Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మీకా 2:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 “యాకోబూ, నేను ఖచ్చితంగా మీ అందరిని సమకూరుస్తాను; నేను ఖచ్చితంగా మిగిలిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తాను. నేను వారిని గొర్రెల దొడ్డిలోని గొర్రెల్లా, పచ్చిక బయళ్లలోని మందలా సమకూరుస్తాను, ఈ స్థలం మనుష్యులతో కిటకిటలాడుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 యాకోబు సంతతీ, తప్పక నేను మిమ్మునందరిని పోగు చేయుదును, ఇశ్రాయేలీయులలో శేషించినవారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొఱ్ఱెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేతస్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 యాకోబూ, నేను మిమ్మల్నందరినీ తప్పకుండా పోగు చేస్తాను. ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారిని తప్పక సమకూర్చుతాను. గొర్రెల దొడ్డిలోకి గొర్రెలు చేరుకున్నట్టు నేను వారిని చేరుస్తాను. తమ మేత స్థలాల్లో వారిని చేరుస్తాను. చాలామంది ఉండడం వలన పెద్ద శబ్దం అక్కడ వస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 అవును, యాకోబు వంశీయులారా, నేను మీ అందరినీ ఒక్కచోటికి తీసుకువస్తాను. ఇశ్రాయేలు ప్రజలలో మిగిలిన వారందరినీ సమకూర్చుతాను. దొడ్డిలోని గొర్రెల్లా, పచ్చిక బీడులోని మందల్లా, వారిని నేను సమకూర్చుతాను. అప్పుడు ఆ స్థలమంతా అనేకమందిచేసే ధ్వనులతో నిండిపోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 “యాకోబూ, నేను ఖచ్చితంగా మీ అందరిని సమకూరుస్తాను; నేను ఖచ్చితంగా మిగిలిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తాను. నేను వారిని గొర్రెల దొడ్డిలోని గొర్రెల్లా, పచ్చిక బయళ్లలోని మందలా సమకూరుస్తాను, ఈ స్థలం మనుష్యులతో కిటకిటలాడుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మీకా 2:12
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు, బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు.


బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు.


ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు, ఏలాము, బబులోను, హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు.


ఆ రోజున యెహోవా పారుతున్న యూఫ్రటీసు నది నుండి ఈజిప్టు వాగువరకు నూర్చుతారు. ఓ ఇశ్రాయేలూ! నీవు ఒక్కొక్కరిగా సమకూర్చబడతావు.


యెహోవా ఖడ్గం రక్తసిక్తం అవుతుంది, అది క్రొవ్వుతో కప్పబడి ఉంది. గొర్రెపిల్లల, మేకల రక్తంతో, పొట్టేళ్ల మూత్రపిండాల మీది క్రొవ్వుతో కప్పబడి ఉంది. ఎందుకంటే బొస్రాలో యెహోవా బలి జరిగిస్తారు. ఎదోము దేశంలో ఆయన గొప్ప వధ జరిగిస్తారు.


అప్పుడు గొర్రెపిల్లలు తమ పచ్చికబయళ్లలో ఉన్నట్లుగా అక్కడ మేస్తాయి; ధనవంతుల బీడు భూములలో గొర్రెపిల్లలు మేస్తాయి.


“నేను వాటిని తరిమికొట్టిన దేశాలన్నిటిలో నుండి నా మందలో మిగిలిన వాటిని నేనే పోగుచేసి, వాటి పచ్చిక బయళ్లకు తిరిగి వాటిని తీసుకువస్తాను, అక్కడ అవి ఫలించి వృద్ధిచెందుతాయి.


ఆ రోజుల్లో యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉంటారు, వారు కలిసి ఉత్తర దేశం నుండి నేను మీ పూర్వికులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి వస్తారు.


“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేనే స్వయంగా నా గొర్రెలను వెదికి వాటిని చూసుకుంటాను.


నేను వాటిని ఇతర జాతుల నుండి బయటకు రప్పించి, దేశాల నుండి వాటిని సమకూర్చి, నేను వాటిని వారి స్వదేశానికి తీసుకువస్తాను. నేను వాటిని ఇశ్రాయేలు పర్వతాలమీద, కనుమలలో, దేశంలోని అన్ని నివాస స్థలాల్లో మేపుతాను.


నేను నా గొర్రెలను కాపాడతాను, ఇకపై అవి దోచుకోబడవు. గొర్రెకు మధ్య నేను తీర్పు తీరుస్తాను.


మీరు నా గొర్రెలు, నా పచ్చిక బయళ్లలోని గొర్రెలు, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


“ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తమ కోసం ఇలా చేయమని ఇశ్రాయేలు ప్రజలు నన్ను వేడుకునేలా చేస్తాను. గొర్రెలు విస్తరించినట్లు నేను వారు విస్తరించేలా చేస్తాను.


వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలీయులు చెదరిపోయిన దేశాల నుండి నేను వారిని బయటకి తీసుకువస్తాను. వారిని చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి సమకూర్చి వారి స్వదేశానికి తిరిగి రప్పిస్తాను.


యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏకమవుతారు; వారు ఒక నాయకున్ని నియమించుకుంటారు, వారు ఈ దేశంలో ఎదుగుతారు, ఎందుకంటే యెజ్రెయేలు దినం గొప్పగా ఉండబోతుంది.


నేను తేమాను మీదికి అగ్నిని పంపుతాను, అది బొస్రాలోని కోటలను దగ్ధం చేస్తుంది.”


అడ్డును పడగొట్టేవాడు వారికి ముందుగా వెళ్తాడు; వారు గుమ్మాన్ని పడగొట్టి, దానిగుండా బయటకు వెళ్తారు. వారి రాజు వారికి ముందుగా వెళ్తాడు, యెహోవా వారికి నాయకునిగా ఉంటారు.”


మందకు కావలికోటగా, సీయోను కుమార్తె దుర్గంగా ఉన్న నీకైతే, మునుపటి అధికారం తిరిగి ఇవ్వబడుతుంది; యెరూషలేము కుమార్తెకు రాజ్యాధికారం వస్తుంది.”


యాకోబు సంతానంలో మిగిలినవారు, అనేక జనాల మధ్యలో, యెహోవా కురిపించే మంచులా, ఎవరి కోసం ఎదురుచూడకుండ ఏ మనిషి మీద ఆధారపడకుండా గడ్డి మీద కురిసే వానజల్లులా ఉంటారు.


యాకోబు సంతానంలో మిగిలినవారు దేశాల మధ్య, అనేక జనాల మధ్య, అడవి మృగాలలో సింహంలా, గొర్రెల మందలలో దూరి, ఎవ్వరూ విడిపించలేనంతగా వాటిని త్రొక్కి చీల్చే కొదమసింహంలా ఉంటారు.


మీ చేతికర్రతో మీ ప్రజలను కాయండి, వారు మీ వారసత్వపు మంద, వారు అడవిలో ఒంటరిగా, సారవంతమైన పచ్చికబయళ్లలో నివసిస్తున్నారు. పూర్వకాలంలో మేసినట్లు వారిని బాషాను, గిలాదులో మేస్తారు.


మీలాంటి దేవుడెవరు? మీరు మీ వారసత్వమైన వారిలో మిగిలిన వారి పాపాలను మన్నించి, అతిక్రమాలను క్షమిస్తారు, మీరు నిత్యం కోపంతో ఉండరు కాని దయ చూపడంలో ఆనందిస్తారు.


ఆ సమయంలో నేను మిమ్మల్ని సమకూర్చుతాను; ఆ సమయంలో నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువస్తాను. నేను మిమ్మల్ని చెరలో నుండి తిరిగి తీసుకువచ్చినప్పుడు భూమ్మీద ఉన్న ప్రజలందరిలో నేను మీకు కీర్తిని, ఘనతను ఇస్తాను” అని యెహోవా అంటున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ