Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 4:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 మమ్మల్ని వెంటాడుతున్నవారు ఆకాశంలో ఎగిరే గ్రద్ద కంటే వేగంగా ఉన్నారు; పర్వతాల మీదుగా మమల్ని వెంబడించి ఎడారిలో మాకోసం వేచి ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్న వడిగలవారు పర్వతములమీద వారు మమ్మును తరుముదురు అరణ్యమందు మాకొరకు పొంచియుందురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 మమ్మల్ని తరిమే వాళ్ళు ఆకాశంలో ఎగిరే గద్దలకన్నా వేగం గల వాళ్ళు. పర్వతాల్లోకి వాళ్ళు మమ్మల్ని తరిమారు. అరణ్యంలో మా కోసం కాచుకుని ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 మమ్మల్ని వేటాడిన మనుష్యులు ఆకాశంలో గద్దల కంటె వేగవంతులు. ఆ మనుష్యులు మమ్మల్ని పర్వతాలలోకి తరిమివేశారు. మమ్మల్ని పట్టుకోవటానికి వారు ఎడారిలో మాటువేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 మమ్మల్ని వెంటాడుతున్నవారు ఆకాశంలో ఎగిరే గ్రద్ద కంటే వేగంగా ఉన్నారు; పర్వతాల మీదుగా మమల్ని వెంబడించి ఎడారిలో మాకోసం వేచి ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 4:19
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

“అయితే వారిని పట్టుకోడానికి నేను చాలామంది చేపలు పట్టేవారిని పిలిపిస్తాను. ఆ తర్వాత వారిని ప్రతి పర్వతం మీద కొండమీద రాళ్ల పగుళ్లలో నుండి వేటాడడానికి చాలామంది వేటగాళ్లను పిలుస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు.


చూడు! అతడు మేఘాల్లా ముందుకు సాగిపోతాడు, అతని రథాలు సుడిగాలిలా వస్తాయి, అతని గుర్రాలు గ్రద్దల కంటే వేగవంతమైనవి. అయ్యో మాకు శ్రమ! మేము నాశనం అయ్యాము!


“ఆయన పైనుండి అగ్ని పంపారు, దాన్ని నా ఎముకల్లోకి పంపారు. నా పాదాలకు వలవేసి నన్ను వెనుకకు తిరిగేలా చేశారు. ఆయన నన్ను నిర్జనంగా చేశారు, నేను బాధతో మూర్ఛపోయాను.


“బూర నీ పెదవులపై పెట్టుకో! ఒక గ్రద్ద యెహోవా ఇంటి మీద వ్రాలింది. ఎందుకంటే ప్రజలు నా నిబంధనను మీరి, నా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు.


కాని ఇశ్రాయేలు మంచి దానిని విసర్జించారు; కాబట్టి శత్రువులు వారిని తరుముతారు.


“ ‘మీలో మిగిలిన వారికైతే, వారి శత్రువుల దేశాల్లో గాలికి ఆకులు అల్లాడితే పారిపోవునంతగా వారి హృదయాలు ఎంతో భయపడేలా చేస్తాను. ఖడ్గం నుండి వారు పారిపోతున్నట్టు వారు పరుగెత్తుతారు, ఎవరు తరమకుండానే వారు పడిపోతారు,


వేగంగా పరుగెత్తేవారు తప్పించుకోలేరు, బలాఢ్యులు ధైర్యం తెచ్చుకోలేరు, వీరుడు తన ప్రాణాన్ని రక్షించుకోలేడు.


వారి గుర్రాలు చిరుతపులి కంటే వేగవంతమైనవి, చీకట్లలో తిరిగే తోడేళ్ళ కంటే భయంకరమైనవి. వారి గుర్రాల దండు దూకుడుగా చొరబడతాయి; వారి రౌతులు దూరం నుండి వస్తారు. ఎరను పట్టుకోవడానికి గ్రద్ద వచ్చినట్లుగా వారు వేగంగా వస్తారు;


యెహోవా మీకు వ్యతిరేకంగా దూర ప్రాంతాల నుండి, భూమి చివర్ల నుండి, ఒక గ్రద్ద దూసుకు వస్తున్నట్లుగా, మీకు అర్థం చేసుకోలేని భాష మాట్లాడే ఒక దేశాన్ని తెస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ