Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 7:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 ఎవరైనా అపవిత్రమైన దాన్ని అది మానవ అపవిత్రత గాని అపవిత్రమైన జంతువునే గాని నేలపై ప్రాకే జీవులనే గాని తాకి, యెహోవాకు చెందిన సమాధానబలి మాంసం తింటే, వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.’ ”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 ఎవడు మనుష్యుల అపవిత్రతనేగాని అపవిత్రమైన జంతువునేగాని యే అపవిత్రమైన వస్తువునేగాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలిపశువు మాంసమును తినునోవాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 మనుష్యుల అపవిత్రతనైనా, ఏదన్నా జంతువు అపవిత్రతనైనా, లేదా అపవిత్రమైన, అసహ్యకరమైన వస్తువునైనా తాకి దాని తరువాత ఎవరైనా యెహోవాకి అర్పించే శాంతిబలి పశువు మాంసం తింటే అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

21 “ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా అపవిత్రమైన దాన్ని ముట్టవచ్చు. అది మనుష్యులచేత అపవిత్రం చేయబడిందే కావచ్చు, లేక అపవిత్రమైన జంతువు కావచ్చు, లేక అసహ్యకరమైన అపవిత్రత కావచ్చును. అలాంటివాడు అపవిత్రుడు. యెహోవాకు చెందిన సమాధాన బలి మాంసం అతడు తిన్నట్లయితే ఆ వ్యక్తిని అతని ప్రజల్లోనుండి వేరు చేయాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 ఎవరైనా అపవిత్రమైన దాన్ని అది మానవ అపవిత్రత గాని అపవిత్రమైన జంతువునే గాని నేలపై ప్రాకే జీవులనే గాని తాకి, యెహోవాకు చెందిన సమాధానబలి మాంసం తింటే, వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.’ ”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 7:21
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

సున్నతి చేయబడని మగవారు అంటే తన గోప్య చర్మానికి సున్నతి చేయబడనివారు తమ జనులలో నుండి బహిష్కరించబడాలి; ఎందుకంటే వారు నా నిబంధనను మీరారు.”


ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి. మొదటి రోజు మీ ఇండ్ల నుండి పులిసిన దాన్ని తీసివేయాలి, ఎందుకంటే మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకు పులిసిన దానితో చేసిన రొట్టెలు ఎవరు తిన్నా, వారు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడాలి.


ఎందుకంటే ఏడు రోజులు మీ ఇళ్ళలో పులిసినదేది ఉండకూడదు. విదేశీయులు గాని స్వదేశీయులు గాని పులిసినదేదైనా తింటే వారిని ఇశ్రాయేలు సమాజం నుండి కొట్టివేయబడాలి.


కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు మాంసంలో ఇంకా రక్తం ఉండగానే తింటూ, మీ విగ్రహాలవైపు చూస్తూ రక్తాన్ని చిందిస్తున్నారు, అలాంటి మీరు భూమిని స్వాధీనం చేసుకోగలరని అనుకుంటున్నారా?


అప్పుడు నేను, “అలా కాదు, ప్రభువా, యెహోవా! నన్ను నేను ఎప్పుడూ అపవిత్రం చేసుకోలేదు. నా చిన్నప్పటి నుండి ఇప్పటివరకు చనిపోయింది గాని అడవి జంతువులు చంపిన దానిని గాని నేను తినలేదు. ఏ అపవిత్రమైన మాంసం నా నోటిలోకి వెళ్లలేదు” అని అన్నాను.


“ ‘నాలుగు కాళ్లతో నడిచే ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవిగా మీరు భావించాలి.


యెహోవా మోషేతో ఇలా అన్నారు,


“ ‘ఇశ్రాయేలీయులలో గాని వారి మధ్యలో నివసించే విదేశీయులలో గాని ఎవరైనా రక్తాన్ని తింటే వారికి నేను విరోధంగా ఉంటాను, వారిని తమ ప్రజల నుండి తొలగిస్తాను.


ఎందుకంటే ప్రతి జీవికి ప్రాణం దాని రక్తము. అందుకే, “ప్రతి జీవికి ప్రాణం దాని రక్తం కాబట్టి మీరు ఏ ప్రాణి రక్తాన్నీ తినకూడదు. ఎవరైన దానిని తింటే వారు తొలిగించబడతారు” అని నేను ఇశ్రాయేలీయులకు ఆదేశించాను.


“ ‘ఎవరైనా ఇలాంటి హేయమైన కార్యాలు చేస్తే వారు ప్రజల్లో నుండి తొలగించబడతారు.


ఎవరైనా దానిని తింటే, యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రం చేసినందుకు వారు దోషశిక్షను భరిస్తారు; వారు తమ ప్రజల నుండి తొలగించబడాలి.


వారు తమ పిల్లలను మోలెకుకు బలి ఇచ్చి నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు, నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేశారు కాబట్టి నేను వారికి విరోధిగా మారి ప్రజల్లో నుండి వారిని తొలగిస్తాను.


“వారితో ఇలా చెప్పు: ‘రాబోయే తరాలలో మీ వారసులలో ఎవరైనా ఆచారరీత్య అపవిత్రులై ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్ర అర్పణల దగ్గరకు వస్తే, వారు నా సన్నిధిలో నుండి తొలగించబడాలి. నేను యెహోవాను.


“ ‘అహరోను సంతతిలో ఎవరికైనా కుష్ఠువ్యాధి గాని, స్రావ రోగం గాని ఉంటే వారు పవిత్రమయ్యేవరకు పవిత్ర పదార్థాలను తినకూడదు. వారు శవాన్ని గాని అపవిత్రమైన దేనినైనా గాని తాకినా లేదా వీర్యం విసర్జనతో ఉన్న ఎవరినైన తాకినా, వారు అపవిత్రం అవుతారు,


ఆ రోజున తమను తాము ఉపేక్షించుకొనని వారు తమ ప్రజల నుండి తొలగించబడాలి.


కాని అపవిత్రంగా ఉన్న ఎవరైనా యెహోవాకు చెందిన సమాధానబలి మాంసం తింటే, వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.


యెహోవా మోషేతో ఇలా అన్నారు,


ఎవరైనా యెహోవాకు హోమబలిగా అర్పించే జంతువు యొక్క క్రొవ్వును తింటే వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.


ఎవరైనా రక్తాన్ని తింటే వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.’ ”


అపవిత్రమైనవారు ఏది ముట్టిన అది అపవిత్రమే, ఎవరైనా దానిని ముట్టుకుంటే సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.”


రెక్కలు పొలుసులు లేనివాటిని మీరు తినకూడదు; అవి మీకు అపవిత్రమైనవి.


అసహ్యమైనదేది తినకూడదు.


“దావీదుకు ఏదో జరిగి అతడు ఆచారరీత్య అపవిత్రమై ఉంటాడు; ఖచ్చితంగా అతడు అపవిత్రుడు” అని సౌలు అనుకుని ఆ రోజు ఏమీ మాట్లాడలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ