19 ఓ యెహోవా, నా దుఃఖాన్ని, నేను నా నివాసాన్ని కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకొనుము. నీవు నాకిచ్చిన చేదుపానీయాన్ని, విషం (శిక్ష) కలిపిన పానీయాలను జ్ఞాపకం పెట్టుకొనుము.
“మా దేవా! గొప్ప దేవా! మహా బలవంతుడా! పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు చేసిన మీ ప్రేమ నిబంధన నెరవేరుస్తున్నారు. అష్షూరు రాజుల కాలం నుండి ఈ రోజు వరకు మా మీదికి, మా రాజులు నాయకుల మీదికి, మా యాజకులు ప్రవక్తల మీదికి, మా పూర్వికుల మీదికి మీ ప్రజలందరి మీదికి వచ్చిన శ్రమలు మీ దృష్టికి చిన్న విషయంగా ఉండకూడదు.
మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? మనం ఒక్కచోట చేరి, కోటగోడలు గల పట్టణాలకు పారిపోయి అక్కడ నశించుదాం! మన దేవుడైన యెహోవా మనకు నాశనాన్ని విధించి, మనకు త్రాగడానికి విషం కలిపిన నీళ్లు ఇచ్చారు, ఎందుకంటే మనం ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశాము.