Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 13:59 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

59 ఉన్ని లేదా నార దుస్తుల్లో గాని నేసిన లేదా అల్లిన వస్త్రాల్లో గాని చర్మంతో చేసిన వస్తువులలో గాని కుష్ఠు మరకలు ఉంటే, వాటిని పవిత్రమైనవిగా గాని అపవిత్రమైనవిగా గాని ప్రకటించడానికి ఈ నియమాలు వర్తిస్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

59 అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్ట యందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలు వస్తువులయందేగాని యుండు కుష్ఠు పొడనుగూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణ యింపవలసిన విధి యిదే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

59 ఉన్ని బట్టల పైనో, నార బట్టలపైనో, పడుగుపైనో, పేకపైనో తోలు వస్తువులపైనో బూజూ, తెగులూ కన్పించినప్పుడు వాటిని అశుద్ధం అనో శుద్ధం అనో ప్రకటించడానికి ఉద్దేశించిన చట్టం ఇది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

59 తోలు ముక్కలు లేక బట్టముక్కల మీద బూజుపొడకు సంబంధించిన నియమాలు అవి. బట్ట కుట్టింది గాని అల్లిందిగాని ఫర్వాలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

59 ఉన్ని లేదా నార దుస్తుల్లో గాని నేసిన లేదా అల్లిన వస్త్రాల్లో గాని చర్మంతో చేసిన వస్తువులలో గాని కుష్ఠు మరకలు ఉంటే, వాటిని పవిత్రమైనవిగా గాని అపవిత్రమైనవిగా గాని ప్రకటించడానికి ఈ నియమాలు వర్తిస్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 13:59
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

“అపవిత్రమైన మరకతో పాడైన వస్త్రానికి సంబంధించి, అవి ఉన్నివైనా లేదా నార వస్త్రాలైనా,


నారతో నేసిన వస్త్రాలైనా లేదా ఉన్నితో అల్లిన వస్త్రాలైనా, చర్మమైనా, చర్మంతో చేసినవైనా,


వస్త్రమైనా, నేసినదైనా అల్లినదైనా, చర్మంతో చేసిన వస్తువైనా సరే ఉతికిన తర్వాత మరక తొలగిపోతే దానిని మళ్ళీ ఉతకాలి. అప్పుడు అది పవిత్రమవుతుంది.”


యెహోవా మోషేతో ఇలా అన్నారు,


“ఎవరైనా అనారోగ్య వ్యక్తిని వారి ఆచారరీత్య శుద్ధీకరణ పాటిస్తున్న సమయంలో, యాజకుని దగ్గరకు తీసుకువచ్చినప్పుడు పాటించవలసిన నియమాలు ఇవి:


తీవ్రమైన కుష్ఠువ్యాధి ఉండి తమ శుద్ధీకరణకు తీసుకురావలసిన అర్పణలను తీసుకురావడానికి స్థోమతలేని వారికి సంబంధించిన నియమాలు ఇవి.


అవి పవిత్రమైనవా అపవిత్రమైనవా అని ఈ నిబంధనలు తెలియజేస్తాయి. కుష్ఠువ్యాధులు, అపవిత్రపరచే మరకలకు సంబంధించిన నియమాలు ఇవే.


“ ‘తమను అపవిత్రం చేసే వాటినుండి మీరు ఇశ్రాయేలీయులను దూరంగా ఉంచాలి, తద్వార వారి మధ్య ఉన్న నా నివాస స్థలాన్ని వారు అపవిత్రం చేసినందుకు వారి అపవిత్రతలో వారు చావరు.’ ”


ఈ నియమాలు స్రవిస్తున్న వ్యక్తికి వీర్యస్కలనం వలన అపవిత్రమైన వారికి ఈ నియమాలు వర్తిస్తాయి.


ఇవి భార్యా భర్తల సంబంధం, యవ్వన కుమార్తె తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తండ్రికి తనకు మధ్య ఉండవలసిన సంబంధం గురించి యెహోవా మోషేకు ఇచ్చిన నియమాలు.


ఇవి మోయాబు సమతల మైదానంలో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ప్రాంతంలో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు, నియమాలు ఇచ్చారు.


“ ‘ఇది అసూయకు సంబంధించిన నియమము. ఒక స్త్రీ తన భర్తతో దాంపత్య సంబంధం కలిగి ఉన్నప్పుడు త్రోవ తప్పి తనను తాను అపవిత్రపరచుకుంటే,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ