Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 2:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 నీ ప్రవక్తల దర్శనాలు అబద్ధం, పనికిరానివి; చెర నుండి నిన్ను తప్పించడానికి వారు నీ పాపాన్ని బయటపెట్టలేదు. వారు నీకు చెప్పిన ప్రవచనాలు అబద్ధం, తప్పుదారి పట్టించేవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థదర్శనములు చూచియున్నారు నీవు చెరలోనికి పోకుండ తప్పించుటకైవారు నీ దోషములను నీకు వెల్లడిచేయలేదు.వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవతప్పించు దర్శనములు చూచినవారైరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 నీ కోసం నీ ప్రవక్తలు మోసపూరితమైన బుద్ధిహీనపు దర్శనాలు చూశారు. నువ్వు చెర లోకి వెళ్ళకుండా తప్పించడానికి వాళ్ళు నీ పాపాన్ని నీకు వెల్లడి చెయ్యలేదు. వాళ్ళు నీ కోసం మోసపూరితంగా దర్శనాలు గ్రహించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 నీ ప్రవక్తలు నీ కొరకు దర్శనాలు చూశారు. కాని వారి దర్శనాలన్నీ విలువలేని అబద్ధాలు. పాపం చేయవద్దని వారు నిన్ను హెచ్చరించలేదు. పరిస్థితి మెరుగుపర్చటానికి వారు ఎట్టి ప్రయత్నమూ చేయలేదు. వారు నీకొరకు ఉపదేశాలు అందించారు. కాని, అవి కేవలం నిన్ను మోసగించటానికి ఉద్దేశించబడిన అబద్ధపు వర్తమానాలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 నీ ప్రవక్తల దర్శనాలు అబద్ధం, పనికిరానివి; చెర నుండి నిన్ను తప్పించడానికి వారు నీ పాపాన్ని బయటపెట్టలేదు. వారు నీకు చెప్పిన ప్రవచనాలు అబద్ధం, తప్పుదారి పట్టించేవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 2:14
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

“గట్టిగా కేకలు వేయండి, ఆపకండి. బూర ఊదినట్లు మీ స్వరం వినిపించండి. నా ప్రజలకు వారు చేసిన తిరుగుబాటును తెలియజేయండి, యాకోబు వారసులకు వారి పాపాలను తెలియజేయండి.


యాజకులు ‘యెహోవా ఎక్కడ ఉన్నారు?’ అని అడగలేదు. ధర్మశాస్త్రాన్ని బోధించే వారికి నేను తెలియదు; నాయకులు నా మీదికి తిరుగబడ్డారు. ప్రవక్తలు పనికిరాని విగ్రహాలను పూజిస్తూ, బయలు పేరిట ప్రవచించారు.


పషూరు, నీవు, నీ ఇంట్లో నివసించే వారందరూ బబులోనుకు బందీలుగా వెళ్తారు. అక్కడ మీరు, మీ అబద్ధాల ప్రవచనాలతో మీరు మోసగించిన మీ స్నేహితులందరూ చనిపోయి పాతిపెట్టబడతారు.’ ”


కానీ ఒకవేళ వారు నా సభలో నిలబడి ఉంటే, వారు నా ప్రజలకు నా మాటలు ప్రకటించి వారి చెడు మార్గాల నుండి వారి చెడు పనుల నుండి వారిని తప్పించి ఉండేవారు.


కానీ మీరు ‘యెహోవా సందేశం’ అని చెప్పకూడదు, ఎందుకంటే ఎవరి మాట వారికి సందేశం అవుతుంది. మీరు సజీవుడైన దేవుని మాటలను, మన దేవుడైన సైన్యాల యెహోవా మాటలను తారుమారు చేశారు.


అప్పుడు యిర్మీయా ప్రవక్త హనన్యా ప్రవక్తతో ఇలా అన్నాడు: “విను హనన్యా! యెహోవా నిన్ను పంపలేదు, అయినప్పటికీ నీ అబద్ధాలను ఈ ప్రజలు నమ్మేలా చేశావు.


ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా, నా పేరిట మీకు అబద్ధాలు ప్రవచిస్తున్న కోలాయా కుమారుడైన అహాబు, మయశేయా కుమారుడైన సిద్కియా గురించి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను వారిని బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాను, అతడు మీ కళ్లముందే వారిని చంపేస్తాడు.


‘బబులోను రాజు మీ మీదా, ఈ దేశం మీదా దాడి చేయడు’ అని మీకు ప్రవచించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు?


ప్రవక్తలు అబద్ధాలను ప్రవచిస్తున్నారు, యాజకులు తమ సొంత అధికారంతో పరిపాలిస్తున్నారు, నా ప్రజలు ఇలాగే ఇష్టపడుతున్నారు. అయితే చివరికి మీరేం చేస్తారు?


అయితే అది ఎందువల్ల జరిగిందంటే, నీతిమంతుల రక్తాన్ని చిందించిన దాని ప్రవక్తల పాపాల వల్ల, దాని యాజకుల దోషాల వల్ల జరిగింది.


ఇదంతా ఎందుకంటే, నేను దుఃఖపరచని నీతిమంతుల హృదయాన్ని అబద్ధాలతో మీరు దుఃఖపెట్టారు. దుర్మార్గులు తమ చెడు మార్గాలు వదిలిపెట్టి తమ ప్రాణాలను కాపాడుకోకుండ మీరు వారిని ప్రోత్సహించారు.


సింహం గర్జిస్తూ వేటను చీల్చేటట్లు దానిలో దాని ప్రవక్తలు కుట్ర చేస్తారు. వారు మనుష్యులను మ్రింగివేస్తారు. ప్రజల సంపదను విలువైన వస్తువులను దోచుకుంటారు. చాలామందిని విధవరాండ్రుగా చేస్తారు.


దాని ప్రవక్తలు తప్పుడు దర్శనాలు అబద్ధపు శకునాలు చూస్తూ యెహోవా ఏమి చెప్పనప్పటికి ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే అని తమ పనులను కప్పిపుచ్చుకుంటారు.


యెహోవా నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఒహోలాకు, ఒహోలీబాకు నీవు తీర్పు తీరుస్తావా? వారు చేసిన అసహ్యమైన పనులను వారికి తెలియజేయి.


శిక్షా దినాలు వస్తున్నాయి, వెల చెల్లించే దినాలు సమీపంగా ఉన్నాయి. ఇశ్రాయేలు దీనిని తెలుసుకోవాలి. ఎందుకంటే మీ అపరాధాలు అనేకం, మీరు చూపిన శత్రుత్వం తీవ్రమైంది కాబట్టి ప్రవక్త మూర్ఖునిగా, ప్రభావం గల వ్యక్తి పిచ్చివానిగా పరిగణించబడుతున్నారు.


ఒకవేళ అబద్ధికుడు మోసగాడు వచ్చి, ‘ద్రాక్షరసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచిస్తాను’ అంటే, వాడే ఈ ప్రజలకు తగిన ప్రవక్త!


నేనైతే, యాకోబుకు అతని అతిక్రమాన్ని ఇశ్రాయేలుకు అతని పాపాన్ని తెలియజేయడానికి, యెహోవా ఆత్మను పొంది శక్తితో నింపబడి ఉన్నాను, న్యాయబుద్ధితో, బలంతో ఉన్నాను.


దాని ప్రవక్తలు నీతిలేనివారు; వారు నమ్మకద్రోహులు. దాని యాజకులు పరిశుద్ధస్థలాన్ని అపవిత్రం చేస్తారు ధర్మశాస్త్రాన్ని హింసిస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ