Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మత్తయి 6:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 “భూమి మీద మీ కోసం ధనం కూడపెట్టుకోకండి. ఇక్కడ చెదలు తుప్పు తినివేస్తాయి, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 “భూమి మీద మీకోసం సంపద కూడబెట్టుకోవద్దు. ఇక్కడ చెదలూ తుప్పూ తినివేస్తాయి. దొంగలు పడి దోచుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 “మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. ఇక్కడ ఆ ధనానికి చెదలు పడుతుంది. తుప్పు ఆ ధనాన్ని తినివేస్తుంది. దొంగలు పడి దోచుకొంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 “భూమి మీద మీ కోసం ధనం కూడపెట్టుకోకండి. ఇక్కడ చెదలు తుప్పు తినివేస్తాయి, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

19 “భూమి మీద మీ కొరకు ధనాన్ని కూడపెట్టుకోకండి. ఇక్కడ దానికి చెదలు పట్టి, తుప్పు పట్టి నాశనం అవుతుంది, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మత్తయి 6:19
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

దొంగలు రాత్రివేళ ఇళ్ళకు కన్నం వేస్తారు, పగటివేళ లోపల దాక్కుంటారు; వారికి వెలుగుతో సంబంధం లేదు.


“నేను బంగారంపై నా నమ్మకాన్ని ఉంచినా, ‘నీవే నా భద్రత’ అని మేలిమి బంగారంతో చెప్పినా,


“నిశ్చయంగా మనుష్యులు కేవలం నీడలా తిరుగుతున్నారు; వారి ధనం ఎవరికి దక్కుతుందో తెలియకుండానే వారు వ్యర్థంగా ధనం సమకూర్చుకుంటారు.


బలాత్కారాన్ని నమ్ముకోకండి దోపిడీలు చేసి ధనవంతులై విర్రవీగకండి. ధనం ఎక్కువైనా సరే, దాని మీద మనస్సు పెట్టకండి.


“రాత్రివేళ దొంగ ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి ఒకవేళ దొరికిపోయి చావుదెబ్బలు తింటే కొట్టినవాడు రక్తం కారిన దాన్ని బట్టి అపరాధి కాడు.


ఉగ్రత దినాన సంపద విలువలేనిది, అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది.


బంగారం కంటే జ్ఞానాన్ని సంపాదించడం, వెండి కంటే తెలివిని సంపాదించడం ఎంత మేలు!


తనను సంతోషపెట్టే వారికి దేవుడు జ్ఞానం, తెలివి, సంతోషాన్ని ఇస్తారు, కాని దేవున్ని సంతోషపెట్టే వారికి కోసం సంపదను పోగుచేసే పని ఆయన పాపికి ఇస్తారు. ఇది కూడా అర్థరహితమే, గాలికి ప్రయాసపడడమే.


యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేవు.” ఆయన రోషాగ్ని చేత లోకమంతా దగ్దమవుతుంది, ఆయన హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నారు.


అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి అంటే వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి నన్ను వెంబడించు” అని చెప్పారు.


అయితే మీ కోసం పరలోకంలో ధనం కూడపెట్టుకోండి. అక్కడ చెదలు తుప్పు తినివేయవు, దొంగలు కన్నం వేసి దొంగిలించలేరు.


“దేవునిలో ధనవంతుడు కాకుండా తమ కోసం సమకూర్చుకొనేవారి స్థితి ఇలా ఉంటుంది” అని చెప్పారు.


మీ ఆస్తులను అమ్మి బీదలకు ఇవ్వండి. మీ కోసం పాతగిల్లని డబ్బు సంచులను ఏర్పరచుకోండి, పరలోకంలో ధనం ఎప్పటికీ తరిగిపోదు, అక్కడ ఏ దొంగ సమీపించలేడు, ఏ చిమ్మెట కొట్టివేయలేదు.


అయితే ఈ విషయం అర్థం చేసుకోండి: దొంగ ఏ సమయంలో వస్తాడో ఒకవేళ ఇంటి యజమానికి తెలిస్తే, అతడు తన ఇంటికి కన్నం వేయకుండా జాగ్రత్తపడతాడు.


యేసు అతడు చెప్పింది విని వానితో, “అయినా నీలో ఒక కొరత ఉంది. నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు, అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి, నన్ను వెంబడించు” అని చెప్పారు.


యేసు అతన్ని చూసి అతనితో, “ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు.


ఈ లోకంలో ధనవంతులైన వారిని గర్వంతో ఉండవద్దని, స్థిరంగా ఉండని సంపదలపై తమ నమ్మకాన్ని ఉంచక, వారి సంతోషం కోసం కావలసిన వాటన్నిటిని సమృద్ధిగా ఇచ్చే దేవునిలోనే నిరీక్షణ ఉంచమని ఆజ్ఞాపించు.


మీ జీవితాలను ధన వ్యామోహానికి దూరంగా ఉంచండి, మీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందండి, ఎందుకంటే దేవుడు ఇలా అన్నాడు, “నేను నిన్ను ఎన్నడు విడిచిపెట్టను; నిన్ను ఎన్నడు త్రోసివేయను.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ