Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 4:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

32 “ ‘ఎవరైనా తమ పాపపరిహారబలిగా గొర్రెపిల్లను తెస్తే, వారు లోపం లేని ఆడదానిని తీసుకురావాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

32 ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొఱ్ఱెను తీసికొనివచ్చినయెడల నిర్దోషమైనదాని తీసికొనివచ్చి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

32 ఎవరైనా ఒక వ్యక్తి పాపం కోసం బలి అర్పణగా లోపం లేని ఒక ఆడగొర్రెను తీసుకు రావాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

32 “ఈ వ్యక్తి తన పాపపరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను తీసుకొని వస్తే, అది ఏదోషమూలేని ఆడ గొర్రెయై ఉండాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

32 “ ‘ఎవరైనా తమ పాపపరిహారబలిగా గొర్రెపిల్లను తెస్తే, వారు లోపం లేని ఆడదానిని తీసుకురావాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 4:32
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇశ్రాయేలీయుల సమాజమంతటికి చెప్పండి, ఈ నెల పదవ రోజున ప్రతి మనిషి తన కుటుంబానికి ఒక గొర్రెను తీసుకోవాలి, ప్రతి ఇంటికి ఒకటి.


మీరు ఎంచుకున్న జంతువులు తప్పనిసరిగా ఏ లోపం లేని సంవత్సరపు మగవై ఉండాలి; వాటిని గొర్రెలలో నుండి కాని మేకలలో నుండి కాని తీసుకోవాలి.


అతడు పీడించబడి బాధించబడినా అతడు తన నోరు తెరవలేదు; వధించబడడానికి తేబడిన గొర్రెపిల్లలా, బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు, ఆయన తన నోరు తెరవలేదు.


“ ‘ఒకవేళ అర్పణ, మంద నుండి దహనబలి అయితే, మీరు లోపం లేని మగదానిని అర్పించాలి. అది యెహోవాకు అంగీకారంగా ఉండేలా మీరు దానిని సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర సమర్పించాలి.


వారు చేసిన పాపం తెలియ వచ్చినప్పుడు, వారు చేసిన పాపం కోసం తమ అర్పణగా లోపం లేని ఆడ మేకను తీసుకురావాలి.


వారు చేసిన పాపానికి జరిమానాగా, వారు మంద నుండి ఆడ గొర్రెపిల్ల లేదా మేకను పాపపరిహారబలిగా యెహోవా దగ్గరకు తీసుకురావాలి; యాజకుడు వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి.


అందుకు ఆ దూత, “పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.


మరుసటిరోజు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూసి, “చూడండి, లోక పాపాన్ని మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల!


అతడు నడచి వెళ్తున్న యేసు చూసి, “చూడండి, దేవుని గొర్రెపిల్ల!” అని చెప్పాడు.


దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాంటిది మరేది లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా మహిమ కలదిగా తన ముందు నిలబెట్టుకోవాలని, దాని కోసం తనను తాను సమర్పించుకున్నారు.


పరిశుద్ధుడు, నిందారహితుడు, పవిత్రుడు, పాపుల నుండి ప్రత్యేకించబడినవాడు, ఆకాశాల కంటే పైగా హెచ్చింపబడినవాడు, మన అవసరాలను తీర్చగల ప్రధాన యాజకుడు.


నిత్యమైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొన్న క్రీస్తు రక్తం, మనం జీవంగల దేవుని సేవించేలా, మరణానికి నడిపించే వ్యర్థమైన క్రియల నుండి మన మనస్సాక్షిని ఇంకెంత ఎక్కువగా పవిత్రపరుస్తుంది!


“ఆయన ఎలాంటి పాపం చేయలేదు, ఆయన నోటిలో ఏ మోసం లేదు.”


మనం పాపాల విషయంలో మరణించి నీతి కోసం జీవించేలా ఆయన, “మన పాపాలను తనపై ఉంచుకుని సిలువను మోసారు. ఆయన పొందిన గాయాల వల్ల మీరు స్వస్థత పొందారు.


ఎందుకంటే, దేవుని దగ్గరకు తీసుకురావడానికి, అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపాల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డారు.


అప్పుడు సింహాసనం మధ్య, ఆ నాలుగు ప్రాణులు, పెద్దల మధ్య వధించబడినట్లు ఉన్న ఒక గొర్రెపిల్లను చూశాను. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ల ఉన్నాయి, అవి దేవుడు భూలోకమంతటి మీదికి పంపిన దేవుని ఏడు ఆత్మలు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ