Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మీకా 3:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, మీరు ఇది వినండి. మీరు న్యాయాన్ని తృణీకరించి, సరియైన దానినంతటిని వంకర చేస్తారు;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 యాకోబు వంశపు ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఈ మాట వినండి. మీరు న్యాయాన్ని తృణీకరిస్తూ సక్రమంగా ఉండే సమస్తాన్నీ వక్రం చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 యాకోబు ప్రజల నాయకులారా, ఇశ్రాయేలు అధిపతులారా, నేను చెప్పేది వినండి! మీరు న్యాయాన్ని ద్వేషిస్తారు. మీరు తిన్నగా ఉన్నదానిని వంకర చేస్తారు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, మీరు ఇది వినండి. మీరు న్యాయాన్ని తృణీకరించి, సరియైన దానినంతటిని వంకర చేస్తారు;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మీకా 3:9
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకు నేను యూదా సంస్థానాధిపతులను మందలించి, “సబ్బాతు దినాన్ని అపవిత్రం చేస్తూ మీరు చేస్తున్న ఈ చెడ్డ పని ఏమిటి?


“వెళ్లు, ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి వారితో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: నేను మిమ్మల్ని చూశాను; ఈజిప్టులో మీకు జరిగిన దానిని చూశాను.


దోషులను వదిలి వేయడం అమాయకులను ఖండించడం, రెండు యెహోవాకు అసహ్యమే.


న్యాయం తప్పుదారి పట్టించడానికి దుష్టులు రహస్యంగా లంచాలు స్వీకరిస్తారు.


తీర్పుతీర్చుటలో దుష్టుని ఎడల పక్షపాతము చూపుటయు, అమాయకులకు న్యాయం తప్పించుటయు సరికాదు.


దుష్టుల దౌర్జన్యం వారిని లేకుండ తుడిచివేస్తుంది, ఎందుకంటే వారు సరియైనది చేయడానికి తిరస్కరిస్తారు.


నీ పాలకులు తిరుగుబాటుదారులు, దొంగలతో సహవాసం చేస్తారు. వారందరికి లంచాలు ఇష్టం కానుకల వెంటపడతారు. తండ్రిలేనివారి పక్షంగా న్యాయం తీర్చరు. విధవరాలి సమస్యను పరిష్కరించరు.


వారు లావుగా నిగనిగలాడుతూ ఉన్నారు. వారి దుర్మార్గాలకు హద్దు లేదు; వారు న్యాయం కోరరు. వారు తండ్రిలేనివారి వాదనను వాదించరు; వారు పేదల న్యాయమైన కారణాన్ని సమర్థించరు.


అంతేగాక వారు నా ప్రజలకు పవిత్రమైన వాటికి సాధారణమైన వాటి మధ్య భేదాన్ని బోధిస్తారు; పవిత్రమైన దానికి, అపవిత్రమైన దానికి మధ్య తేడా ఏమిటో వారికి చూపిస్తారు.


“యాజకులారా! ఇది వినండి, ఇశ్రాయేలీయులారా! శ్రద్ధగా వినండి, రాజ వంశస్థులారా! వినండి, ఈ తీర్పు మీ కొరకే ఇవ్వబడింది: మీరు మిస్పాలో ఉరిగా, తాబోరు మీద వలలా ఉన్నారు.


మీరు నా శాసనాలను తిరస్కరించి, నా చట్టాలను అసహ్యించుకుని నా ఆజ్ఞలన్నిటిని పాటించడంలో విఫలమై, నా నిబంధనను ఉల్లంఘిస్తే,


వారు న్యాయాన్ని చేదుగా మార్చి నీతిని నేల మీద పడవేస్తారు.


యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల పరిపాలన కాలాల్లో మోరెషెతు వాడైన మీకా దగ్గరకు వచ్చిన యెహోవా వాక్కు. సమరయ, యెరూషలేముల గురించి అతడు చూసిన దర్శనం.


అప్పుడు నేను ఇలా అన్నాను, “యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, వినండి. న్యాయాన్ని మీరు తెలుసుకోవద్దా?


“విదేశీయుల పట్ల, తండ్రిలేనివారి పట్ల, విధవరాండ్ర పట్ల న్యాయం తప్పి తీర్పు తీర్చేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ