం చూస్తాయి; ఇప్పుడు కూడా ఆమె వీధిలోని బురదలా కాళ్లక్రింద త్రొక్కబడుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మీకా 7:10
42 ပူးပေါင်းရင်းမြစ်များ  

భూమి మీద ఉండే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను; వీధుల్లోని బురదలా నేను వారిని తొక్కాను.


నా మీద నేరం మోపేవారు అవమానాన్ని వస్త్రంగా ధరించుదురు గాక ఒక వస్త్రంలో అయినట్టుగా సిగ్గుతో చుట్టబడతారు.


“వారి దేవుడు ఎక్కడ?” అని జనులు ఎందుకు అంటున్నారు?


గాలికి కొట్టుకుపోయే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను; వీధుల్లోని బురదలా నేను వారిని తొక్కాను


నా బాధను చూసి ఆనందిస్తున్న వారందరు అవమానంతో సిగ్గుపడాలి; నా మీద గర్వించే వారందరు సిగ్గుతో అపకీర్తి పాలవుదురు గాక.


రోజుంతా అదే పనిగా నా విరోధులు, “మీ దేవుడెక్కడ?” అని అంటూ నన్ను గేలి చేస్తూ ఉంటే నా ఎముకలు మరణ బాధ అనుభవిస్తున్నాయి.


“మీ దేవుడు ఎక్కడున్నాడు?” అని నా శత్రువులు నాతో అంటూ ఉంటే రాత్రింబగళ్ళు, నా కన్నీరే నాకు ఆహారం అవుతున్నాయి.


ప్రతీకారం జరిగినప్పుడు నీతిమంతులు సంతోషిస్తారు, దుష్టుల రక్తంలో వారు కాళ్లు కడుక్కుంటారు.


“వారి దేవుడు ఎక్కడ?” అని ఇతర దేశాలు ఎందుకు అనాలి? మీ సేవకుల రక్తానికి మీరు ప్రతీకారం తీర్చుకుంటారని మా కళ్ళెదుట ఇతర దేశాల వారికి తెలియజేయండి.


నీతిమంతులు తాటి చెట్లలా చిగురు పెడతారు, లెబానోనులో వారు దేవదారు చెట్టులా హుందాగా పెరుగుతారు.


యెహోవా! మీ చేయి ఎత్తుగా ఎత్తబడింది, కాని వారు దానిని చూడరు. మీ ప్రజల పట్ల మీకున్న ఆసక్తి చూసి వారు సిగ్గుపడతారు; మీ శత్రువుల కోసం కేటాయించబడిన అగ్ని వారిని కాల్చివేయాలి.


“ఉత్తరం వైపు నుండి నేను ఒకడిని రేపుతున్నాను. నా పేరిట ప్రార్థించే వాడొకడు సూర్యోదయ దిక్కునుండి వస్తున్నాడు. కుమ్మరి మట్టిని త్రొక్కినట్లు ఒకడు బురదను త్రొక్కినట్లు అతడు పాలకులను త్రొక్కుతాడు.


“ఇప్పుడు నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా, మనుష్యులు నిన్ను తృణీకరించేలా చేస్తాను.


“బబులోనుకు, బబులోనులో నివసించే వారందరికి సీయోనులో చేసిన అన్యాయానికి బదులుగా మీ కళ్లముందే నేను ప్రతిఫలం చెల్లిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


“మేము అపకీర్తి పాలయ్యాము, ఎందుకంటే మేము అవమానించబడ్డాము సిగ్గు మా ముఖాలను కప్పివేస్తుంది, ఎందుకంటే యెహోవా మందిరంలోని పవిత్ర స్థలాల్లోకి విదేశీయులు ప్రవేశించారు.”


వారు గోనెపట్ట కట్టుకుంటారు భయం వారిని ఆవరిస్తుంది. ప్రతి ఒక్కరు సిగ్గుతో తలవంచుకుంటారు, ప్రతి తల క్షౌరం చేయబడుతుంది.


ఇప్పటికైనా మీరు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు విన్నప్పుడు నేను నిలబెట్టిన విగ్రహం ఎదుట సాగిలపడి పూజిస్తే మంచిది. ఒకవేళ మీరు దానిని పూజించకపోతే, మీరు మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. అప్పుడు ఏ దేవుడు మిమ్మల్ని నా చేతి నుండి రక్షిస్తాడు?” అన్నాడు.


యెహోవా ఎదుట సేవచేసే యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడ్వాలి. వారు, “యెహోవా! మీ ప్రజలను కనికరించండి. మీ స్వాస్థ్యమైన వారిని అవమాన పడనివ్వకండి వారు దేశాల మధ్య హేళన చేయబడకూడదు. ‘వీరి దేవుడు ఎక్కడ?’ అని ప్రజలు ఎందుకు అనుకోవాలి?”


నీ సోదరుడైన యాకోబు మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి, నీకు అవమానం కలుగుతుంది; నీవు ఎప్పటికీ లేకుండా నాశనమవుతావు.


నీ సోదరునికి దురవస్థ కలిగిన రోజు, నీవు సంతోషించకూడదు, యూదా ప్రజల నాశన దినాన వారిని చూసి ఆనందించకూడదు, వారి శ్రమ దినాన, నీవు గొప్పలు చెప్పుకోవద్దు.


ఇప్పుడు అనేక దేశాలు మీకు విరుద్ధంగా కూడుకుని, “సీయోను అపవిత్రం కావాలి, దాని నాశనం మేము కళ్లారా చూడాలి!” అంటున్నారు.


నా విరోధీ, నా మీద అతిశయించకు, నేను పడిపోయినా తిరిగి లేస్తాను. నేను చీకటిలో కూర్చున్నా, యెహోవా నాకు వెలుగై ఉంటారు.


యెహోవా నీ శిక్షను తొలగించారు, నీ శత్రువును తిప్పికొట్టారు. ఇశ్రాయేలు రాజైన యెహోవా నీకు తోడుగా ఉన్నారు; ఇంకెప్పుడు ఏ హానికి నీవు భయపడవు.


వారందరు కలిసి యుద్ధంలోని వీరుల్లా వీధుల బురదలో తమ శత్రువులను త్రొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారు పోరాడతారు, శత్రువుల గుర్రపురౌతులను సిగ్గుపడేలా చేస్తారు.


మీరు అది కళ్లారా చూసి, ‘ఇశ్రాయేలు సరిహద్దు అవతల కూడా యెహోవా గొప్పవాడు!’ అని అంటారు.


నేను నియమించే ఆ రోజున దుర్మార్గులు మీ కాళ్లక్రింద ధూళిలా ఉంటారు, మీరు వారిని త్రొక్కివేస్తారు” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.


వీడు దేవుని నమ్మాడు. ‘నేను దేవుని కుమారుడనని’ చెప్పుకొన్నాడు కదా, దేవునికి ఇష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అన్నారు.


కనాను ప్రజలు, ఈ దేశంలో ఉన్న ఇతర ప్రజలు ఈ సంగతిని విని మమ్మల్ని చుట్టుముట్టి భూమి మీద మా పేరును తుడిచివేస్తారు. అప్పుడు మీ గొప్ప పేరుకు ఉన్న ఘనత కోసం ఏమి చేస్తావు?” అని ప్రార్థించాడు.


“పరలోకమా ఆమెను బట్టి ఆనందించండి. దేవుని ప్రజలారా, ఆనందించండి. అపొస్తలులారా, ప్రవక్తలారా ఆనందించండి. ఎందుకంటే, ఆమె మీకు విధించిన తీర్పును బట్టి దేవుడు ఆమెకు తీర్పు తీర్చారు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ