Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 23:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

27 “ఈ ఏడవ నెల పదవ రోజు ప్రాయశ్చిత్త దినము. పరిశుద్ధ సభ నిర్వహించి, మీరు ఉపవాసముండాలి, యెహోవాకు హోమబలి సమర్పించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

27 –ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

27 “ఈ ఏడో నెల పదవ రోజు పాపానికి ప్రాయశ్చిత్తం చేసే రోజు. అ రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకుని యెహోవాకు హోమం చేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

27 “ఏడవ నెల పదవరోజు ప్రాయశ్చిత్త దినంగా ఉంటుంది. ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు భోజనం చేయకూడదు, యెహోవాకు మీరు హోమ అర్పణ తీసుకొని రావాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

27 “ఈ ఏడవ నెల పదవ రోజు ప్రాయశ్చిత్త దినము. పరిశుద్ధ సభ నిర్వహించి, మీరు ఉపవాసముండాలి, యెహోవాకు హోమబలి సమర్పించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 23:27
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు అక్కడ అహవా కాలువ దగ్గర, మనమందరం ఉపవాసం ఉండి, మన దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకుని మనకు మన పిల్లలకు మన ఆస్తి అంతటికి క్షేమకరమైన ప్రయాణాన్ని ఇవ్వమని వేడుకుందామని నేను ప్రకటించాను.


అయినాసరే వారికి జబ్బు చేసినప్పుడు, నేను గోనెపట్ట చుట్టుకున్నాను, ఉపవాసముండి నన్ను నేను తగ్గించుకున్నాను. నా ప్రార్థనలకు జవాబు రానప్పుడు,


సంవత్సరానికి ఒకసారి అహరోను దాని కొమ్ముల మీద ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ వార్షిక ప్రాయశ్చిత్తం రాబోయే తరాల కోసం ప్రాయశ్చిత్త పాపపరిహారబలి రక్తంతో చేయాలి. అది యెహోవాకు అతిపరిశుద్ధమైనది.”


ఇలాంటి ఉపవాసమా నేను కోరుకున్నది? మనుష్యులు ఆ ఒక్కరోజు తమను తాము తగ్గించుకుంటే సరిపోతుందా? ఒకడు జమ్ము రెల్లులా తలవంచుకొని గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చోవడమే ఉపవాసమా? యెహోవాకు ఇష్టమైన ఉపవాసం ఇదేనని మీరనుకుంటున్నారా?


“అహరోను పాపపరిహారబలిగా ఒక కోడెదూడను తన కోసం తన ఇంటివారి ప్రాయశ్చిత్తం కోసం తీసుకురావాలి, దానిని తన పాపపరిహారబలిగా వధించాలి.


“తర్వాత అతడు ప్రజల పాపపరిహారబలి కోసం మేకపోతును వధించాలి, దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తెచ్చి కోడె రక్తాన్ని చేసినట్టు ప్రాయశ్చిత్త మూత మీద, దాని ముందు చిలకరించాలి.


ఇశ్రాయేలీయుల అపవిత్రత కోసం, తిరుగుబాటు కోసం, వారి పాపాలన్నిటి కోసం అతడు అతి పరిశుద్ధ స్థలానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ఇశ్రాయేలీయుల అపవిత్రత మధ్య వారి మధ్యలో ఉన్న సమావేశ గుడారం కోసం కూడా ఇదే రీతిలో ప్రాయశ్చిత్తం చేయాలి.


అతడు పరిశుద్ధాలయ ప్రాంగణంలో నీటితో స్నానం చేసి తన సాధారణ బట్టలు వేసుకోవాలి. బయటకు వచ్చి తన కోసం దహనబలిని, ప్రజల పక్షాన మరో దహనబలిని అర్పించి తన కోసం, ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.


యెహోవా మోషేతో అన్నారు,


ఆ రోజు ఎలాంటి పని చేయకూడదు, ఎందుకంటే అది ప్రాయశ్చిత్త దినం, మీ దేవుడైన యెహోవా ఎదుట మీ కోసం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది.


ఏడవ నెల పదవ రోజు అంతటా బూరధ్వని చేయాలి. ప్రాయశ్చిత్త దినాన మీ దేశమంతటా ఈ బూరధ్వని చేయాలి.


“అప్పుడు దావీదు వంశీయుల మీద యెరూషలేము నివాసుల మీద కనికరంగల ఆత్మను విన్నపం చేసే ఆత్మను కుమ్మరిస్తాను. వారు తాము పొడిచిన నన్ను చూసి, ఒకరు తన ఒక్కగానొక్క బిడ్డ కోసం విలపించినట్లు, తన మొదటి కుమారుని కోసం దుఃఖపడునట్లు, ఆయన విషయంలో దుఃఖిస్తూ విలపిస్తారు.


చాలా కాలం గడిచిపోయింది, ప్రయాణం చేయడం ఇప్పటికే ప్రమాదకరంగా మారింది, అప్పటికి ప్రాయశ్చిత్త దినం కూడా గతించింది. కాబట్టి పౌలు వారిని,


విచారపడుతూ దుఃఖిస్తూ కన్నీరు కార్చండి. మీ నవ్వును దుఃఖంగా, మీ సంతోషాన్ని విచారంగా మార్చుకోండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ