Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మలాకీ 1:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 ఏశావును ద్వేషించాను; నేను అతని కొండలను పాడు చేశాను. అతడు వారసత్వంగా పొందిన ప్రదేశాన్ని అడవి నక్కల పాలు చేశాను” అని యెహోవా అంటున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఏశావును ద్వేషించాను. అతని నివాస స్థలాలను పాడుచేసి అతని ఆస్తిని ఎడారిలో ఉన్న నక్కలపాలు చేశాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 మరియు ఏశావును నేను అంగీకరించలేదు. ఏశావుయొక్క కొండ దేశాన్ని నేను నాశనం చేశాను. ఏశావు దేశం నాశనం చేయబడింది. ఇప్పుడు అక్కడ అడవి కుక్కలు మాత్రమే నివసిస్తాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 ఏశావును ద్వేషించాను; నేను అతని కొండలను పాడు చేశాను. అతడు వారసత్వంగా పొందిన ప్రదేశాన్ని అడవి నక్కల పాలు చేశాను” అని యెహోవా అంటున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మలాకీ 1:3
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా ఆమెతో ఇలా చెప్పారు, “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి, ఈ రెండు జనాంగాలు నీ గర్భం నుండే వేరుగా ఉంటాయి; ఒక జనం మరొక జనం కంటే బలంగా ఉంటారు. పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు.”


మండుతున్న ఇసుక చెరువులా మారుతుంది ఎండిన నేలలో నీటిబుగ్గలు పుడతాయి. ఒక్కప్పుడు తోడేళ్లు పడుకున్న స్థలంలో గడ్డి, రెల్లు, జమ్ము పెరుగుతాయి.


అయితే నేను ఏశావును నగ్నంగా చేస్తాను; అతడు దాక్కునే స్థలాలను బయటపెడతాను, అప్పుడతడు ఎక్కడా దాక్కోలేడు. అతని సాయుధ పురుషులు నాశనానికి గురవుతారు, అతని సోదరులు పొరుగువారు కూడా నాశనమవుతారు. కాబట్టి,


కాబట్టి ఎదోమును వ్యతిరేకంగా యెహోవా ఏమి ప్రణాళిక వేశారో వినండి, తేమానులో నివసించేవారికి ఆయన ఏమి ఉద్దేశించారో వినండి: మందలోని చిన్న పిల్లలు బయటకు ఈడ్చివేయబడతాయి; వారు చేసిన దానికి వారి పచ్చికబయళ్లు పాడుచేయబడతాయి.


“హాసోరు నక్కలకు నిలయంగా, ఎప్పటికీ నిర్జన ప్రదేశంగా మారుతుంది. అక్కడ ఎవరూ నివసించరు; దానిలో ఏ ప్రజలు నివసించరు.”


ఎదోము గురించి: సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “తేమానులో ఇక జ్ఞానం లేదా? వివేకవంతులు సలహా ఇవ్వడం మానివేశారా? వారి జ్ఞానం తగ్గిపోయిందా?


దేదానులో నివసించేవారలారా, వెనక్కి తిరిగి పారిపోయి లోతైన గుహల్లో దాక్కోండి, నేను ఏశావు మీదికి విపత్తు రప్పించి వారిని శిక్షిస్తాను.


బబులోను శిథిలాల కుప్పగా, నక్కల నివాసంగా, భయానకంగా, హేళనగా, ఎవరూ నివసించని స్థలంగా అవుతుంది.


“నేను యెరూషలేమును శిథిలాల కుప్పగా, నక్కల విహారంగా చేస్తాను. నేను యూదా పట్టణాలను నాశనం చేస్తాను, అక్కడ ఎవరూ నివసించలేరు.”


సీయోను కుమారీ, నీ శిక్ష పూర్తి కాబోతుంది; ఆయన మీ చెరను పొడిగించరు. కానీ ఎదోము కుమారీ, ఆయన నీ పాపాన్ని శిక్షిస్తారు, నీ దుర్మార్గాన్ని బట్టబయలు చేస్తారు.


కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీ చుట్టూ ఉన్న దేశాలు కూడా అవమానం పాలవుతాయని నా చేయి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను.


నేను మీ పక్షంగా ఉండి మీమీద దయ చూపిస్తాను; మీరు దున్నబడి, విత్తబడతారు.


అయితే ఈజిప్టు పాడైపోతుంది, ఎదోము పాడైపోయిన ఎడారిగా అవుతుంది. ఎందుకంటే ఈ దేశాలు యూదా ప్రజలపై దౌర్జన్యం చేశాయి, వారి దేశంలో నిర్దోషుల రక్తం చిందించారు.


నీ సోదరుడైన యాకోబు మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి, నీకు అవమానం కలుగుతుంది; నీవు ఎప్పటికీ లేకుండా నాశనమవుతావు.


“ఎవరైనా, నా శిష్యునిగా ఉండాలనుకుంటే తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, సహోదర సహోదరీలను, చివరికి తన ప్రాణాన్ని సైతం, వదులుకోడానికి సిద్ధంగా లేకపోతే, నా శిష్యులు కాలేరు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ