Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మీకా 6:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 మీరు నాటుతారు కాని పంట కోయరు; మీరు ఒలీవపండ్లను త్రొక్కుతారు కాని ఆ నూనెను వాడరు; ద్రాక్షలను త్రొక్కుతారు కాని ద్రాక్షరసం త్రాగరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 నీవు విత్తనము విత్తుదువుగాని కొయ్యక యుందువు, ఒలీవపండ్లను ద్రాక్షపండ్లను త్రొక్కుదువుగాని తైలము పూసికొనకయు ద్రాక్షారసము పానముచేయకయు ఉందువు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 నువ్వు విత్తనాలు చల్లుతావు గానీ కోత కోయవు. నువ్వు ఒలీవ పళ్ళను తొక్కుతావు కానీ ఆ నూనె పూసుకోవు. ద్రాక్షపళ్ళను తొక్కుతావు కానీ ద్రాక్షారసం తాగవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 నీవు విత్తనాలు చల్లుతావు; కానీ నీవు పంట కోయలేవు. ఒలీవ గింజలను గానుగ పడతావు; కానీ నీకు నూనె రాదు. నీ తియ్యటి ద్రాక్షారసం తాగటానికి నీవు అనుమతింపబడవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 మీరు నాటుతారు కాని పంట కోయరు; మీరు ఒలీవపండ్లను త్రొక్కుతారు కాని ఆ నూనెను వాడరు; ద్రాక్షలను త్రొక్కుతారు కాని ద్రాక్షరసం త్రాగరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మీకా 6:15
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు నేను విత్తిన దానిని ఇతరులు తిందురు గాక, నా పంటలు పెరికివేయబడును గాక.


వారు గోధుమలు విత్తుతారు కాని ముళ్ళ పంట కోస్తారు; వారు పనితో అలసిపోతారు కాని లాభం ఉండదు. యెహోవా కోపం కారణంగా కోయడానికి పంట లేక మీరు సిగ్గుపడతారు.”


అప్పుడు నేను మీకు ఇలా చేస్తాను: మీ దృష్టిని నాశనం చేసే, మీ బలాన్ని తగ్గించే ఆకస్మిక భీభత్సం, చెడు వ్యాధులు జ్వరాలు తెస్తాను. మీరు వృధాగా విత్తనాన్ని చల్లుతారు, ఎందుకంటే మీ శత్రువులు దానిని తింటారు.


మీ బలము వ్యర్థమైపోతుంది ఎందుకంటే మీ నేల తన పంటలను ఇవ్వదు, పండదు. మీ భూమిలో ఉన్న చెట్లు ఫలం ఇవ్వవు.


మీరు బీదలను అణగద్రొక్కుతూ, వారి ధాన్యం మీద పన్ను వేస్తారు. కాబట్టి మీరు రాళ్లతో భవనాలను కట్టుకున్నా, వాటిలో కాపురముండరు; అందమైన ద్రాక్షతోటలు నాటినా మీరు ఆ పండ్ల రసం త్రాగరు.


అంజూరపు చెట్టు పూత పూయకపోయినా ద్రాక్షచెట్టుకు పండ్లు లేకపోయినా, ఒలీవచెట్లు కాపు కాయకపోయినా పొలాలు పంట ఇవ్వకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా,


వారి ధనం దోపిడి అవుతుంది, వారి ఇల్లు పాడవుతాయి. వారు ఇళ్ళు కట్టుకున్నా వాటిలో నివసించలేరు; వారు ద్రాక్షతోటలు నాటినా వాటి ద్రాక్షరసం త్రాగలేరు.”


మీరు విస్తారంగా విత్తినా కానీ పండింది కొంచెమే. మీరు భోజనం చేస్తున్నా ఆకలి తీరడం లేదు. మీరు త్రాగుతున్నారు కానీ మత్తు ఎక్కడం లేదు. బట్టలు కప్పుకున్నా వెచ్చగా లేదు. మీరు జీతం సంపాదిస్తున్నా అది చిల్లు సంచిలో వేసినట్లే ఉంటుంది.”


ఈ విషయంలో ‘విత్తువాడు ఒకడు, కోసేవాడు మరొకడు’ అనే సామెత నిజమే.


వారికి ఎదురుగా గుడారాలు వేసుకుని గాజా వరకు పంటను పాడుచేసి ఇశ్రాయేలీయులకు ఒక గొర్రెను గాని, పశువును గాని, గాడిదను గాని మరి ఏ జీవిని విడిచిపెట్టలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ