Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 7:31 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

31 యాజకుడు ఆ క్రొవ్వును బలిపీఠం మీద దహించాలి, కాని రొమ్ము భాగం అహరోను, అతని కుమారులకు చెందుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

31 యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

31 యాజకుడు బలిపీఠం పైన ఆ కొవ్వుని దహించాలి. కానీ రొమ్ము భాగం అహరోనుకీ అతని వారసులకీ చెందుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

31 అప్పుడు యాజకుడు బలిపీఠం మీద కొవ్వును దహించాలి. అయితే ఆ జంతువు బోర అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

31 యాజకుడు ఆ క్రొవ్వును బలిపీఠం మీద దహించాలి, కాని రొమ్ము భాగం అహరోను, అతని కుమారులకు చెందుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 7:31
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

అహరోనును ప్రతిష్ఠించడానికి పొట్టేలు రొమ్ము తీసుకుని యెహోవా ఎదుట పైకెత్తి దానిని ప్రత్యేక అర్పణగా అర్పించాలి. అది నీ వాటా అవుతుంది.


యాజకుడు వాటిని బలిపీఠం మీద యెహోవాకు హోమబలిగా దహించాలి.


యాజకుడు వాటిని హోమబలిగా యెహోవాకు ఇష్టమైన సువాసనగల అర్పణగా బలిపీఠం మీద కాల్చివేయాలి. కొవ్వంతా యెహోవాదే.


అహరోను కుమారులు బలిపీఠం మీద నిప్పుపై పేర్చిన కట్టెల మీద ఉన్న దహనబలితో పాటు వీటిని దహించాలి; అది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.


ఈ విధంగా యాజకుడు వారు చేసిన ఈ పాపాల్లో దేనికోసమైనా ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు. మిగిలిన అర్పణ, భోజనార్పణ మాదిరిగానే యాజకునికి చెందుతుంది.’ ”


అందులో మిగిలింది అహరోను అతని కుమారులు తినాలి, అయితే పరిశుద్ధాలయ ప్రాంతంలో పులియకుండా దానిని తినాలి; సమావేశ గుడారం యొక్క ఆవరణంలో వారు దానిని తినాలి.


పాపపరిహారం కోసం దానిని అర్పించే యాజకుడు దానిని తినాలి; పరిశుద్ధాలయ ప్రాంతంలో, సమావేశ గుడారం యొక్క ఆవరణంలో దానిని తినాలి.


ఇశ్రాయేలీయుల సమాధానబలులలో నుండి నేను పైకెత్తిన రొమ్ము భాగాన్ని, అర్పించిన తొడను తీసుకుని యాజకుడైన అహరోనుకు అతని కుమారులకు ఇశ్రాయేలీయుల నుండి శాశ్వత వాటాగా ఇచ్చాను.’ ”


యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ప్రతిష్ఠార్పణకు చెందిన పొట్టేలులో మోషే వాటాయైన రొమ్ము భాగాన్ని కూడా తీసి పైకెత్తి దానిని యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాడు.


“ఇది కూడా మీదే: ఇశ్రాయేలీయులు అర్పించే అర్పణలన్నిటిలో నుండి ప్రక్కన పెట్టబడినది. నేను నీకు, నీ కుమారులు కుమార్తెలకు మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను. మీ ఇంట్లో ఆచార ప్రకారంగా శుభ్రంగా ఉన్న ప్రతి ఒక్కరూ దానిని తినవచ్చు.


ప్రత్యేక అర్పణలోని బోర, కుడి తొడ ఎలాగో, వాటి మాంసం కూడా మీకు చెందుతుంది.


దేవాలయంలో పని చేసేవారు దేవాలయం నుండే తమ ఆహారాన్ని పొందుతారని, బలిపీఠం దగ్గర సేవ చేసేవారు బలిపీఠం మీద అర్పించిన వాటిలో పాలిభాగస్థులని మీకు తెలియదా?


ప్రజలు అర్పణలుగా తీసుకువచ్చే పశువులు, గొర్రెలు మేకల నుండి యాజకులకు చెందవలసిన వాటా: భుజం, లోపలి అవయవాలు, చెంపలు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ