Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లూకా సువార్త 6:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 అయితే యేసు వారి ఆలోచనలను తెలిసినవాడై చేతికి పక్షవాతం గలవానితో, “లేచి అందరి ముందు నిలబడు” అన్నారు. అందుకతడు లేచి నిలబడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 అయితే ఆయన వారి ఆలోచన లెరిగి, ఊచచెయ్యిగలవానితో– నీవు లేచిమధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలిచెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 వారి ఆలోచనలు ఆయన తెలుసుకుని, చచ్చుబడిన చెయ్యి గలవాడితో, “నువ్వు లేచి అందరి మధ్యలోకి వచ్చి నిలబడు” అన్నాడు. వాడు లేచి నిలబడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 యేసుకు వాళ్ళేమాలోచిస్తున్నారో తెలుసు. ఆయన ఆ చేయి పడిపోయిన వానితో, “లేచి అందరి ముందు నిలుచో!” అని అన్నాడు. ఆ చేయి పడిపోయిన వాడు లేచి నిలుచున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 అయితే యేసు వారి ఆలోచనలను తెలిసినవాడై చేతికి పక్షవాతం గలవానితో, “లేచి అందరి ముందు నిలబడు” అన్నారు. అందుకతడు లేచి నిలబడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

8 అయితే యేసు వారి ఆలోచనలను తెలిసినవాడై చేతికి పక్షవాతం గలవానితో, “లేచి అందరి ముందు నిలబడు” అన్నారు. అందుకతడు లేచి నిలబడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లూకా సువార్త 6:8
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

“సొలొమోనూ, నా కుమారుడా! నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తారు, ఆలోచనల ఉద్దేశాలన్నిటిని గ్రహిస్తారు కాబట్టి నీవు ఆయనను తెలుసుకుని పూర్ణహృదయంతో చిత్తశుద్ధితో ఆయనను సేవించు. నీవు ఆయనను వెదికితే, ఆయన నీకు దొరుకుతారు; అయితే నీవు ఆయనను విడిచిపెడితే, ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తారు.


నా దేవా! మీరు హృదయాన్ని పరిశోధిస్తారని, నిజాయితీ అంటే మీకు ఇష్టమని నాకు తెలుసు. నేను ఇవన్నీ ఇష్టపూర్వకంగా నిజాయితితో ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ ప్రజలు కూడా మీకు ఇష్టపూర్వకంగా ఇవ్వడం చూసి నేను సంతోషిస్తున్నాను.


“నీవు సమస్తం చేయగలవని నాకు తెలుసు; నీ ఉద్దేశాలలో ఏది నిష్ఫలం కాదు.


హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఆ విషయాన్ని తెలుసుకోకుండ ఉంటారా?


భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకు అతడు అలసిపోడు నిరుత్సాహపడడు. అతని బోధలో ద్వీపాలు నిరీక్షణ కలిగి ఉంటాయి.”


యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో, “మీ హృదయాల్లో ఈ దురాలోచనలు ఎందుకు రానిస్తున్నారు?


చేతికి పక్షవాతం గలవానితో యేసు, “అందరి ముందు నిలబడు” అన్నారు.


యేసు ఆమెను చూసి, ముందుకు రమ్మని పిలిచి, “అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావు” అని చెప్పారు.


యేసు వారి ఆలోచనలను గ్రహించి, “మీ హృదయాల్లో మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు?


అప్పుడు యేసు, “నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, సబ్బాతు దినాన ఏది న్యాయం: మంచి చేయడమా లేదా చెడు చేయడమా, ప్రాణం రక్షించడమా లేదా ప్రాణం తీయడమా?” అని వారిని అడిగారు.


ప్రతి ఒక్కరి అంతరంగం ఏమిటో ఆయనకు తెలుసు, కాబట్టి మానవుల గురించి ఎవరూ ఆయనకు సాక్ష్యమిచ్చే అవసరం లేదు.


యేసు మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగారు. యేసు తనను మూడవసారి, “నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగినందుకు బాధపడిన పేతురు, “ప్రభువా, నీవు అన్ని తెలిసినవాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అని చెప్పాడు. అందుకు యేసు, “నా గొర్రెలను మేపుము”


పగలున్నంత వరకు నన్ను పంపినవాని పనులను మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది అప్పుడు ఎవరూ పని చేయలేరు.


అయినా కాని, నా జీవితం నాకు విలువైనది కాదని నేను భావిస్తున్నాను; ప్రభువైన యేసు నా ముందు ఉంచిన పరుగు పందెమును పూర్తి చేసి, దేవుని కృపను గురించిన సువార్తను ప్రకటించాలని ఆయన నాకు ఇచ్చిన పనిని పూర్తి చేయడమే నా ఏకైక లక్ష్యంగా ఉంది.


ఈ సంగతులు రాజుకు తెలిసినవే కాబట్టి నేను ఆయనతో ధైర్యంగా చెప్పుకోగలను. అయినా ఈ సంగతులు ఒక మూలలో జరిగినవి కావు, కాబట్టి వీటిలో ఏది ఆయన దృష్టిలో నుండి తప్పిపోదని నేను నమ్ముతున్నాను.


సృష్టి అంతటిలో దేవుని దృష్టి నుండి దాచబడింది ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించాల్సి ఉందో ఆయన కళ్లెదుట ప్రతిదీ తెరవబడి స్పష్టంగా ఉంది.


క్రీస్తు తన శరీరంలో శ్రమపడ్డారు, కాబట్టి మీరు అలాంటి మనసును ఆయుధంగా ధరించుకోండి. ఎందుకంటే శరీరంలో శ్రమపడే వారు పాప జీవితాన్ని విడిచిపెడతారు.


ఆమె పిల్లలను నేను మరణానికి అప్పగిస్తాను. అప్పుడు సంఘాలన్ని నేను అంతరంగాలను, హృదయాలను పరిశోధిస్తానని, మీలో అందరికి మీ క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తానని తెలుసుకుంటాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ