Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మీకా 2:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 ఇటీవల నా ప్రజలే శత్రువుగా లేచారు. యుద్ధం నుండి తిరిగి వచ్చే మనుష్యుల్లా, నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి నుండి సంపన్న వస్త్రాన్ని మీరు లాగివేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ఇప్పుడేగదా నా జనులు శత్రువులైరి; నిర్భయముగా సంచరించువారిని చూచి వారు కట్టుపంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకొందురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఇటీవలే నా ప్రజలు శత్రువులయ్యారు. యుద్ధరంగం నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నాం అని సైనికులు అనుకున్నట్టుగా, నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి పై బట్టలను, అంగీని మీరు లాగివేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 కాని, ఇటీవల నా ప్రజలే నా శత్రువులయ్యారు. దారిన పోయే వారివద్దనుండి మీరు బట్టలు దొంగిలిస్తారు. ఆ జనులు మాత్రం సురక్షితంగా ఉన్నామనుకున్నారు. కాని వారు యుద్ధ ఖైదీలు అన్నట్లు, వారి వస్తువులు మీరు తీసుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 ఇటీవల నా ప్రజలే శత్రువుగా లేచారు. యుద్ధం నుండి తిరిగి వచ్చే మనుష్యుల్లా, నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి నుండి సంపన్న వస్త్రాన్ని మీరు లాగివేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మీకా 2:8
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

మేము ఇశ్రాయేలులో నెమ్మదస్తులం నమ్మకమైనవారము. మీరు ఇశ్రాయేలు పట్టణాల్లో ప్రధానమైన పట్టణాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. యెహోవా వారసత్వాన్ని మీరెందుకు నిర్మూలం చేస్తారు?” అని నిలదీసింది.


నా సహచరుడు తన స్నేహితుల మీద దాడి చేసి; వారితో తాను చేసిన నిబంధనకు తానే భంగం కలిగిస్తాడు.


మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిం మనష్షేను తింటారు. వీరిద్దరు కలిసి యూదా మీద పడతారు. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.


నా వారసత్వం నాకు అడవిలోని సింహంలా మారింది. అది నా మీదికి గర్జిస్తుంది; కాబట్టి నేను దానిని ద్వేషిస్తున్నాను.


మీరు మంచిని అసహ్యించుకుని చెడును ప్రేమిస్తారు; నా ప్రజల చర్మం ఒలిచి, వారి ఎముకల మీద మాంసాన్ని చీలుస్తారు;


నా ప్రజల మాంసాన్ని తింటారు, వారి చర్మం ఒలిచి, వారి ఎముకలను ముక్కలుగా విరగ్గొడతారు; పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు, కుండలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు చేస్తారు.”


నమ్మకమైనవారు దేశంలో లేకుండా పోయారు; యథార్థవంతుడు ఒక్కడూ లేడు. అందరు రక్తం చిందించడానికి పొంచి ఉన్నారు; వారు ఒకరిని ఒకరు వలలతో వేటాడతారు.


వారి రెండు చేతులు కీడు చేస్తాయి; పాలకులు బహుమతులు కోరతారు, న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటారు, గొప్పవారు తమ కోరికను తెలియజేస్తారు. వారంతా కలిసి కుట్ర చేస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ