Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లూకా సువార్త 18:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 ఆ పట్టణంలో ఒక విధవరాలు అతని దగ్గరకు తరచుగా వస్తూ, ‘నా విరోధి విషయంలో నాకు న్యాయం తీర్చండి’ అని అడుగుతూ ఉండేది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చి–నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని దగ్గరికి తరచుగా వచ్చి ‘నా ప్రతివాదితో వివాదం విషయంలో నాకు న్యాయం చెయ్యి’ అని అడుగుతూ ఉండేది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 అదే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరకు ప్రతిరోజు వచ్చి ‘నాకు ఒకడు అన్యాయం చేశాడు. నాకు న్యాయం చేకూర్చండి’ అని అడుగుతూ ఉండేది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 ఆ పట్టణంలో ఒక విధవరాలు అతని దగ్గరకు తరచుగా వస్తూ, ‘నా విరోధి విషయంలో నాకు న్యాయం తీర్చండి’ అని అడుగుతూ ఉండేది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

3 ఆ పట్టణంలో ఒక విధవరాలు అతని దగ్గరకు తరచుగా వస్తూ, ‘నా విరోధి విషయంలో నాకు న్యాయం తీర్చండి’ అని అడుగుతూ ఉండేది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లూకా సువార్త 18:3
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసావు తండ్రిలేనివారి బలాన్ని అణగద్రొక్కావు.


చనిపోబోతున్నవారు నన్ను దీవించారు; విధవరాండ్ర హృదయాలు సంతోషించేలా చేశాను.


సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి. అణచివేయబడుతున్న వారి పక్షాన ఉండండి. తండ్రిలేనివారికి న్యాయం తీర్చండి. విధవరాలి పక్షాన వాదించండి.


వారు లావుగా నిగనిగలాడుతూ ఉన్నారు. వారి దుర్మార్గాలకు హద్దు లేదు; వారు న్యాయం కోరరు. వారు తండ్రిలేనివారి వాదనను వాదించరు; వారు పేదల న్యాయమైన కారణాన్ని సమర్థించరు.


“మీలో ఎవరైనా మీ విరోధితో నీకున్న వివాదం విషయంలో మీరిద్దరు న్యాయస్థానానికి వెళ్తున్నట్లయితే ఇంకా దారిలో ఉండగానే సమాధానపడడం మంచిది. లేకపోతే మీ విరోధి మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు, ఆ న్యాయాధిపతి మిమ్మల్ని అధికారికి అప్పగించి చెరసాలలో వేయించవచ్చు.


“ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుని భయం లేదు, మనుష్యులను లెక్క చేసేవాడు కాడు.


“అతడు కొంతకాలం వరకు ఆమె మాటలను తిరస్కరించాడు కానీ, అతడు తనలో తాను, ‘నేను దేవునికి భయపడకపోయినా లేదా మనుష్యులను లక్ష్యపెట్టక పోయినా,


ఈ విధవరాలు, “నాకు న్యాయం చేయండి” అని నన్ను తరచుగా తొందర పెడుతుంది, కాబట్టి ఆమె మాటిమాటికి వచ్చి నన్ను విసిగించకుండా, నేను ఆమెకు న్యాయం చేస్తాను’ అని అనుకున్నాడు.”


“విదేశీయుల పట్ల, తండ్రిలేనివారి పట్ల, విధవరాండ్ర పట్ల న్యాయం తప్పి తీర్పు తీర్చేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ