Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 2:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 ప్రభువు ఒక శత్రువులా; ఇశ్రాయేలును నాశనం చేశారు. ఆమె రాజభవనాలన్నింటిని ఆయన కూల్చివేశారు, అలాగే ఆమె కోటలను నాశనం చేశారు. ఆయన యూదా కుమార్తె కోసం దుఃఖాన్ని, విలాపాన్ని అధికం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 ప్రభువు శత్రువాయెను ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటిని నాశనముచేసియున్నాడు దాని కోటలను పాడుచేసియున్నాడు యూదా కుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 ప్రభువు శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగివేశాడు. దాని రాజమందిరాలన్నీ మింగివేశాడు. దానికి పట్టున్న ప్రాంతాలన్నీ నాశనం చేశాడు. యూదా కుమారిలో దుఃఖం, సంతాపం అధికం చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 యెహోవా ఒక శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగేశాడు. ఆయన దాని స్థలాలన్నిటినీ మింగేశాడు. ఆయన దాని కోటలన్నిటినీ మింగేశాడు. మృతుల కొరకు యూదా కుమార్తెలో మిక్కిలి దుఃఖాన్ని, బాధను కలుగ జేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 ప్రభువు ఒక శత్రువులా; ఇశ్రాయేలును నాశనం చేశారు. ఆమె రాజభవనాలన్నింటిని ఆయన కూల్చివేశారు, అలాగే ఆమె కోటలను నాశనం చేశారు. ఆయన యూదా కుమార్తె కోసం దుఃఖాన్ని, విలాపాన్ని అధికం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 2:5
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని యెరూషలేములోని ఇళ్ళన్నిటిని తగలబెట్టాడు. అతడు ప్రతి ప్రాముఖ్య భవనాన్ని తగలబెట్టాడు.


ఎందుకు మీ ముఖాన్ని దాచుకుంటున్నారు? ఎందుకు నన్ను శత్రువుగా భావిస్తున్నారు?


నా మీద ఆయన కోపం రగులుకుంది; ఆయన నన్ను తన శత్రువుగా భావించారు.


మీరు అతని ప్రాకారపు గోడలు పడగొట్టారు అతని బలమైన కోటలను పాడుచేశారు.


దారిన వెళ్లే వారందరూ అతన్ని దోచుకున్నారు; అతని పొరుగువారు అతడిని అపహాస్యం చేశారు.


అయినా నేను అరీయేలును ముట్టడిస్తాను; అది దుఃఖించి రోదిస్తుంది. అది నాకు అగ్నిగుండంలా అవుతుంది.


అయినా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. కాబట్టి ఆయన వారికి శత్రువయ్యారు తానే వారితో యుద్ధం చేశారు.


అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “మోషే, సమూయేలు నా ముందు నిలబడినా, నా హృదయం ఈ ప్రజల వైపుకు వెళ్లదు. వారిని నా సన్నిధి నుండి దూరంగా పంపివేయి! వారిని వెళ్లనివ్వు!


‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు అని చెప్పండి: బబులోను రాజుతో ప్రాకారం బయట ఉన్న బబులోను వారితో పోరాడేందుకు మీరు ఉపయోగించే యుద్ధ ఆయుధాలను నేను మీ మీదికే త్రిప్పబోతున్నాను. నేను వాటిని ఈ పట్టణం లోపల పోగుచేయిస్తాను.


నీ స్నేహితులందరు నిన్ను మరచిపోయారు; వారు నీ గురించి ఏమీ పట్టించుకోరు. శత్రువు కొట్టినట్లుగా నేను నిన్ను కొట్టి, క్రూరమైనవానిలా నిన్ను శిక్షించాను, ఎందుకంటే నీ అపరాధం చాలా పెద్దది, నీ పాపాలు చాలా ఎక్కువ.


అతడు యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని యెరూషలేములోని ఇళ్ళన్నిటిని తగలబెట్టాడు. అతడు ప్రతి ప్రాముఖ్య భవనాన్ని తగలబెట్టాడు.


దయ లేకుండా ప్రభువు యాకోబు నివాసాలన్నింటినీ నాశనం చేశారు. తన కోపంలో ఆయన తన కుమార్తెయైన యూదా కోటలను పడగొట్టారు. ఆయన ఆమె రాజ్యాన్ని, దాని అధిపతులను అగౌరపరచి నేలకూల్చారు.


ఒక శత్రువులా ఆయన తన విల్లు ఎక్కుపెట్టారు; ఆయన కుడిచేయి సిద్ధంగా ఉంది. ఆయన ఒక శత్రువులా కంటికి నచ్చిన వారందరినీ చంపేశారు; ఆయన తన కోపాన్ని అగ్నిలా సీయోను కుమార్తె గుడారం మీద కుమ్మరించారు.


ఆయన దానిని నా ముందు తెరిచారు. దానికి రెండు వైపులా విలాపం, దుఃఖం శ్రమ అనే మాటలు వ్రాసి ఉన్నాయి.


అందుకు సమూయేలు, “యెహోవా నిన్ను విడిచిపెట్టి నీకు శత్రువైనప్పుడు నీవు నన్ను ఎందుకు అడుగుతావు?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ