Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 21:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 అయినాసరే అతనికున్న లోపం కారణంగా అతడు తెర దగ్గరకు వెళ్లకూడదు, బలిపీఠం దగ్గరకు వెళ్లకూడదు, నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేయకూడదు. వారిని పరిశుద్ధులుగా చేసే యెహోవాను నేనే.’ ”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 మెట్టుకు అతడు కళంకముగలవాడు గనుక అడ్డతెరయెదుటికి చేరకూడదు; బలిపీఠమును సమీపింపకూడదు; నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 మొత్తం మీద అతడు అవిటితనం గలవాడు గనక అడ్డతెర ఎదుటికి అతడు రాకూడదు. బలిపీఠం సమీపించకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 కానీ అతడు మాత్రం తెరలోపలి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లకూడదు, బలిపీఠం దగ్గరకు గూడ అతడు వెళ్లగూడదు. ఎందుచేతనంటే అతనిలో ఏదో తప్పు ఉంది. అతడు నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేయకూడదు. నేను యెహోవాను ఆ స్థలాల్ని పరిశుద్ధం చేస్తాను!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 అయినాసరే అతనికున్న లోపం కారణంగా అతడు తెర దగ్గరకు వెళ్లకూడదు, బలిపీఠం దగ్గరకు వెళ్లకూడదు, నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేయకూడదు. వారిని పరిశుద్ధులుగా చేసే యెహోవాను నేనే.’ ”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 21:23
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా దేవా! వారు యాజకత్వ వృత్తిని, యాజక నిబంధనలను, లేవీయుల నిబంధనను అపవిత్రం చేశారు కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి.


“ ‘తమను అపవిత్రం చేసే వాటినుండి మీరు ఇశ్రాయేలీయులను దూరంగా ఉంచాలి, తద్వార వారి మధ్య ఉన్న నా నివాస స్థలాన్ని వారు అపవిత్రం చేసినందుకు వారి అపవిత్రతలో వారు చావరు.’ ”


“నీవు ఇశ్రాయేలు సమాజమంతటితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘మీరు పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను.


“ ‘నేనే మీ దేవుడైన యెహోవాను కాబట్టి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని పవిత్రంగా ఉండాలి.


అతడు తన దేవుని అభిషేక తైలంతో ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి అతడు తన దేవుని పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టకూడదు, దానిని అపవిత్రం చేయకూడదు. నేను యెహోవాను.


అతడు తన దేవునికి అర్పించే అతి పవిత్రమైన ఆహారాన్ని గాని పవిత్రమైన ఆహారాన్ని తినవచ్చు;


మోషే అహరోనుకు అతని కుమారులకు ఇశ్రాయేలీయులందరికి ఈ విషయాలు చెప్పాడు.


వారు తమ దేవునికి పరిశుద్ధులై ఉండాలి. వారు తమ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. వారు దేవుని ఆహారమైన హోమబలులను యెహోవాకు సమర్పిస్తారు కాబట్టి వారు పరిశుద్ధులై ఉండాలి.


వారి మీదికి అపరాధపరిహార రుసుము చెల్లించుకునేలా చేయకూడదు. వారిని పరిశుద్ధపరచే యెహోవాను నేనే.’ ”


గ్రుడ్డి మూర్ఖులారా! ఏది గొప్పది? బంగారమా, లేదా బంగారాన్ని పరిశుద్ధపరచే దేవాలయమా?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ